
జమ్మూకశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి జరిగింది.
గుల్‌మార్గ్: జమ్మూకశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. బారాముల్లా జిల్లాలోని బోటాపాత్ర్ వద్ద ఉగ్రవాదులు వాహనంపై కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
కాగా, గుల్‌మార్గ్‌లో సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడికి కొన్ని గంటల ముందు పుల్వామాలో ఉగ్రవాద దాడిలో వలస కార్మికుడు గాయపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన కార్మికుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.