జమ్మూ: కశ్మీర్‌లో పూంచ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్వోసీ) వెంబడి ఉన్న భారత ఆర్మీ పోస్టులు, జనావాసాలపై పాకిస్తాన్ ఆయుధాలతో విరుచుకుపడింది. పాక్ ప్రయోగించిన మోర్టార్ షెల్ కర్మరాలోని ఓ ఇంటి సమీపంలో పేలడంతో మొహమ్మద్ షౌకత్ అనే జవానుతో పాటు అతని భార్య సఫియా బీ దుర్మరణం చెందారు. వీరి ముగ్గురు కుమార్తెలు జైదా(6), రుబీనా(12), నజియా గాయపడ్డారు. పాకిస్తాన్ దాడిని భారత బలగాలు వెంటనే దీటుగా తిప్పికొట్టాయి. ఖదీ, కర్మరా, గుప్లూర్ ప్రాంతాల్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.