railway track blasted
-
రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు.. దూరంగా ఎగిరిపడిన ట్రాక్
రాంచీ: జార్ఖండ్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. కొందరు ఆకతాయిలు రైల్వే ట్రాక్‌పై బాంబు అమర్చారు. ఈ క్రమంలో బాంబు పేలడంతో పేలుడు ధాటికి రైల్వే ట్రాక్ 40 అడుగుల దూరంలో ఎగిరిపడింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లా రంగగుట్టు జిల్లాలో రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు ట్రాక్‌పై పేలుడు పదార్ధాలు అమర్చాడు. దీంతో, పేలుడు సంభవించడంతో ట్రాక్ దాదాపు 40 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, రైల్వే అధికారులు చేరుకున్నారు. అయితే, ఈ ట్రాక్ ఎన్టీపీసీ నుంచి బొగ్గును తరలించే గూడ్స్ రైలుకు సంబంధించిందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్గంలో ప్యాసింజర్ రైళ్లు కనుక ప్రయాణం చేసి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. झारखंड में रेलवे ट्रैक को बम से उड़ा दिया..झारखंड के साहिबगंज में बदमाशों ने विस्फोटक लगाकर रेलवे ट्रैक उड़ा दिया है. हादसे के बाद रेल मार्ग पर रेल सेवा बाधित.#IndianRailways #Jharkhand pic.twitter.com/Yenx6C92EB— Pankaj Tiwari । पंकज तिवारी (@pankaj_cktd) October 2, 2024ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. కొందరు ఆకతాయిలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం కొందరు రైల్వే ట్రాకులపై గ్యాస్ సిలిండర్లు, ఇనుప కడ్డీలు పెట్టిన వీడియోలు బయటకు వచ్చాయి. మరికొందరు ఏకంగా ట్రాక్‌లకు ఉన్న జాయింట్స్‌ను తొలగించారు. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న రైల్వే అధికారులు పలుచోట్ల ఆకతాయిలను అరెస్ట్ కూడా చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో హై అలర్ట్.. రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపులు -
కవచ్ ఏమైంది..?
-
రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన భారీ ముప్పు
బీహార్‌లోని గయ ప్రాంతంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆ రైలు వెళ్లాల్సిన ప్రాంతంలో రైలు పట్టాలను మావోయిస్టులు ధ్వంసం చేశారు. అయితే, ముందుగా వెళ్లిన పైలట్ ఇంజన్ ఈ విషయాన్ని గుర్తించడంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. లేనిపక్షంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి ఉండేది. మంగళవారం రాత్రి మావోయిస్టులు ఇక్కడి రైలుపట్టాలను పేల్చేసినట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇస్లాంపూర్- రఫీగంజ్ ప్రాంతాల మధ్య రైలు పట్టాలు ధ్వంసమై ఉన్నట్లు పైలట్ ఇంజన్ డ్రైవర్ అధికారులకు తెలిపాడు. ఈ పైలట్ ఇంజన్, న్యూఢిల్లీ-హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ-భువనేశ్వర్ రైళ్లకు ముందుగా వెళ్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శతాబ్డి, రాజధాని లాంటి రైళ్లు వెళ్లేముందు పైలట్ ఇంజన్ ఒకటి నడిపించాలని రైల్వే అధికారులు చేసని హెచ్చరిక పాటించడం వల్లే భారీ ప్రమాదం తప్పింది. ఔరంగాబాద్ జిల్లాలో పోలీసు కాల్పుల్లో ఇద్దరు మరణించడంతో మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. పైలట్ రైలు ఇంజన్ పట్టాలు తప్పిందని రైల్వేబోర్డు ఛైర్మన్ అరుణేంద్రకుమార్ తెలిపారు. నాలుగు మీటర్ల పొడవున రైలు పట్టాలు ధ్వంసమైందని ఆయన అన్నారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ సంఘటనపై నివేదిక పంపాల్సిందిగా రైల్వే మంత్రి సదానందగౌడ ఆదేశించారు. -
రైలుపట్టాలు పేల్చేసిన మావోయిస్టులు
జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బొకారో జిల్లాలో రైలు పట్టాలను గురువారం తెల్లవారుజామున పేల్చేశారు. డానియా నుంచి జోగేశ్వర్ బీహార్ స్టేషన్ల మధ్య దాదాపు ఒకటిన్నర మీటర్ల పొడవున రైల్వే ట్రాకును మావోయిస్టులు ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆరు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వీటిని ఇంకా ఇప్పటివరకు పునరుద్ధరించలేకపోయారు. గురువారం మధ్యాహ్నానికి వీటిని పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది. జార్ఖండ్‌లోని ఆరు లోక్‌సభ స్థానాలకు గురువారం నాడు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు ఇప్పటికే పిలుపునిచ్చారు. రాంచీ, జంషెడ్పూర్, చైబసా, ఖుటి, గిరిద్, హజారీబాగ్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.