సరిహద్దులో పాక్ దురాగతం
► ఆ దేశ ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు జవాన్ల బలి
► కాల్పుల విరమణకు పాక్ తూట్లు
► మరో ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం
శ్రీనగర్: సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విర మణకు మళ్లీ తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కెరన్ సెక్టార్‌లో బుధవారం నియంత్రణ రేఖ వద్ద ఆ దేశ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మృతిచెందారు. పాక్ నుంచి మిలి టెంట్లు భారత్‌లోకి చొరబడే ఫుర్కియా ప్రాంతంలో ఈ దురాగతం చోటుచేసుకుం దని, మృతులు జమ్మూకశ్మీర్ రైఫిల్స్ దళానికి చెందినవారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మరోపక్క బుడ్గాం జిల్లా రెడ్‌బగ్‌లో జరిగిన హోరాహోరీ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగా లు ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవా దులను మట్టుబెట్టాయి.
ఉగ్రవాదులు ఉన్నా రనే పక్కా సమాచారంతో జవాన్లు ఆ ప్రాంతాన్ని మంగళవారం సాయంత్రం చుట్టుముట్టారు. తమపై మిలిటెంట్లు జరిపిన కాల్పులకు దీటుగా బదులిచ్చారు. మంగళ వారం రాత్రి ఆపరేషన్‌ను నిలిపేసి ముష్క రులు తప్పించుకోకుండా గట్టి నిఘా ఉంచా రు. బుధవారం ఉదయం ఇరుపక్షాల మధ్య మళ్లీ కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఘటనాస్థలి నుంచి కొన్ని ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకు న్నామని పోలీసులు చెప్పారు. మృతులను గూడిపోరాకు చెందిన ఆకిక్ గుల్, జావేద్ అహ్మద్ షేక్, సాజిద్ అహ్మద్ గిల్కర్‌లుగా గుర్తించినట్లు వెల్లడించారు.