2024లో రూ. 3.94 లక్షల కోట్లు
2023లో రూ. 1.61 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి భారీస్థాయిలో పెట్టుబడులు ప్రవహించాయి. గత క్యాలండర్ ఏడాది(2024)లో రూ. 3.94 లక్షల కోట్ల నిధులు లభించాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇవి రెట్టింపుకాగా.. ఇది మార్కెట్లపట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసాన్ని, దీర్ఘకాలిక పెట్టుబడులపట్ల ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. ప్రధానంగా ఇందుకు క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్‌లు) ఉపయోగపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే కొత్త ఏడాది(2025)లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు.
2024 డిసెంబర్ ప్రారంభం నుంచి మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పరిశ్రమలో పెట్టుబడులు తగ్గడం ప్రారంభమైనట్లు జెరి్మనేట్ ఇన్వెస్టర్ సరీ్వసెస్ సీఈవో, సహవ్యవస్థాపకుడు సంతోష్ జోసెఫ్ పేర్కొన్నారు. ఇందుకు స్టాక్ మార్కెట్ల ఆటుపోట్లు కారణమైనట్లు తెలియజేశారు. చరిత్ర ప్రకారం మార్కెట్ల ఆధారంగానే ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు ప్రవహిస్తుంటాయని వివరించారు. మార్కెట్ల ఒడిదుడుకులు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపుతుంటాయని అందువల్ల ప్రస్తుత హెచ్చుతగ్గుల కారణంగా 2025లో కొత్త ఫండ్ ఆఫర్లు(ఎన్‌ఎఫ్‌వోలు), ఈక్విటీ ఫండ్‌ల నిధుల సమీకరణ తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
పెట్టుబడులు కొనసాగవచ్చు
పరిస్థితులు సర్దుకున్నాక పెట్టుబడులపై లబ్ది చేకూరే వీలుండటంతో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించే వీలున్నదని సంతోష్ తెలియజేశారు. గతేడాది మొత్తం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాలకు రూ. 3.94 లక్షల కోట్లు లభించినట్లు మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) వెల్లడించింది. 2023లో రూ. 1.61 లక్షల కోట్ల పెట్టుబడులు మాత్రమే అందుకున్నట్లు తెలియజేసింది. కాగా.. గతేడాది భారీ పెట్టుబడుల నేపథ్యంలో ఎంఎఫ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 40 శాతం ఎగశాయి. దీంతో 2024 డిసెంబర్‌కల్లా రూ. 30.57 లక్షల కోట్లకు ఏయూఎం చేరింది.
2023లో రూ. 21.8 లక్షల కోట్లుగా నమోదైంది. మార్కెట్లు నిలకడగా బలపడటం, ఆరి్ధక అవగాహన మెరుగుపడటం, ఇన్వెస్టర్లు సిప్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు 2024లో ఈక్విటీ ఫండ్‌ల ఉత్తమ పనితీరుకు తోడ్పాటునిచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడులపై అవగాహన పెంచుకోవడం ద్వారా సంపద వృద్ధికి వీలు దోహదపడినట్లు బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీ సీఈవో గణేశ్ మోహన్ పేర్కొన్నారు. మార్కెట్లు నిలకడగా బలపడటం, పెట్టుబడుల్లో డిజిటైజేషన్‌తో ఈక్విటీ ఎంఎఫ్‌లు పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు తెలియజేశారు.
థిమాటిక్ ఫండ్స్ స్పీడ్
గతేడాది ఈక్విటీ పథకాలలో థిమాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ. 1.55 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ రూ. 32,465 కోట్లు, రూ. 34,223 కోట్లు చొప్పున అందుకున్నాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ. 19,415 కోట్లు ప్రవహించాయి. పెట్టుబడుల్లో రూ. 2.5 లక్షల కోట్లతో సిప్‌లు ప్రధాన పాత్ర పోషించాయి.
Comments
Please login to add a commentAdd a comment