అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న భారీ అమ్మకాలతో దేశీయ స్టాక్ మార్కెట్ రెండు రోజులుగా భారీ నష్టాలను చవిచూస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరగడం, లాక్‌డౌన్ విధింపుతో ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం నేపథ్యంలో మార్కెట్లో ఒడిదుడుకులు మరింత కొంతకాలం కొనసాగే అవకాశం ఉందని కొందరు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ 5 షేర్లకు టార్గెట్ ధరను పెంచింది. ఇప్పుడు వాటి పూర్తి వివరాలు చూద్దాం...
డీఎల్‌ఎఫ్ఏ: గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొసాగించింది. టార్గెట్ ధరను రూ.180 నుంచి రూ.190కి పెంచింది. అమ్మకాల వ్యూహంలో మార్పు, మధ్య తరగతి నిర్మాణాలు అధికంగా చేపట్టడం నిర్మాణ సమయంలో అమ్మకాలను ప్రారంభించడటం తదితర ప్రణాళికలతో మొత్తం అమ్మకాల వాల్యూమ్ పునరుద్ధరణ జరగవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022)లో రూ.2,500 కోట్ల అమ్మకాలు జరగవచ్చు. అయితే ఎఫ్‌వై 21 అంచనాను రూ .1.600 కోట్లుగా కొనసాగించింది
వేదాంత లిమిటెడ్: ఇంతకు ముందు కేటాయించిన అండర్‌ఫర్‌ఫామ్ రేటింగ్‌ను అవుట్‌ఫెర్‌ఫామ్ రేటింగ్‌కు అప్‌గ్రేడ్ చేసింది. షేరు టార్గెట్ ధరను రూ.95గా నిర్ణయించింది. గతంలో ఇదే షేరుకు టార్గెట్ ధరను రూ.80గా కేటాయించింది. కంపెనీ నిర్వహణ ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. లాక్‌డౌన్ బలహీనత నికరలాభం మీద ఒత్తిడిని పెంచుతుంది. అల్యూమినియం ఉత్పత్తి సానుకూలంగా ఉండటంతో క్యూ4 ఈబిఐటిడీఏ అంచనాలకు అనుగుణంగా ఉంది. తక్కువ వ్యాల్యూమ్స్, అధిక పరపతితో సంస్థ ఫండమెంటల్స్ ఇంకా బలహీనంగానే ఉన్నాయి. కంపెనీ మెరుగైన కార్యచరణ షేరును నడిపిస్తుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.
హీరో మోటోకార్ప్: గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించింది. షేరు టార్గెట్ ధర రూ.2400 నుంచి రూ.2700కు పెంచింది. అంచనాలకు మించి క్యూ4 ఫలితాలను వెల్లడించింది. అయితే ఆదాయం/ఎబిఐటీడిటా 1శాతం, 20శాతంగా నమోదుకావడం కలిసొచ్చే అంశం. సమీప-కాల డిమాండ్ అనిశ్చితంగా ఉండొచ్చు. కాని ద్విచక్ర వాహన మార్కెట్‌లో కంపెనీ వాటా భారీగా ఉండటం సానుకూలాంశమని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.
జేఎస్‌డబ్ల్యూ స్టీల్: షేరు టార్గెట్ ధరను రూ.197 నుంచి రూ.185 పెంచింది. ఫండమెంటల్స్ ఇంకా సహకరించకపోవడంతో స్టీల్ ఇటీవల జరిగిన ర్యాలీ జరగలేదు. ఇప్పుడు ర్యాలీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ యాక్టివిటీ స్టీల్ సంబంధిత కార్యక్రమాల వైపు ఎక్కువగా ఉంటుంది.
టాటా స్టీల్: షేరు టార్గెట్ ధరను రూ.290 నుంచి రూ.304కు పెంచింది. స్టీల్ ధరలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి. అలాగే సాంకేతికంగా వీక్లీ, షార్ట్ టర్మ్ ఛార్ట్‌లు బుల్లిష్ వైఖరిని సూచిస్తున్నాయి. కాబట్టి స్వల్పకాలికానికి షేరు కొనుగోలు చేయడం ఉత్తమం అని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment