
మళ్లీ పాక్ కాల్పులు
జమ్మూ: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. శనివారం ఉదయం పూంచ్ జిల్లాలోని ఎల్‌ఓసీ వెంబడి పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఓ జవాను గాయపడ్డాడని ఐజీ పోలీస్(రాజౌరి-ఫూంచ్ రేంజ్) జానీ విలియమ్స్ తెలిపారు. అయితే కాల్పుల ఉల్లంఘన జరగలేదని డిఫెన్స్ పీఆర్‌ఓ కల్నల్ మనీశ్ మెహతా పేర్కొనడం గమనార్హం. భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన తర్వాత పాక్ ఇప్పటివరకు 25 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.