పాక్ సరిహద్దులో సైన్యంతో సురేష్ రైనా!
పాక్ సరిహద్దులో సైన్యంతో సురేష్ రైనా!
Published Sun, Aug 10 2014 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM
శ్రీనగర్: పొరుగు దేశ సైన్యం దాడులను తిప్పుకొడుతూ.. దేశానికి రక్షణగా నిలిచిన సైనికుల్లో మనోధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు జమ్మూ,కాశ్మీర్ లోని సైనిక శిబిరాలను ఆదివారం భారత క్రికెటర్ సురేశ్ రైనా సందర్శించారు. కాశ్మీర్ లోని ఎల్ ఓసీ (నియంత్రణ రేఖ) సమీపంలోని ఫార్వర్డ్ పోస్ట్ ను సురేష్ రైనా సందర్శించారు. కాశ్మీర్ సరిహద్దులోని అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో నియమించిన సైనికుల్లో మానసిక ధైర్యాన్ని రైనా నింపారని కల్నల్ ఎన్ఎన్ జోషి మీడియాకు తెలిపారు.
నియంత్రణారేఖ వద్ద సైనికులు ఎదుర్కొంటున్న సవాళ్లను రైనా అడిగి తెలుసుకున్నారు. ఎల్ ఓసి వద్ద భారత సైనికులు చేస్తున్న సేవను రైనా కొనియాడారు. సైనికులతో తన వ్యక్తిగత అనుభవాల్ని, ఆనందకరమైన అనుభవాలను సైనికులతో పంచుకోవడమే కాకుండా వారితో భోజనం కూడా చేశారు. కాశ్మీరి పండితుల కుటుంబానికి చెందిన రైనా కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా నివాసి. దేశీయ క్రికెట్ లో రంజీ ట్రోఫి పోటీలలో రైనా జమ్మూ, కాశ్మీర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement