10-30% పెరిగిన స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ | 34 small-cap stocks rose 10-30% in a week | Sakshi
Sakshi News home page

10-30% పెరిగిన స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌

Published Sat, May 23 2020 11:45 AM | Last Updated on Sat, May 23 2020 11:50 AM

34 small-cap stocks rose 10-30% in a week - Sakshi

ఈ వారంలో అంతర్జాతీయ పరిస్థితులూ ప్రతికూలంగా ఉండడంతో నిఫ్టీ, సెన్సెక్స్‌ నష్టాల్లో ట్రేడ్‌ అయ్యాయి. శుక్రవారం సెన్సెక్స్‌31,000 పాయింట్ల దిగువకు, నిఫ్టీ50 9,100 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, దేశీయంగా  భారత ప్రభుత్వం, ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో  ఈ రెండు మార్కెట్లు నష్టాలను చవిచూసాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. వారం ప్రాతిపదికన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1.3 శాతం పడిపోగా, నిఫ్టీ 1.06 శాతం పడిపోయింది. ఇదే సమయంలో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.5 శాతం, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 2 శాతం పతనమయ్యాయి. అయినప్పటికీ బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లో 34 షేర్లు 10-30 శాతం పెరిగాయి. వీటిలో  ప్రోజోన్‌ ఇంటూ, మెక్‌నల్లీ భారత్‌, టీవీఎస్‌ శ్రీచక్ర, ఆషాపుర, ఆస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌, ఇండియా సిమెంట్స్‌, డీ లింక్‌, డెక్కన్‌ సిమెంట్స్‌, ఆంధ్రా సిమెంట్స్‌ జెన్‌ టెక్నాలజీస్‌, సింటెక్స్‌ ఇండస్ట్రీ, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, ఎస్కార్ట్స్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీలు, వాబ్కో ఇండియా, ఏపీఎల్‌ అపోలో, పయనీర్‌ డిస్టిల్లరీస్‌,త్రివేణీ ఇంజనీరింగ్‌ తదితరాలున్నాయి. 
   ఇక ఈవారంలో నిఫ్టీ 8,800 కనిష్టాల నుంచి బౌన్స్‌ బ్యాక్‌ అయింది. కానీ ఆర్థిక ఒత్తిడిలు ఎక్కువగా ఉండడంతో వారంలో నిఫ్టీ బ్యాంక్‌ 8శాతానికిపై గా పడిపోయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆవిష్కరించిన ఆర్థిక ప్యాకేజీ ఇన్వెస్టర్లను మెప్పించకపోవడం, మారటోరియం పొడిగింపుతో బ్యాంక్ల బ్యాలెన్స్‌ షీట్లపై ఒత్తిడి పడనుంది. ఆర్బీఐ రుణాలపై ఎటువంటి నిర్ణయాలు లేకపోవడం, బ్యాంకులకు సాయం చేసే ప్రకటనలు ఏవీ లేకపోవడంతో బ్యాంక్‌ నిఫ్టీ పడిపోయిందని సామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా అన్నారు.మారటోరియం పొడగింపు వల్ల ఎన్‌పీఏలు పెరుగుతాయని, తద్వారా బ్యాంక్‌ల బ్యాలెన్స్‌ షీట్ల లాభాలపై ప్రభావం పడుతుందని మేహతా పేర్కొన్నారు. నిఫ్టీ50 వరుసగా మూడో వారం నష్టాల్లో ముగిసింది. ఫార్మా,ఐటీ ,ఎఫ్‌ఎంసీజీలు మెరుగ్గా ట్రేడ్‌ అయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement