ఒకప్పటి నుంచి బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్పా.. భారీగా తగ్గుముఖం పట్టిన రోజులు చాలా తక్కువ. అయినా కొనే వారు కొంటూనే ఉన్నారు, ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. ఈ కథనంలో ప్రపంచములో బంగారం ఎవరి దగ్గర ఎక్కువగా ఉంది? ఉత్పత్తిలో భారత్ స్థానం ఏంటనే వివరాలు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బంగారం అనేది ఈ రోజు వాడుకలో వచ్చింది కాదు, శతాబ్దాల ముందు నుంచి ప్రజలు విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అయితే చాలా వరకు బంగారం ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతూ ఉన్నట్లు తెలుస్తోంది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. భారతీయ కుటుంబాల దగ్గర ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్నట్లు సమాచారం. నిజానికి భారతీయులు పెళ్లిళ్లకు, పేరంటాలకు మాత్రమే కాకుండా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా బంగారాన్ని భారీగా ఉపయోగిస్తారు. భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం దాదాపు 25000 టన్నుల కంటే ఎక్కువని సమాచారం.
ఇదీ చదవండి: ఈ ఏడాది 1996 క్యాలెండర్స్ వాడుకోండి..! ఎందుకంటే?
ప్రపంచంలోని మొత్తం బంగారంలో 11 శాతం బంగారం భారతీయుల వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. ఇది అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీ వంటి దేశాలకంటే ఎక్కువ. భారత్ తరువాత అత్యధిక బంగారం ఉన్న దేశీయులలో సౌదీ అరేబియా, అమెరికా, కెనడా మొదలైనవి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment