న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వద్ద అవసరమైతే మళ్లీ సర్జికల్ స్ర్టైక్స్ చేపడతామని నార్తర్న్ కమాండెంట్.. లెఫ్టినెంట్ జనరల్ దేవరాజ్ అన్బు ప్రకటించారు. చైనా, పాకిస్తాన్‌లతో ఏకకాలంలో అయిన యుద్ధం చేసే సత్తా భారత్‌కు ఉందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించి రోజు గడవకుందే.. అన్బు ఇటువంటి ప్రకటన చేయడం గమనార్హం.
నియంత్రణ రేఖ అనేది ఒక ఊహాత్మక గీత.. అవసరమైన సమయంలో దానిని దాటేందుకు పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు వద్ద సర్జికల్ స్ర్టయిక్స్ చేయాల్సివస్తే.. అందుకు సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించారు. సరిహద్దు రేఖ వద్ద గతంలోకన్నా ఇప్పుడు లాంచింగ్ పాడ్స్, టెర్రరిస్ట్ క్యాంప్స్ అధికంగా ఏర్పడ్డాయని చెప్పారు. దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదుల ప్రయత్నిస్తే.. వారిని ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు ఎప్పడూ సిద్ధంగా ఉంటాయని చెప్పారు.