స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
ఇన్వెస్ట్ చేయడం సులభం. చేతిలో డబ్బులుంటే చేసేయొచ్చు. కానీ విజయవంతమైన ఇన్వెస్టర్‌గా ఎదగడమే కష్టం. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్టాక్స్ ఒకటి. ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలకు ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడులకు తేడా ఉంది. ఇక్కడ రిటర్న్స్‌తో పాటు రిస్క్‌లూ ఎక్కువగా ఉంటాయి. అందుకే మన కష్టార్జితాన్ని వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందే స్టాక్ మార్కెట్ గురించి అన్ని విషయాలను సమగ్రంగా తెలుసుకోవాలి. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం..
మీకు తెలిసిన రంగాలకు చెందిన, అవగాహన ఉన్న కంపెనీల స్టాక్స్‌నే కొనుగోలు చేయాలి.
స్టాక్స్ కొనుగోలు చేయాలనుకుంటున్న కంపెనీ ఏ కార్యకలాపాలు నిర్వహిస్తుందో చూడాలి. కంపెనీ పనితీరు ఎలా ఉందో గమనించాలి. దాని త్రైమాసిక ఫలితాలను చదవండి. బ్యాలెన్స్‌షీట్ ఎలా ఉందో చూడండి. కంపెనీ మేనేజ్‌మెంట్ గురించిన సమాచారాన్ని తెలుసుకోండి.
కంపెనీ స్టాక్ విలువ ఏ విధంగా ఉందో చూడండి. అంటే కొన్ని స్టాక్స్ ధర వాటి అసలు విలువ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే స్టాక్స్ కొనుగోలుకు వెచ్చించే మొత్తం సమంజసంగా ఉందో లేదో ఒకటి రెండు సార్లు చూసుకోండి.
మీరు స్టాక్స్ కొనాలనుకున్న కంపెనీ ప్రత్యర్థుల గురించి కూడా తెలుసుకోవాలి. వాటి పనితీరు, కార్యకలాపాలు ఎలా ఉన్నాయో చూడాలి.
కంపెనీకి సంబంధించిన పీఈ నిష్పత్తి, బీటా, డివిడెండ్, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, డెట్, నికర ఆదాయం వంటి అంశాలనూ చూడండి.
దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. మార్కెట్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ ఉండండి.