Broking firm
-
సంపద సృష్టిలో పోటాపోటీ.. అగ్రపథాన రిలయన్స్ ఇండస్ట్రీస్
ముంబై: సంపద సృష్టిలో దేశీ కార్పొరేట్ దిగ్గజాలు పోటీ పడుతున్నాయి. వార్షికంగా చూస్తే 2022లో అదానీ గ్రూప్ కంపెనీలు అగ్రభాగానికి చేరగా.. ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గత ఐదేళ్లలో అన్ని రికార్డులనూ అధిగమిస్తూ లీడర్‌గా నిలిచింది. సంపద సృష్టిపై బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ రూపొందించిన 27వ వార్షిక నివేదిక ప్రకారం గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్ ఈ ఏడాది దుమ్మురేపాయి. ఇతర వివరాలు చూద్దాం.. టాప్–100 ఇలా..: గత ఐదేళ్లలో టాప్–100 కంపెనీలు మొత్తం రూ. 92.2 లక్షల కోట్ల సంపదను జమ చేసుకున్నాయి. ఇది సరికొత్త రికార్డుకాగా.. ఆర్ఐఎల్ అతిపెద్ద వెల్త్ క్రియేటర్‌గా నిలిచింది. అయితే 2022లో అదానీ గ్రూప్ కంపెనీలు వివిధ ఆస్తుల కొనుగోలు, కొత్త రంగాలలోకి ప్రవేశించడం వంటి అంశాలతో వెలుగులో నిలిచాయి. వెరసి 2022లో గౌతమ్ అదానీ 155.7 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే రెండో ధనవంతుడిగా రికార్డు సాధించారు. సెప్టెంబర్ 16కల్లా ఫోర్బ్స్ రూపొందించిన రియల్ టైమ్ జాబితా ఇది. ప్రధానంగా ఈ రెండు కంపెనీలలో 75 శాతం చొప్పున వాటా కలిగిన గౌతమ్ అదానీ 2022లో సెప్టెంబర్‌కల్లా ఏకంగా 70 బిలియన్ డాలర్ల సంపదను జమ చేసుకున్నారు. గ్రూప్ కంపెనీలు అదానీ టోటల్ గ్యాస్(37 శాతం), గ్రీన్ ఎనర్జీ(61 %) ఫోర్బ్స్(65 %)లోనూ వాటాలు కలిగి ఉండటం ఇందుకు సహకరించింది. ఇదే సమయంలో ముకేశ్ 92.3 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో 8వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. 253.5 బిలియన్ డాలర్ల సంపదతో ఎలక్ట్రిక్ కార్ల(టెస్లా) దిగ్గజం ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా ఆవిర్భవించారు. ఐదేళ్ల కాలంలో..: 2017–22 కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ట్రాన్స్మిషన్, ఎంటర్ప్రైజెస్ అత్యంత వేగంగా నిలకడగా ఎదిగిన భారీ కంపెనీలుగా నిలిచాయి. రంగాలవారీగా చూస్తే ఈ కాలంలో టెక్నాలజీ, ఫైనాన్షియల్స్ తొలి రెండు ర్యాంకులను సాధించాయి. సంపద సృష్టిలో టాప్–100 కంపెనీలను, మార్కెట్ విలువల్లో మార్పులను నివేదిక పరిగణించింది. దీనిలో భాగంగా విలీనాలు, విడదీతలు, ఈక్విటీ జారీ, బైబ్యాక్ తదితర కార్పొరేట్ అంశాలను సైతం లెక్కలోకి తీసుకుంది. ఈ ఐదేళ్లలో నాలుగేళ్లపాటు ఆర్ఐఎల్ అత్యధిక సంపదను సృష్టించిన దిగ్గజంగా ఆవిర్భవించింది. వెర సి ఐదేళ్లకుగాను టాప్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఇక టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ జాబితాలో టాప్–5లో నిలిచాయి. కాగా.. అదానీ ఎంటర్ప్రైజెస్ గత ఐదేళ్లలో నిలకడైన సంపద సృష్టికి నిదర్శనంగా నిలిచింది. -
అరబిందో,అశోక్ లేలాండ్ బై: మోతీలాల్ సిఫార్సులు
కోవిడ్ సంక్షోభంతో గత రెండు నెలలుగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ వారంలో లాభాల్లో ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లకు కొంత ఊరట కలిగిస్తున్నాయి. మరోపక్క లాక్డౌన్లో సడలింపులు ఇస్తూ సాధారణ పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మార్కెట్ల ర్యాలీకి దోహదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ మూడు షేర్లను కొనవచ్చని సిఫార్సు చేస్తోంది. అవి ఈవిధంగా ఉన్నాయి. కంపెనీ పేరు: అశోక్ లేలాండ్ బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.61 ప్రస్తుత ధర: రూ.48 అశోక్ లేలాండ్ కంపెనీ షేరుకు మోతీలాల్ ఓస్వాల్ బయ్ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.61 గా నిర్ణయించింది. బీఎస్-VI ప్రమాణాలతో మధ్య, భారీ స్థాయి ట్రక్కులను అశోక్ లేలాండ్ గురువారం విడుదల చేసింది.ఏవీటీఆర్ బ్రాండ్ పేరుతో ఓ కొత్త మాడ్యులార్ ప్లాట్‌ఫాంపై వీటిని అందుబాటులోకి తీసుకొచ్చిందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. వినియోగదారులు తమకు కావాల్సిన వాణిజ్య వాహనాలను ఎంపిక చేసుకునే సదుపాయం కల్పించింది.దీనివల్ల వాహన విక్రయాలు పెరిగి కంపెనీ లాభాలు ఆర్జిస్తుందని తెలిపింది. వచ్చే రెండు మూడేళ్లలో మంచి వృద్ధిని సాధిస్తుందని వెల్లడించింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో అశోక్ లేలాండ్ షేరు ధర రూ.48.50 గా ఉంది. కంపెనీ పేరు: అరబిందో ఫార్మా బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.880 ప్రస్తుత ధర: రూ.753 బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అరబిందో ఫార్మా షేరుకు బయ్ రేటింగ్‌ను ఇచ్చింది. ఏడాదికాలానికి గాను లాభాలు పెరుగుతాయన్న అంచనాతో షేరు టార్గెట్ ధరను రూ.880 గా నిర్ణయించింది. రెగ్యులేటరీ సమస్యలు కారణంగా ఏఎన్‌డీఏ అనుమతులు ఆలస్యంగా వస్తున్నాయి. అయినప్పటకీ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల ద్వారా అంచనా వేసిన ఆదాయాలను కంపెనీ ఆర్జిస్తుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. యూఎస్, ఈయూ వ్యాపారంలో మెరుగైన లాభాలు వస్తాయని అందువల్ల ఈ షేరు కొనవచ్చని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఆరబిందో షేరు రూ. 753.45 గా ఉంది. కంపెనీ పేరు: బీపీసీఎల్ బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: తటస్థంగా ఉంచింది టార్గెట్ ధర: రూ.425 ప్రస్తుత ధర: రూ.367 బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) షేరు రేటింగ్‌ను తటస్థంగా ఉంచుతూ టార్గెట్ ధరను రూ.425గా నిర్ణయించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో బీపీసీఎల్ ఇబిటా బ్రోకరేజ్‌ల అంచనాలను మించిపోయిందని తెలిపింది. వార్షిక ప్రాతిపదికన రిఫైనరీ 2 శాతం పెరగగా, విక్రయాలు 5 శాతం పడిపోయాయని వెల్లడించింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో బీపీసీఎల్ షేరు రూ.367.15 గా ఉంది. -
ప్రతికూల పరిస్థితుల్లోనూ వీటిని కొనవచ్చు
ప్రస్తుత కాలంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల్లో చోటుచేసుకుంటున్న వివిధ పరిణామాలకు మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అందువల్ల మదుపరులు ఆచితూచి అడుగులు వేయాలని చెబుతూ కొన్ని షేర్లను కొనవచ్చని బ్రోకరేజ్ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. అవి ఈ విధంగా ఉన్నాయి. కంపెనీ పేరు: క్వెస్ కార్పొరేషన్ బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్ : కొనవచ్చు టార్గెట్ ధర: రూ.360 ప్రస్తుత ధర: రూ.221 బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ క్వెస్ కార్పోరేషన్ షేరుకు బయ్ రేటింగ్‌ను ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం-22లో 14 పీఈ అంచనాతో ఈ షేరుకు టార్గెట్ ధరను రూ.360 గా నిర్ణయించింది. ఏప్రిల్,మే నెలల్లో వైరస్ ప్రభావం తీవ్రంగా పడిందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. రెండేళ్లలో ఈపీఎస్ 13 శాతం పెరుగుతుందని అంచనా వేస్తూ ఈ షేరును కొనవచ్చని సిఫార్సు చేసింది. కాగా బీఎస్ఈలో క్వెస్ కార్పొరేషన్ షేరు ప్రస్తుత ధర రూ.221.55 గా ఉంది. కంపెనీ పేరు:బయోకాన్ బ్రోకరేజ్ సంస్థ: జియోజిత్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.390 ప్రస్తుత ధర: రూ.354 బయోకాన్ షేరుకు బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ బయ్ రేటింగ్‌ను ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం-22లో 31 పీఈ అంచనాతో ఏడాదికాలానికి గాను ఈ షేరు టార్గెట్ ధరను రూ.390 గా నిర్ణయించింది. కోవిడ్-19 మహమ్మారి సవాళ్లు ఉన్నప్పటికీ బయోకాన్ కంపెనీ కొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టడం వల్ల కంపెనీ మీడియం టర్మ్ వృద్ధి అవుట్‌లుక్ బావుంటుందని అంచనా వేస్తున్నట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈషేరు ధర రూ.354.70 గా ఉంది. కంపెనీ పేరు: కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ బ్రోకరేజ్ సంస్థ: యస్ సెక్యూరిటీస్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.313 ప్రస్తుత ధర: రూ.204.95 బ్రోకరేజ్ సంస్థ యస్ సెక్యూరిటీస్ కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ షేరుకు బయ్ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.313గా నిర్ణయించింది.