కోవిడ్ సంక్షోభంతో గత రెండు నెలలుగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ వారంలో లాభాల్లో ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లకు కొంత ఊరట కలిగిస్తున్నాయి. మరోపక్క లాక్‌డౌన్‌లో సడలింపులు ఇస్తూ సాధారణ పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మార్కెట్ల ర్యాలీకి దోహదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ మూడు షేర్లను కొనవచ్చని సిఫార్సు చేస్తోంది. అవి ఈవిధంగా ఉన్నాయి.
కంపెనీ పేరు: అశోక్ లేలాండ్
బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్
రేటింగ్: కొనవచ్చు
టార్గెట్ ధర: రూ.61
ప్రస్తుత ధర: రూ.48
అశోక్ లేలాండ్ కంపెనీ షేరుకు మోతీలాల్ ఓస్వాల్ బయ్ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.61 గా నిర్ణయించింది. బీఎస్-VI ప్రమాణాలతో మధ్య, భారీ స్థాయి ట్రక్కులను అశోక్ లేలాండ్ గురువారం విడుదల చేసింది.ఏవీటీఆర్ బ్రాండ్ పేరుతో ఓ కొత్త మాడ్యులార్ ప్లాట్‌ఫాంపై వీటిని అందుబాటులోకి తీసుకొచ్చిందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. వినియోగదారులు తమకు కావాల్సిన వాణిజ్య వాహనాలను ఎంపిక చేసుకునే సదుపాయం కల్పించింది.దీనివల్ల వాహన విక్రయాలు పెరిగి కంపెనీ లాభాలు ఆర్జిస్తుందని తెలిపింది. వచ్చే రెండు మూడేళ్లలో మంచి వృద్ధిని సాధిస్తుందని వెల్లడించింది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో అశోక్ లేలాండ్ షేరు ధర రూ.48.50 గా ఉంది.
కంపెనీ పేరు: అరబిందో ఫార్మా
బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్
రేటింగ్: కొనవచ్చు
టార్గెట్ ధర: రూ.880
ప్రస్తుత ధర: రూ.753
బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అరబిందో ఫార్మా షేరుకు బయ్ రేటింగ్‌ను ఇచ్చింది. ఏడాదికాలానికి గాను లాభాలు పెరుగుతాయన్న అంచనాతో షేరు టార్గెట్ ధరను రూ.880 గా నిర్ణయించింది. రెగ్యులేటరీ సమస్యలు కారణంగా ఏఎన్‌డీఏ అనుమతులు ఆలస్యంగా వస్తున్నాయి. అయినప్పటకీ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల ద్వారా అంచనా వేసిన ఆదాయాలను కంపెనీ ఆర్జిస్తుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. యూఎస్, ఈయూ వ్యాపారంలో మెరుగైన లాభాలు వస్తాయని అందువల్ల ఈ షేరు కొనవచ్చని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో ఆరబిందో షేరు రూ. 753.45 గా ఉంది.
కంపెనీ పేరు: బీపీసీఎల్
బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్
రేటింగ్: తటస్థంగా ఉంచింది
టార్గెట్ ధర: రూ.425
ప్రస్తుత ధర: రూ.367
బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) షేరు రేటింగ్‌ను తటస్థంగా ఉంచుతూ టార్గెట్ ధరను రూ.425గా నిర్ణయించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో బీపీసీఎల్ ఇబిటా బ్రోకరేజ్‌ల అంచనాలను మించిపోయిందని తెలిపింది. వార్షిక ప్రాతిపదికన రిఫైనరీ 2 శాతం పెరగగా, విక్రయాలు 5 శాతం పడిపోయాయని వెల్లడించింది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో బీపీసీఎల్ షేరు రూ.367.15 గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment