పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. కాల్పుల విరమణకు మళ్లీ తూట్లు పొడిచి తెంపరితనాన్ని ప్రదర్శించింది. సరిహద్దుల వెంట కాల్పులు జరిపి ఇద్దరు జవాన్లు సహా ఓ మహిళను పొట్టనబెట్టుకుంది. జమ్మూకశ్మీర్‌లోని కతువా, సాంబా జిల్లాల్లో పాక్ సైన్యం ఈ ఘాతుకానికి తెగబడింది. ఈ కాల్పుల్లో 11 మంది పౌరులు కూడా గాయపడ్డారు. కాల్పుల మోత, మోర్టార్ల దాడితో సరిహద్దు గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడిపాయి. 1,400 మందికి పైగా ప్రజలు ఊళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. శుక్రవారం రాత్రి నుంచే పాక్ సైన్యం ఈ కాల్పులకు దిగిందని బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాకేశ్ శర్మ తెలిపారు.
Published Sun, Jan 4 2015 6:48 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM
Advertisement
Advertisement
Advertisement