మార్చితో ముగిసిన క్యూ4లో ఈ కంపెనీ ఫలితాలు బ్రోకరేజ్‌ల అంచనాలను అందుకున్నాయని యస్‌సెక్యూరిటీస్ తెలిపింది. ఆయిల్-గ్యాస్ విభాగంలో ఆదాయం 75 శాతం పెరిగినప్పటికీ టీ అండ్ డీ ఆదాయాలు క్షీణించాయని వెల్లడించింది.లాక్డౌన్ వల్ల విక్రయాలు క్షీణించినప్పటికీ ఆర్థిక సంవత్సరం-21లో మార్జిన్ వృద్ధి పెరుగుతుందని తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.204.95 గా ఉంది. కంపెనీ పేరు: కోల్ ఇండియా బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.195 ప్రస్తుత ధర: రూ.141 బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ కోల్ ఇండియా షేరుకు బయ్ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్ ధరను రూ.195గా నిర్ణయించింది. కోల్ ఇండియా తన సొంత గనులు పవర్ ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించిందని, తద్వారా కంపెనీపై పడుతున్న అధిక భారాన్ని (ఓవర్ బర్డెన్ రిమూవల్-ఓబీఆర్)కొంత మేర తగ్గిస్తుందని మోతీలాల్ తెలిపింది. గడిచిన రెండునెలల కాలలంలో ఓబీఆర్ 15 శాతం ఉందని తెలిపింది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.141.05 గా ఉంది. కంపెనీ పేరు: ప్రిజం జాన్సన్ బ్రోకరేజ్ సంస్థ: ఎమ్కే గ్లోబల్ రేటింగ్: హోల్డ్‌లో ఉంచింది టార్గెట్ ధర: రూ.39 ప్రస్తుత ధర: రూ.33 బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ ప్రిజం జాన్సన్ కంపెనీ రేటింగ్‌ను హోల్డ్‌లో ఉంచుతూ ..ఏడాదికాలానికి గాను టార్గెట్ ధరను రూ.39 గా నిర్ణయించింది. సిమెంట్ విభాగంలో అధిక లాభార్జనతో అంచనాలను మించిపోతుందని ఎమ్కే గ్లోబల్ తెలిపింది.ఇబీటా రూ.1.4 బిలియన్ల వద్ద స్థిరంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.33.30 గా ఉంది. -
ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుభవమే మంచి పాఠం
* బ్రోకింగ్ సంస్థల సలహాలకు, మార్కెట్ న్యూస్‌కు ప్రాధాన్యం * రిలయన్స్ క్యాపిటల్ సర్వేలో వెల్లడి రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది మార్కెట్ న్యూస్, బ్రోకరేజి సంస్థల నివేదికలు, ఇతరత్రా నమ్మదగిన సమాచారంపై ఆధారపడి పెట్టుబడులు పెడుతున్నట్లు రిలయన్స్ క్యాపిటల్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. రిలయన్స్ క్యాపిటల్ బ్రోకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ విభాగం రిలయన్స్ సెక్యూరిటీస్ ఇటీవల తొలిసారిగా రిటైల్ ఇన్వెస్టర్ సర్వేలను నిర్వహించింది. ఇన్వెస్టర్లు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారనే అంశాలను వెల్లడించింది. ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో 25-40 ఏళ్ల వయసున్న సుమారు వెయ్యికి పైగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ‘స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు సాధారణంగా షేర్ల పనితీరును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడతారు. కానీ ఈ సర్వేలో పాల్గొన్న వారు గతంలో తాము చేసిన పెట్టుబడుల తీరునే పునఃసమీక్షించుకుని, అప్పుడు చేసిన తప్పులను మరలా చేయకుండా ఉండేందుకే ఇష్టత చూపుతున్నారు’ అని వివరిం చారు. టెక్నాలజీ సాయంతో ప్రస్తుత మార్కెట్ విధానాలు సహా గతంలోని మార్కెట్ పరిస్థితుల్ని కూడా తెలుసుకోవడానికి టెక్నాలజీ ఎంతగానో ఉపకరిస్తుందని సర్వేలో ఇన్వెస్టర్లు పేర్కొన్నారు. 1. 93% మంది రిటైల్ ఇన్వెస్టర్లు ట్రేడింగ్ నిర్ణయాలను మార్కెట్ న్యూస్ ప్రభావితం చేస్తుందన్నారు. 2. అనుభవమే మంచి సలహాదారని, గత ఇన్వెస్ట్మెంట్లనే పరిగణనలోకి తీసుకొని కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తామని 95% మంది పేర్కొన్నారు. 3. ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ఎంపికలో బ్రోకింగ్ సంస్థలు కీలకమని 80% మంది తెలిపారు. 4. ఇన్వెస్ట్‌మెంట్‌కు ముందు వివిధ బ్రోకింగ్ సంస్థల సలహాలను తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తామని 80% మంది తెలిపారు. 5. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు పలు మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటామని సర్వేలో పాల్గొన్న 70% మంది అభిప్రాయపడ్డారు.