విలేకరులతో మాట్లాడుతున్న లూటెనంట్ జనరల్ దేవరాజ్ అన్బు
జమ్మూ : భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) అవతల 300 మందికి పైగా ఉగ్రవాదులు రెడీగా ఉన్నారని బుధవారం భారత ఆర్మీ తెలిపింది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడులు చేయించడంలో పాకిస్తాన్ ఆర్మీ కీలక పాత్ర నిర్వహిస్తోందని కూడా తెలిపింది. లూటెనంట్ జనరల్ దేవరాజ్ అన్భు బుధవారం ఉదంపూర్‌లోని ఆర్మీ నార్తర్న్ కమాండ్ హెడ్‌క్వార్టర్‌లో మాట్లాడారు. పీర్ పంజల్ శ్రేణికి దక్షిణం నుంచి 185 నుంచి 220 మంది, ఉత్తరం వైపు నుంచి 190 నుంచి 225 మంది ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
నియంత్రణ రేఖ వెంబడి కాపలా చాలా కష్టతరమైందని, చాలెంజింగ్ కూడిన విషయమన్నారు. శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు తమ వ్యూహాలు తమకు ఉన్నాయని చెప్పారు. భారత ఎదురు కాల్పుల్లో సుమారు 192 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని వెల్లడించారు. గత రెండు సంఘటనల్లో కేవలం ఆరేడుగురు మాత్రమే చనిపోయినట్లు పాకిస్తాన్ చెప్పుకుంటుందని, కానీ పెద్ద సంఖ్యలో పాక్ సైనికులు చనిపోయారని దేవరాజ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment