NTPC Ltd
-
రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు.. దూరంగా ఎగిరిపడిన ట్రాక్
రాంచీ: జార్ఖండ్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. కొందరు ఆకతాయిలు రైల్వే ట్రాక్‌పై బాంబు అమర్చారు. ఈ క్రమంలో బాంబు పేలడంతో పేలుడు ధాటికి రైల్వే ట్రాక్ 40 అడుగుల దూరంలో ఎగిరిపడింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లా రంగగుట్టు జిల్లాలో రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు ట్రాక్‌పై పేలుడు పదార్ధాలు అమర్చాడు. దీంతో, పేలుడు సంభవించడంతో ట్రాక్ దాదాపు 40 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, రైల్వే అధికారులు చేరుకున్నారు. అయితే, ఈ ట్రాక్ ఎన్టీపీసీ నుంచి బొగ్గును తరలించే గూడ్స్ రైలుకు సంబంధించిందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్గంలో ప్యాసింజర్ రైళ్లు కనుక ప్రయాణం చేసి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. झारखंड में रेलवे ट्रैक को बम से उड़ा दिया..झारखंड के साहिबगंज में बदमाशों ने विस्फोटक लगाकर रेलवे ट्रैक उड़ा दिया है. हादसे के बाद रेल मार्ग पर रेल सेवा बाधित.#IndianRailways #Jharkhand pic.twitter.com/Yenx6C92EB— Pankaj Tiwari । पंकज तिवारी (@pankaj_cktd) October 2, 2024ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. కొందరు ఆకతాయిలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం కొందరు రైల్వే ట్రాకులపై గ్యాస్ సిలిండర్లు, ఇనుప కడ్డీలు పెట్టిన వీడియోలు బయటకు వచ్చాయి. మరికొందరు ఏకంగా ట్రాక్‌లకు ఉన్న జాయింట్స్‌ను తొలగించారు. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న రైల్వే అధికారులు పలుచోట్ల ఆకతాయిలను అరెస్ట్ కూడా చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో హై అలర్ట్.. రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపులు -
బయోకాన్- ఎన్టీపీసీ- ఎస్కార్ట్స్.. స్పీడ్
మార్కెట్లు తీవ్ర ఆటుపోట్ల మధ్య లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల ప్రభావంతో ఫార్మా దిగ్గజం బయోకాన్, పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ, ట్రాక్టర్ల దిగ్గజం ఎస్కార్ట్స్ లిమిటెడ్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బయోకాన్ లిమిటెడ్ మైలాన్ ఎన్‌వీతో భాగస్వామ్యంలో రూపొందించిన ఇన్సులిన్ ఇంజక్షన్‌ను యూఎస్ మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు వెల్లడించడంతో బయోకాన్ లిమిటెడ్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 395 వద్ద ట్రేడవుతోంది. సెమ్గ్లీ బ్రాండుతో ఇన్సులిన్ గ్లార్గిన్ ఇంజక్షన్‌ను ప్రవేశపెట్టినట్లు బయోకాన్ తాజాగా పేర్కొంది. అధిక బ్లడ్ షుగర్‌ను నియంత్రించేందుకు వీటిని వినియోగించవచ్చని తెలియజేసింది. యూఎస్‌లో వీటిని 3ఎంఎల్ డోసేజీలో ఐదు ఇంజక్షన్ల సెట్‌ను 148 డాలర్లకు, 10 ఎంఎల్ ఇంజక్షన్‌ను 99 డాలర్లకు విక్రయించనున్నట్లు వెల్లడించింది. తద్వారా యూఎస్‌లో అత్యంత చౌకగా ఇన్సులిన్ ఇంజక్షన్‌ను అందిస్తున్నట్లు వివరించింది. ఎన్టీపీసీ లిమిటెడ్ బాండ్ల జారీ ద్వారా రూ. 15,000 కోట్ల సమీకరణకు వాటాదారుల అనుమతి కోరనున్నట్లు విద్యుత్ రంగ దిగ్గజం ఎన్టీపీసీ పేర్కొంది. ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో ఒకేసారి లేదా దశలవారీగా బాండ్ల జారీ చేసే అంశంపై ఈ నెల 24న చేపట్టనున్న వార్షిక సమావేశంలో బోర్డు నిర్ణయించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 100 వద్ద ట్రేడవుతోంది. ఎస్కార్ట్స్ లిమిటెడ్ గత నెల(ఆగస్ట్)లో ట్రాక్టర్ల అమ్మకాలు ఏకంగా 80 శాతం దూసుకెళ్లి 7,268 యూనిట్లను తాకినట్లు ఎస్కార్ట్స్ లిమిటెడ్ వెల్లడించింది. కంపెనీ చరిత్రలోనే ఆగస్ట్‌లో ఈ స్థాయి అమ్మకాలు ఇదే తొలిసారని పేర్కొంది. వీటిలో ఎగుమతులు రెట్టింపై 518 యూనిట్లుగా నమోదైనట్లు వివరించింది. రుతుపవనాలు, పెరిగిన ఖరీఫ్ పంటల సాగు, రిటైల్ ఫైనాన్స్ వంటి అంశాలు ఇందుకు దోహదం చేసినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎస్కార్ట్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 1,154కు చేరింది. ప్రస్తుతం 2.2 శాతం లాభంతో రూ. 1,111 వద్ద ట్రేడవుతోంది. -
స్వల్ప లాభాలతో సరి
మూడు రోజుల తరువాత దేశీ మార్కెట్లు కొంతమేర పుంజుకున్నాయి. అయితే రోజు మొత్తం ఒడిదుడుకులను చవిచూసి చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 35 పాయింట్లు లాభపడి 28,068 వద్ద నిలవగా, 20 పాయింట్లు బలపడ్డ నిఫ్టీ మళ్లీ 8,400కు ఎగువన 8,402 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ దిగ్గజాలలో సిప్లా 3%, ఎస్బీఐ 2% చొప్పున పుంజుకోగా, ఐటీ దిగ్గజాలు విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ 1% స్థాయిలో పురోగమించాయి. కాగా, మరోవైపు సెసాస్టెరిలైట్, భెల్, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, భారతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్ 2-1% మధ్య నీరసించాయి. ఇక ట్రేడైన షేర్లలో 1,637 నష్టపోగా, 1,372 మాత్రమే లాభపడ్డాయి.