మూడు రోజుల తరువాత దేశీ మార్కెట్లు కొంతమేర పుంజుకున్నాయి.
మూడు రోజుల తరువాత దేశీ మార్కెట్లు కొంతమేర పుంజుకున్నాయి. అయితే రోజు మొత్తం ఒడిదుడుకులను చవిచూసి చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 35 పాయింట్లు లాభపడి 28,068 వద్ద నిలవగా, 20 పాయింట్లు బలపడ్డ నిఫ్టీ మళ్లీ 8,400కు ఎగువన 8,402 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ దిగ్గజాలలో సిప్లా 3%, ఎస్‌బీఐ 2% చొప్పున పుంజుకోగా, ఐటీ దిగ్గజాలు విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ 1% స్థాయిలో పురోగమించాయి. కాగా, మరోవైపు సెసాస్టెరిలైట్, భెల్, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, భారతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్ 2-1% మధ్య నీరసించాయి. ఇక ట్రేడైన షేర్లలో 1,637 నష్టపోగా, 1,372 మాత్రమే లాభపడ్డాయి.