డౌన్‌ట్రెండ్ మార్కెట్లో బుల్ షేర్లను పసిగట్టడం కాస్త కష్టమే కానీ అసాధ్యం కాదంటున్నారు నిపుణులు. సూచీలు బాటమ్ అవుట్ అవుతున్న దశలో మంచి ప్రదర్శన చూపే షేర్లు తర్వాత మూడేళ్లకాలంలో ర్యాలీని ముందుండి నడిపిస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం అలా సూచీల డౌన్‌ట్రెండ్‌లో స్థిర ప్రదర్శన చేస్తున్న ఏడు షేర్లను ఐసీఐసీఐ డైరెక్ట్ గుర్తించి సిఫార్సు చేస్తోంది. వీటిలో బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, సింజెన్ ఇంటర్నేషనల్, డా.లాల్‌పాథ్‌ల్యాప్స్, నవిన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్, ఇండియా సిమెంట్స్ ఉన్నాయి.
వచ్చే ఏడాదిలో ఇవి దాదాపు 19- 24 శాతం రాబడినిస్తాయన్నారు. ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన 918 స్టాకుల ప్రదర్శనను, సాంకేతికాంశాలను పరిశీలించి ఈ సిఫార్సు చేసినట్లు తెలిపింది. టెక్నికల్ విశ్లేషణలో భాగంగా ధర నిర్మాణ విశ్లేషణ, ఆర్‌ఎస్‌ఐ, డౌథియరీ సంకేతాలు తదితరాలను పరిశీలించినట్లు బ్రోకరేజ్ తెలిపింది. దీనికితోడు ఈ కంపెనీల వ్యాపార నమూనా బాగుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment