మరోసారి కాల్పులకు తెగబడిన పాక్ | Pakistan violates ceasefire along LoC, India retaliates | Sakshi
Sakshi News home page

మరోసారి కాల్పులకు తెగబడిన పాక్

Published Fri, Jun 13 2014 10:20 AM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

మరోసారి కాల్పులకు తెగబడిన పాక్ - Sakshi

మరోసారి కాల్పులకు తెగబడిన పాక్

ఇటీవల భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఆ ఇద్దరు ప్రధానిల మధ్య జరిగిన చర్చలతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొంటుందని ఇరుదేశాల దేశాలు  భావించాయి. అలాంటి తరుణంలో పాకిస్థాన్ సైనికులు మరోసారి తమ తెంపరితనాన్ని చాటుకున్నారు.

 

శుక్రవారం ఇరుదేశాల సరిహద్దుల్లోని సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఎల్ఓసీ వెంబడి ఉన్న రాజోరి, పూంచ్ జిల్లాలపైకి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.  ఆ ప్రాంతంలో ఉన్న భారత భద్రత దళాలు వెంటనే అప్రమత్తమైయ్యాయి. పాక్ సైనికులు కాల్పులకు ప్రతిగా భారత్ దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. పాక్ సైనికులు కాల్పులకు ప్రతిగా భారత్ దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. అయితే పాక్ సైన్యం జరిపిన కాల్పులలో ఓ భారత్ జవాన్ మృతి చెందగా, మరో ముగ్గురు సైనికులు మరణించినట్లు సమాచారం.


శుక్రవారం పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో రాజోరి, పూంచ్  జిల్లాలోని జనావాసాలపైకి బుల్లెట్లు దూసుకువచ్చాయని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఆ బుల్లెట్లకు పెంపుడు జంతువులు బలైయ్యాయని శుక్రవారం ఒమర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement