పీఎఫ్ సొమ్ము ఎఫ్‌డీగా ఓకేనా? | is ok for pf money as fd | Sakshi
Sakshi News home page

పీఎఫ్ సొమ్ము ఎఫ్‌డీగా ఓకేనా?

Published Mon, Aug 18 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

is ok for pf money as fd

నేను ఒక ప్రభుత్వోద్యోగిని. నా వార్షికాదాయం మూడున్నర లక్షలు. నేను మ్యూచువల్‌ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఎక్కడ నుంచి ప్రారంభించాలి?      - ప్రకాశ్, రాజమండ్రి
 మీరు మొదటిసారిగా మ్యూచువల్‌ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి, జాగ్రత్తగా వ్యవహరించాలి. మొదట్లోనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, మీకు మ్యూచువల్‌ఫండ్స్‌పైననే  నమ్మకం పోతుంది. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్‌ల్లో  దీర్ఘకాలంగా  ఇన్వెస్ట్ చేయడం ద్వారా లభించే ప్రయోజనాలను మీరు కోల్పోతారు. ఈక్విటీల్లో 5-10 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని ధీటుగా ఎదుర్కొనగలుగుతారు. మరోవైపు చెప్పుకోదగ్గ స్థాయిలో సంపదను సమకూర్చుకున్నవారవుతారు. దీనికోసం మీరు పెద్ద మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడి పెట్టకుండా, క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేయండి.

మీరు మ్యూచువల్   ఫండ్స్‌కు కొత్త కాబట్టి, మొదటిసారిగా రెండు బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే వీటిల్లో ఒడిదుడుకులు తక్కువ. పైగా పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. ఈ ఫండ్స్‌నుంచి వచ్చే దీర్ఘకాలిక రాబడులపై ఎలాంటి పన్నులు ఉండవు. మీరు ఎంచుకోవడానికి కొన్ని ఫండ్స్-కెనరా రొబెకో బ్యాలెన్స్, డీఎస్‌పీ బీఆర్ బ్యాలెన్స్‌డ్, ఎఫ్‌టీ ఇండియా బ్యాలెన్స్‌డ్, టాటా బ్యాలెన్స్‌డ్.

 నాలుగేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయడానికి ఎల్ అండ్ టీ బిజినెస్ సైకిల్, రిలయన్స్ బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్స్‌ను షార్ట్‌లిస్ట్ చేశాను. నేను సరైన ఫండ్స్‌నే ఎంచుకున్నానా? మీ అభిప్రాయం తెలపండి ?  - అవంతిక, హైదరాబాద్
 మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి, 4 ఏళ్ల కాలానికి ఏ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయకూడదో, ఆ ఫండ్స్‌నే మీరు ఎంపిక చేసుకున్నారు. ఎల్ అండ్ టీ బిజినెస్ సైకిల్ అనేది కొత్త మ్యూచువల్ ఫండ్. దీనికి ట్రాక్ రికార్డ్ ఏమీ లేదు. ఇక రిలయన్స్ బ్యాంకింగ్ అనేది సెక్టోరియల్ మ్యూచువల్ ఫండ్. 4 ఏళ్ల కాలానికి ఇది సరైనది కాదు.  మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి. వివిధీకరణ తప్పనిసరి అని గుర్తించండి. మంచి పనితీరు ఉన్న లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్స్‌ల్లో  ఇన్వెస్ట్ చేయండి. 4 ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ ఉత్తమం.

 క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా?
 - పారినాయుడు, శ్రీకాకుళం

 క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ ఫండ్-మంచి పనితీరు కనబరుస్తున్న డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఒకటి.  ఈ ఫండ్‌ను నేరుగానే విక్రయిస్తారు. కాబట్టి ఎక్స్‌పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతమున్న అన్ని ఈక్విటీ పండ్స్‌ల్లో ఈ ఫండ్‌కే ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇతి అత్యుత్తమమైన ఫండ్ అని చెప్పవచ్చు.

 మా నాన్నగారు ఇటీవలనే  రిటైరయ్యారు. ప్రావిడెండ్ ఫండ్ కింద రూ.25 లక్షలు వచ్చాయి. ఈ మొత్తాన్ని బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆయన అనుకుంటున్నారు. దీనిపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎంత శాతం ఉంటుంది. ఆయనకు వేరే ఆదాయ వనరులు ఏమీ లేవు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కాకుండా వేరే ఇతరత్రా ఏమైనా సాధానాల్లో ఇన్వెస్ట్ చేయమంటారా?  - ఘనీ, నిజామాబాద్
 బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఆర్జించిన వడ్డీపై మీ నాన్నగారి ట్యాక్స్ స్లాబ్‌ను బట్టి పన్ను విధిస్తారు. ఇతర వనరుల నుంచి ఆదాయంగా ఈ ఎఫ్‌డీ వడ్డీని పరిగణిస్తారు. వడ్డీ మొత్తం రూ.10,000కు మించితే బ్యాంకు 10 శాతం టీడీఎస్‌గా  కోత విధిస్తుంది.  పీఎఫ్ మొత్తంపై క్రమం తప్పని ఆదాయాన్ని మీ నాన్నగారు ఆశిస్తున్నట్లుగా ఉంది. ఈ దిశగా చూస్తే, ఎఫ్‌డీల కంటే మెరుగైన కొన్ని మార్గాలు ఉన్నాయి.

 ఈ మొత్తం ఒకేసారి మీ నాన్నగారికి ఆవసరముండదు. అందుకుని ఆయన నెలవారీ ఖర్చు ఎంతో ముందు లెక్కించండి. దీనికి 6 రెట్ల మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్‌లో డిపాజిట్ చేయండి.అ తర్వాత 2-3 సంవత్సరాల మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయండి. దీంతో పన్ను బాధ్యత చెప్పుకోదగిన విధంగా తగ్గిపోతుంది. మిగిలిన మొత్తాన్ని మంచి రేటింగ్ ఉన్న షార్ట్‌టెర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement