స్టాక్ మార్కెట్ కోరికలకు రెక్కలు తొడిగే లెక్కల ప్రపంచం. కోట్లమంది తలరాతలు మార్చే ఇన్వెస్టర్ల ప్రపంచం. ముఖ్యంగా కేపిటల్ మార్కెట్లో మల్టీ బ్యాగర్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన ముదుపర్లు మెగస్టార‍్లు అవుతున్నారు. ముఖ్యంగా పెన్నీ స్టాక్స్ కొనుగోలు చేసిన మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ స్టాక్స్ స్వర్గంలా కనిపిస్తున్నాయి.
అలాంటి మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల కలల్ని నిజం చేసింది సూరజ్ ఇండస్ట్రీస్ స్టాక్స్. గత ఆరు నెలల్లో తన వాటాదారులు 3,378% రాబడి పొందారు. జూన్ 2, 2021న రూ. 2.14 వద్ద ఉన్న పెన్నీ స్టాక్ ఈరోజు బీఎస్‌ఈలో రూ.74.45 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఆరు నెలల క్రితం సూరజ్ ఇండస్ట్రీస్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన రూ.లక్ష మొత్తం నేడు రూ.34.78 లక్షలుగా మారింది. ఈ ఆరునెలల కాలంలో సెన్సెక్స్ 12.5% పెరిగింది. గత 21 సెషన్లలో ఈ స్టాక్ 175.2% లాభపడింది. ఈరోజు బీఎస్‌ఈ షేరు 4.93% లాభంతో రూ.74.45 వద్ద ప్రారంభమైంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.64.40 కోట్లకు చేరింది. అంతేకాదు సంస్థ మొత్తం 150 షేర్లు బీఎస్‌ఈలో రూ. 0.11 లక్షల టర్నోవర్‌తో వృద్దిని సాధించింది.
సూరజ్ ఇండస్ట్రీస్ షేర్ 5 రోజులు, 20 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల సగటు కంటే ఎక్కువగా ట్రేడవుతోంది. ఒక నెలలో ఈ స్టాక్ 162% లాభపడింది. సెప్టెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో,ఐదుగురు ప్రమోటర్లు 59.19% వాటాను లేదా 43.08 లక్షల షేర్లను కలిగి ఉన్నారు.15,512 పబ్లిక్ వాటాదారులు 50.19% వాటాతో రూ.43.41 లక్షల కంపెనీలను కలిగి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment