bus travel
-
ఉచిత ప్రయాణంపై పిల్.. ప్రయోజనం లేదన్న కోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. బస్సులన్ని మహిళలతోనే నిండిపోతున్నాయని టికెట్ తీసుకున్నా సీటు ఉండటం లేదని నాగోలుకు చెందిన హరిందర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సులలో తీవ్ర రద్దీ పెరిగిందని పిటీషన్లో పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు బస్సులో నిలబడే పరిస్థితి లేదని హైకోర్టుకు తెలిపారు. ఉచిత ప్రయాణం కోసం జారీ జారీ చేసిన జీఓ 47ను రద్దు చేయాలని హరిందర్ పిటిషన్లో కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ తెలంగాణ హైకోర్టు హరిందర్ దాఖలు చేసిన పిటీషన్లో ఎటువంటి ప్రజా ప్రయోజనమేమీ లేదని పేర్కొంది. పిటిషనర్ బస్సులో ఇబ్బంది ఎదుర్కొని పిల్ దాఖలు చేశారని ధర్మాసనం తెలిపింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటీషన్‌గా మార్చాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. -
రూపాయికే బస్సు ప్రయాణం.. దేశమంతా తిరగొచ్చు..
సాక్షి, సిటీబ్యూరో: బస్సు ప్రయాణీకులకు బంపరాఫర్. ఇంటర్–సిటీ ఎలక్ట్రిక్ ఏసీ కోచ్ సేవలందించే న్యూగో సంస్థ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూపాయికే బస్సు ప్రయాణ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నెల 15న తమ రవాణా మార్గాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కేవలం రూపాయితోనే ప్రయాణించవచ్చని పేర్కొంది. ఈ సందర్భంగా గ్రీన్‌సెల్ మొబిలిటీ సీఈఓ దేవేంద్ర చావ్లా మాట్లాడుతూ.. పర్యావరణ స్థిరత్వంతో పాటు దేశాన్ని పచ్చదనంగా మార్చడానికి ఈవీ సేవలు కొనసాగిస్తున్నామని తెలిపారు. పర్యావరణహిత ప్రయాణాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో భాగంగా ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. పంద్రాగస్టు రోజున ఈ ప్రయాణ ఆఫర్‌ను పొందడానికి బుకింగ్స్ మొదలయ్యాయని, రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు తమ రవాణా సేవలు కొనసాగుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఇండోర్– భోపాల్, ఢిల్లీ–చండీగఢ్, ఢిల్లీ– ఆగ్రా, ఢిల్లీ–జైపూర్, ఆగ్రా–జైపూర్, బెంగళూరు–తిరుపతి, చెన్నై–తిరుపతి, చెన్నై–పుదుచ్చేరి తదితర మార్గాల్లో తమ సేవలు కొనసాగుతున్నాయని, దేశమంతా ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. బుకింగ్స్ కోసం న్యూగో వెబ్సైట్ https:// nuego. in/ booking, సంస్థ అధికారిక మొబైల్ అప్లికేషన్లలోనూ బుకింగ్ చేసుకోవచ్చని దేవేంద్ర చావ్లా తెలిపారు. ఇది కూడా చదవండి: ఒకే నెలలో ఇన్ని పరీక్షలా? -
కర్ణాటక: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అక్కడ తప్ప!
హుబ్లీ(బెంగళూరు): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యం హుబ్లీ ధార్వాడ జంట నగరాల్లోని ప్రతిష్టాత్మక బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(బీఆర్టీఎస్) చిగరి బస్సుల్లో లేదని సంబంధిత అధికారులు తెలిపారు. రూ.కోట్ల వ్యయంతో హుబ్లీ ధార్వాడ నగరాల మధ్య ప్రత్యేక మార్గం ద్వారా చిగరి బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా బీఆర్టీఎస్ పేరిట నిర్వహిస్తున్న చిగరి బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వాయువ్య ఆర్టీసీ సంస్థ ఎండీ భరత్ విలేకరులకు తెలిపారు. చదవండి: ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా! -
విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎక్కడంటే?
బెంగళూరు: పాఠశాల విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. కేఎస్ఆర్టీసీ వోల్వో బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళా ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు. కొత్త పథకంలో భాగంగా విద్యార్థుల కోసం మరిన్ని మినీ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం చెప్పారు. ఒక్కో తాలుకాలో కనీసం ఐదు బస్సులు నడిచేలా చూస్తామన్నారు. అవసరమైతే దీని కోసం అదనపు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధిలో రవాణా ముఖ్య పాత్ర పోషిస్తుందని బొమ్మై చెప్పారు. అందుకే తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థులకు ఉచిత పాసులు ఇస్తామని బడ్జెట్ సమావేశాల్లోనే చెప్పినట్లు గుర్తుచేశారు. చదవండి: మనీశ్ సిసోడియాకు భారీ షాక్.. స్నూపింగ్ కేసు విచారణకు కేంద్రం ఆమోదం.. -
పదో తరగతి విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ ఆదేశాలిచ్చింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వారి గ్రామం నుంచి పరీక్ష కేంద్రం వరకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని ఆయా జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, జిల్లాల పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్లకు ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) ఆదేశాలిచ్చారు. పరీక్ష అయిపోయాక ఇంటికి చేరుకునేందుకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని అందులో సూచించారు. హాల్ టికెట్ ఆధారంగా బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రాల వరకు రాకపోకలు సాగించొచ్చు. ఈ అవకాశం పదో తరగతి పరీక్షలు జరిగే ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో 3,780 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 6,22,746 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పది పరీక్షలపై మంత్రి బొత్స సమీక్ష విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక గురువారం తొలిసారి సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలన్నింటినీ సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర చర్యలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నతాధికారులతో కలసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, వైద్య సదుపాయం, ఫర్నిచర్ ఏర్పాట్లు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర ప్రయాణం సులభతరం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలను మరింత సులభతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో ప్రత్యేకంగా నియమనిబంధనలు విధించాయి. క్వారంటైన్, ఐసోలేషన్ వంటివి అమలుచేశాయి. అయితే కరోనా కేసుల ఉధృతి తగ్గడంతో ప్రయాణాలను సులభతరం చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. విమాన, రైలు, బస్సు ప్రయాణాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏకీకృత ప్రొటోకాల్స్‌ను అమలు చేయాలని స్పష్టం చేసింది. వీటిని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సూచించింది. సులభతరం చేయడమంటే, ఇష్టారాజ్యంగా ప్రయాణికులు తిరగడమన్న ఉద్దేశం కాదని, అవసరమైన ఆరోగ్య ప్రొటోకాల్స్‌ను తప్పక పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా రాష్ట్రంలో అసాధారణంగా కరోనా కేసులు పెరిగిన సందర్భాల్లో తగిన ప్రజారోగ్య చర్యలను వెంటనే ప్రారంభించవచ్చు. అటువంటప్పుడు స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలు అదనపు ఆంక్షలను అమలు చేయవచ్చు. మార్గదర్శకాలు ఇవీ... ►ప్రయాణికులు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి. కోవిడ్ సంబంధిత లక్షణాలు లేనప్పుడు మాత్రమే ప్రయాణించాలి. మాస్క్, హ్యాండ్ హైజీన్, భౌతికదూరం పాటించాలి. ►ప్రయాణ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదు. ►ప్రయాణికులందరూ తమ మొబైల్లో ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ►ప్రయాణ సమయంలో వారికి జ్వరం వచ్చినట్లయితే, వారు సంబంధిత విమాన సిబ్బందికి లేదా రైలు టీటీఈకి లేదా బస్ కండక్టర్‌కు తెలియజేయాలి. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తే, కోవిడ్ కాల్ సెంటర్‌కు వివరాలు ఇవ్వాలి. ►విమానాశ్రయాలు/రైల్వే స్టేషన్లు/పోర్టులు/బస్ స్టేషన్లలో కరోనాకు సంబంధించిన ప్రకటనలు జారీచేయాలి. ►ప్రయాణికులందరూ బయలుదేరే సమయంలో థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే విమానం/రైలు/ఓడ/బస్సు ఎక్కడానికి అనుమతిస్తారు. ►ప్రయాణికులకు శానిటైజర్లు, మాస్క్‌లను అందుబాటులో ఉంచాలి. ►ప్రయాణం తర్వాత బయటకు వెళ్లేవారికి థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి. లక్షణాలు లేని ప్రయాణికులు 14 రోజులపాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలనే సలహా ఇవ్వాలి. ►ఒకవేళ ప్రయాణికుల్లో ఎవరికైనా లక్షణాలుంటే, వారిని ఐసోలేట్ చేయాలి. అవసరమైతే రోగులను తగిన ఆసుపత్రికి తరలించాలి. ►అవసరమైన రోగులకు పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటర్ అందుబాటులో ఉంచాలి. శిక్షణ పొందిన సిబ్బంది కూడా ఉండాలి. ►ప్రయాణికులు ఆప్రాన్ వాడాల్సిన అవసరంలేదు. అయితే ఎయిర్‌లైన్/రైల్వే కోచ్/షిప్ క్యాబిన్లు/బస్సులో సిబ్బంది మాత్రం ఎల్లప్పుడూ మాస్క్‌లు, ఫేస్ షీల్డ్, గ్లౌజులు ధరించాలి. ఇతర తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ►విమానాలు/రైళ్లు/నౌకలు/బస్సులను క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి. ►రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య విమానాలు, రైలు, రహదారి ద్వారా జరిగే అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ►ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో ప్రవేశించడానికి ముందు ఆర్టీపీసీఆర్ లేదా యాంటీజెన్ పరీక్షలు అవసరమైతే, విస్తృతంగా ప్రచారం చేయాలి. అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులను వేసుకున్నవారిని మినహాయించాలి. -
ఆకాశమార్గాన బస్సులు..!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్‌వాసుల కలల మెట్రోకు అనుసంధానంగా ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(బస్సులు మాత్రమే రాకపోకలు సాగించే ఆకాశ మార్గం) ఏర్పాటుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సన్నాహాలు చేస్తోంది. ప్రధానంగా ఐటీ కారి డార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో ట్రాఫిక్ చిక్కులను తప్పించడంతోపాటు మెట్రో సౌకర్యం లేని ప్రాంతాలను స్టేషన్లతో అనుసంధానించేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టును సుమారు 20 కి.మీ. మార్గంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకయ్యే వ్యయం ప్రాథమికంగా రూ.2,800 కోట్ల మేర ఉంటుందని నిర్ణయించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసేందుకు బిడ్ల దాఖలుకు హెచ్ఎంఆర్ సంస్థ వారంపాటు పొడిగించిన నేపథ్యంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్టీఎస్ మార్గం ఇలా... ఈ బీఆర్టీఎస్ ప్రాజెక్టును కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి ఫోరం మాల్, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్, హెచ్ఐసీసీ, శిల్పారామం, రాయదుర్గం, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, రాయదుర్గం, నార్సింగి తదితర ప్రాంతాలను కలుపుతూ సుమారు 20 కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గంలో బీఆర్టీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అంటే ఈ మార్గం కూడా మెట్రో మార్గాన్ని తలపించినప్పటికీ.. ఈ కారిడార్‌లో ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఇతర వాహనాలను ఈ మార్గంలో అనుమతించరు. ప్రతీ కిలోమీటర్‌కు ఒక బస్ స్టేజీ ఉంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఈ బస్సుకు సైతం రైలు తరహాలో మూడు కోచ్‌లుంటాయి. రద్దీని బట్టి తొలుత రెండు కోచ్‌లు.. ఆ తరువాత మూడు కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.2,800 కోట్ల అంచనా వ్యయాన్ని ప్రాథమికంగా నిర్ధారించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసిన తరువాత నిధుల వ్యయంపై స్పష్టత రానుంది. ఈ ప్రాజెక్టును సైతం పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తితో మెట్రో కారిడార్‌తోపాటు, ఐటీ కారిడార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో విస్తరించిన ఐటీ, బీపీఓ, కెపిఓ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, స్థానికులకు ట్రాఫిక్ చిక్కులు తొలగిపోనున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం కానుంది. ఇదిలా ఉండగా బీఆర్టీఎస్ను పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్న నేపథ్యంలో నిధుల కొరత ఉండదు. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు పలు దేశీయ, విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతుండటం విశేషం. బీఆర్‌టీఎస్‌తో ప్రయోజనాలివే ఐటీ కారిడార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో పలు ఐటీ, బీపీఓ, కేపీఓ కంపెనీల్లో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా తగ్గనుంది. ట్రాఫిక్ చిక్కులు తొలగిపోవడంతో విలువైన పని గంటలు ఆదా అవుతాయి. మెట్రోకు కూడా ప్రయాణికులు పెరిగి లాభాల బాట పట్టే అవకాశం ఉంటుంది. ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో లాస్ట్‌మైల్ కనెక్టివిటీ ఇబ్బందులు తీరతాయి. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉన్న బీఆర్టీఎస్ రాకతో నగర రూపురేఖలు మారతాయి. బీఆర్టీఎస్ మార్గంలోనూ నూతన కంపెనీల ఏర్పాటు, వాణిజ్య, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. మెట్రోతో పోలిస్తే బీఆర్టీఎస్ ఏర్పాటు సాంకేతికంగా, ఆర్థికంగా అంత భారంగా పరిణమించదు. -
పరీక్ష రాసే అభ్యర్థులకు బస్సులో ఉచితం
మెదక్ జోన్: పదవ తరగతి పరీక్షలు ఈ నెల 15(నేటి) నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సదుపాయం కల్పిస్తునట్లు ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 2 వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రీ బస్‌పాస్ కానీ లేదా సబ్సిడీతో కూడిన బస్‌పాస్ కానీ కచ్చితంగా ఉండాలని చెప్పారు. అలాంటి విద్యార్థు«లను మాత్రమే ఉచితంగా బస్సుల్లో తీసుకెళతారన్నారు. ఉదయం ఇంటి నుంచి పరీక్ష కేంద్రం వద్దకు, మధ్యాహ్నం పరీక్షలు ముగిశాక మళ్లీ ఇంటివరకు వెళ్లొచ్చని ఆయన చెప్పారు. జిల్లాలో 11,258 మంది పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉన్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు తప్పని సరిగా హాల్ టికెట్‌తో పాటు బస్ పాస్‌ను సైతం వెంటతీసుకుని రావాలని ఆయన చెప్పారు. పరీక్షలు అయ్యేంత వరకు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సైతం ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. -
బస్సులో ప్రయాణిస్తే భారీ డిస్కౌంట్
సరి-భేసి విధానంతో కాలుష్యానికి చెక్ పెట్టాలని భావించిన ఢిల్లీ సర్కారుకు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరో వినూత్న ఆఫర్‌తో ప్రజల ముందుకొచ్చింది. ప్రజలు వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించి, ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణించే వారికి టిక్కెట్ ధరలో 75 శాతం డిస్కౌంట్‌ను ఢిల్లీ ప్రభుత్వం అందించబోతుంది. దీంతో దేశ రాజధానిలో బస్సు ప్రయాణం మరింత చౌకగా మారబోతుంది. రెండు రోజుల్లోనే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. జనవరి నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయని సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టి-మోడల్ ట్రాన్సిస్ట్ సిస్టమ్(డీఐఎమ్‌టీఎస్) ఆపరేట్ చేసే డీటీసీ, క్లస్టర్ బస్సులన్నింటిలోనూ ఈ కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త ధరల ప్రకారం నాన్-ఏసీ క్లస్టర్ బస్సు ఫ్లాట్ చార్జీ రూ.5, ఎయిర్-కండిషన్డ్ బస్సు ఫ్లాట్ చార్జీ రూ.10గా ఉండబోతుంది. ప్రస్తుతం నాన్-ఏసీ బస్సులో ఢిల్లీ నగరంలో ప్రయాణిస్తే రూ.5 నుంచి రూ.15 మధ్యలో టిక్కెట్ ధరలున్నాయి. అదేవిధంగా ఏసీ బస్సులో రూ.10 నుంచి రూ.25 మధ్యలో చార్జీలున్నాయి. 21 సంవత్సరాలు కంటే తక్కువ వయసున్న విద్యార్థులకు, వితంతువులకు, సీనియర్ సిటిజన్లకు ఉచిత ట్రావెల్ పాస్‌లను ప్రభుత్వం అందించనుంది. మహిళ ట్రావెల్ పాస్‌లకు శాశ్వతంగా 75 శాతం డిస్కౌంట్‌ను ప్రభుత్వం తీసుకొస్తోంది. రూ.800, రూ.1000కు లభ్యమవుతున్న నెలవారీ నాన్-ఏసీ, ఏసీ బస్సు పాస్‌లు ఇక రూ.250కే లభ్యం కానున్నాయి. రాజధాని ప్రాంతంలో రోడ్లపై వాహనాల శాతాన్ని తగ్గించి బస్సు ప్రయాణాలు పెంచడానికి ఈ డిస్కౌంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని అధికారులు చెబుతున్నారు. -
ఆడవాళ్లకు మాత్రమే!
నేపాల్‌లో బస్సు ప్రయాణం అంటే మామూలు విషయమేమీ కాదు. ఒక బస్సులో ఒకటిన్నర బస్సు ప్రయాణికులు కనిపిస్తారు. కూరగాయలన్నింటినీ ఒకేదానిలో పట్టించాలన్నట్లు ఒక చిన్నమూటలో కుక్కేస్తుంటారు చూడండి... అలా కిక్కిరిసిన బస్సులో అష్టకష్టాలు ఎదురైనా...ప్రయాణించడం మాత్రం అనివార్యం! ఎందుకంటే అందరూ సొంత వాహనాలు సమకూర్చుకోలేరు కదా. ఇక మహిళల విషయానికి వస్తే... బస్సు ప్రయాణం అనేది నరకాన్ని తలపింపజేస్తుంది. ముఖ్యంగా లైంగికవేధింపులు. వీటికి భయపడి ఉద్యోగం మానుకున్న మహిళలు కూడా ఉన్నారు. కాగా బస్సుల్లో మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల లైంగిక వేధింపులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మహిళలకు మాత్రమే ప్రత్యేకించిన మినీ బస్సులను ప్రవేశపెట్టింది.‘‘ఖాట్మండ్‌లో మరిన్ని ఉమెన్-ఓన్లీ బస్సులను ప్రవేశపెట్టాలని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయి’’ అంటున్నారు నేపాల్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షుడు భరత్ నేపాల్. -
ప్రతి బుధవారం మొయిలీ బస్సుప్రయాణం
ఒక్కో మనిషి ఒక్కో కారులో వెళ్తుంటే బోలెడంత పెట్రోలు ఖర్చవుతుంది. అదే 20-30 మంది కలిసి ఒక్క బస్సులో వెళ్తే చాలా ఆదా అవుతుంది. సరిగ్గా ఇదే సూత్రాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెబుతున్నారు. చెప్పడమే కాదు, ఆయన దీన్ని స్వయంగా కూడా ఆచరించి చూపిస్తానంటున్నారు. వారానికి ఒకరోజు చొప్పున తాను కేవలం బస్సుల్లోనే ప్రయాణిస్తానని మొయిలీ స్పష్టం చేశారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ప్రతి బుధవారం తాను కారులో ప్రయాణం చేయబోనని, ప్రజారవాణానే వినియోగిస్తానని ఆయన చెప్పారు. చమురు దిగుమతుల బిల్లు 500 కోట్ల డాలర్లకు చేరుకుంటున్నందున దాంట్లో కొంతయినా ఆదా చేయాలంటే అందరూ బస్సుల్లో ప్రయాణించాలని, వీలైనంత వరకు వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించాలని మొయిలీ పిలుపునిచ్చారు. తనతో పాటు తన మంత్రిత్వశాఖ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసేవాళ్లు కూడా ప్రతి బుధవారం బస్సుల్లోనే తిరగాలని ఆయన కోరారు.