
ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్‌కు భారీ నష్టం వాటిల్లింది. బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే క్యూ3 (జూలై-సెప్టెంబర్) గానూ ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ 12.8 బిలియన్ డాలర్లు (లక్ష కోట్ల రూపాయలకుపైగా) నష్టపోయినట్లు ప్రకటించింది.
దీంతో ఒక్కో ఏ రకం షేర్ 8,824 డాలర్లు కోల్పోయినైట్టెంది. గత ఏడాది క్యూ3లో 2.8 బిలియన్ డాలర్ల నష్టం నమోదవగా, ఒక్కో ఏ రకం షేర్ విలువ రూ.1,907 డాలర్లు పడిపోయింది.
అదే సమయంలో బెర్క్‌షైర్ హాథ్‌వే ఇన్సూరెన్స్ విభాగం లాభాల్ని గడించింది. బెర్క్‌షైర్ నిర్వహణ లాభంలో 2.4 బిలియన్లు అందించగా.. ఏడాది క్రితం బీమా రంగ సంస్థలు మూడవ త్రైమాసికంలో 1.1 బిలియన్ల నష్టాన్ని నివేదించాయి. బెర్క్‌షైర్ త్రైమాసికంలో 1.1 బిలియన్ డాలర్ల స్టాక్స్‌ను కొనుగోలు చేసింది.అయితే 4.4 బిలియన్ల బెర్క్‌షైర్ షేర్లను కొనుగోలు చేసిన మొదటి త్రైమాసికం నుండి దాని బైబ్యాక్‌ల వేగం గణనీయంగా తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment