
ప్రస్తుత పరిస్థితుల్లో భారీగా నష్టాలను చవిచూసిన, అంతంత మాత్రంగా ఆదరణ ఉన్న షేర్లను మాత్రమే కొనుగోలు చేయడం ఉత్తమని దిగ్గజ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. ఈ వ్యాఖ్యలకు కట్టుబడుతూ ఈ తొలి త్రైమాసికంలో ఈయన పతనమైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ విషయం ఆయన ఫోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తే అర్థమవుతోంది. అలాగే చిన్న మొత్తంలో అధిక షేర్లను తన పోర్ట్‌ఫోలియోలో చేర్చుకున్నారు.
కరోనా కారణంగా మార్చిలో అధికంగా నష్టపోయిన అటోలైన్ ఇండస్ట్రీస్, దిక్సాన్ కార్బోజెన్, ఇండియన్ హోటల్స్ షేర్లను కొనుగోలు చేశారు. ఈ షేర్లను అధిక మొత్తంలో కాకుండా 1శాతానికి మించకుండా కొన్నారు. వీటితో పాటు ఎన్‌సీసీ, ఫస్ట్‌సోర్ట్స్ సెల్యూషన్స్, జుబిలెంట్ లైఫ్ సెన్సెన్స్, ర్యాలీస్ ఇండియా, ఎడెల్వీజ్ సర్వీసెస్, ఫెడరల్ బ్యాంక్, డెల్టా కార్ప్ షేర్లను కూడా కొన్నారు.
ఈ జూన్ క్వార్టర్ నాటికి అటోలైన్ ఇండస్ట్రీస్‌లో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా దంపతులిద్దరూ 6.4శాతం వాటాను కలిగి ఉన్నారు. మార్చిలో ఉన్న మొత్తం వాటాతో పోలిస్తే ఈ క్యూ1లో కొద్దిగా వాటాలను విక్రయించినట్లు తెలుస్తోంది. అలాగే జూన్ త్రైమాసికంలో డిష్‌మెన్ కార్బోజెన్ అమ్సిస్‌లో వీరిద్దరూ 1.59 శాతం వాటాను కొనుగోలు చేశారు. ఇదే కాలంలో ఝున్‌ఝున్‌వాలా ఇండియన్ హోటల్స్‌లో 1.05శాతం వాటాను కొనుగోలు చేసి టాటా గ్రూప్‌లోకి ప్రవేశించారు. దురదృష్టవశాత్తు ఏడాది కాలంలో ఈ రెండు షేర్ల ప్రదర్శన అంతబాగోలేదు.
అటోలైన్ ఇండస్టీస్ షేరు నేటి ట్రేడింగ్‌లో 5శాతం లాభపడినప్పటికీ.., ఏడాది కాలంలో షేరు మొత్తం 52శాతం క్షీణించింది. ఇదే ఏడాది కాలంలో ఇండియా హోటల్స్ షేర్లు 44శాతం, డిష్‌మెన్ కార్బోజెన్ షేరు 13శాతం నష్టాన్ని చవిచూశాయి. గత వారం ఒక వెబ్నార్‌లో మాట్లాడుతూ... మార్కెట్లో డౌన్‌వర్డ్ నష్టాలను, అప్‌సైడ్ పొటెన్షియల్స్ రెండింటినీ చూస్తున్నట్లు తెలిపారు. జూలై 22, 2020 బుధవారం నాటికి ఝున్‌ఝున్‌వాలా మొత్తం స్టాక్ హోల్డింగ్ విలువ రూ.11,261 కోట్లుగా ఉన్నట్లు ట్రెండ్లీన్ డేటా చెబుతోంది.
మల్టీబ్యాగర్లను గుర్తించే అంశంపై ఝున్‌ఝున్‌వాలా తన వ్యూహాలను పంచుకున్నారు. ‘‘షేరు కొనుగోలు విషయంలో వ్యక్తిగత అభిప్రాయానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. షేరును అధికం కాలం పాటు హోల్డ్ చేసి ఓపిక ఉండాలి. ఇవన్నీ రిస్క్ తీసుకొనేవారి ధైర్యం, నిలకడ, ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయి. ఇప్పటికీ నేను మార్కెట్లో భారీ పతనాన్ని చవిచూసిన షేర్లను కొనుగోళ్లు చేస్తాను’’ అని ఆయన తెలిపారు.
ఝున్‌ఝున్‌వాలా అతని సతీమణి ఎన్‌సీసీలో 1.25శాతం వాటాలను కొనుగోలు చేశారు. ఈ షేరు ఏడాది కాలంలో 60శాతం నష్టాన్ని చవిచూసింది. ఫస్ట్‌సోర్స్ సెల్యూషన్స్‌లో 0.82శాతం వాటాను కొనుగోలు చేశారు. ఈ షేరుకూడా గడిచిన ఏడాదిలో 18శాతం పతనాన్ని చవిచూసింది.
అలాగే ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో, ర్యాలీస్ ఇండియా ఫెడరల్ బ్యాంక్, డెల్టా కార్ప్‌లో అరశాతం లోపు వాటాను పెంచుతున్నారు. ఈ మూడింటిలో గడిచిన ఏడాది కాలంలో ర్యాలీస్ ఇండియా 98శాతం లాభపడింది. అయితే డెల్టా పవర్ కార్పోరేట్, ఫెడరల్ బ్యాంక్ షేర్లు వరుసగా 42శాతం, 38శాతం నష్టాన్ని చవిచూశాయి.
Comments
Please login to add a commentAdd a comment