రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు.. దూరంగా ఎగిరిపడిన ట్రాక్‌ | Railway Tracks Operated By NTPC Blown Up At Jharkhand Sahibganj | Sakshi
Sakshi News home page

రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు.. దూరంగా ఎగిరిపడిన ట్రాక్‌

Published Wed, Oct 2 2024 4:40 PM | Last Updated on Wed, Oct 2 2024 5:50 PM

Railway Tracks Operated By NTPC Blown Up At Jharkhand Sahibganj

రాంచీ: జార్ఖండ్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. కొందరు ఆకతాయిలు రైల్వే ట్రాక్‌పై బాంబు అమర్చారు. ఈ క్రమంలో బాంబు పేలడంతో పేలుడు ధాటికి రైల్వే ట్రాక్ 40 అడుగుల దూరంలో ఎగిరిపడింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లా రంగగుట్టు జిల్లాలో రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు ట్రాక్‌పై పేలుడు పదార్ధాలు అమర్చాడు. దీంతో, పేలుడు సంభవించడంతో ట్రాక్‌ దాదాపు 40 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, రైల్వే అధికారులు చేరుకున్నారు. అయితే, ఈ ట్రాక్‌ ఎన్‌టీపీసీ నుంచి బొగ్గును తరలించే గూడ్స్‌ రైలుకు సంబంధించిందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్గంలో ప్యాసింజర్‌ రైళ్లు కనుక ప్రయాణం చేసి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. కొందరు ఆకతాయిలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. సోషల్‌ మీడియాలో రీల్స్‌ కోసం కొందరు రైల్వే ట్రాకులపై గ్యాస్‌ సిలిండర్లు, ఇనుప కడ్డీలు పెట్టిన వీడియోలు బయటకు వచ్చాయి. మరికొందరు ఏకంగా ట్రాక్‌లకు ఉన్న జాయింట్స్‌ను తొలగించారు. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న రైల్వే అధికారులు పలుచోట్ల ఆకతాయిలను అరెస్ట్‌ కూడా చేసిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో హై అలర్ట్‌.. రైల్వేస్టేషన్‌లకు బాంబు బెదిరింపులు
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement