పసిడి ఫండ్‌పై పునరాలోచన మేలు | Gold fund should reconsider | Sakshi
Sakshi News home page

పసిడి ఫండ్‌పై పునరాలోచన మేలు

Published Mon, Jan 6 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

Gold fund should reconsider

నా ఫండ్ పోర్ట్‌ఫోలియోలో 5 ఫండ్లు ఉన్నాయి. వీటి వివరాలు.., ఎస్‌బీఐ మ్యాగ్నమ్ ఎమర్జింగ్ బిజినెసెస్, రిలయన్స్ ఈక్విటీ ఆపర్చునిటీస్, హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ, డీఎస్‌పీ బ్లాక్‌రాక్ టాప్ 100, రిలయన్స్ గోల్డ్. ఈ ఫండ్స్ పర్వాలేదా? మీరేమైనా మార్పులు, చేర్పులు సూచిస్తారా? నా పోర్ట్‌ఫోలియోలో మరిన్ని అగ్రెసివ్ లార్జ్-క్యాప్ ఫండ్స్‌కు చోటివ్వమంటారా?
 - నవీన్, శ్రీకాకుళం
 
 మీరు మంచి ఫండ్స్‌నే ఎంపిక చేసుకున్నారు. ఈక్విటీ ఫండ్స్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతుంటాయి. స్వల్పకాలానికంటే దీర్ఘకాలానికే ఈక్విటీ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు పెట్టాలి. అగ్రెసివ్ ఫండ్స్ విషయంలో ఇది మరింతగా వర్తిస్తుంది. లార్జ్‌క్యాప్ ఈక్విటీ ఫండ్స్... అగ్రెసివ్ ఫండ్స్‌లా  పనితీరును కనబరిచే అవకాశాలు స్వల్పంగా ఉంటాయి. నష్టభయం ఉన్నప్పటికీ, చిన్న కంపెనీల్లోనే అగ్రెసివ్ ఫండ్స్ పెట్టుబడులు పెడతాయి. అయితే కొన్ని లార్జ్‌క్యాప్ ఫండ్స్ అగ్రెసివ్ ఫండ్స్‌లాగానే పనితీరు కనబరుస్తాయి. దీనికి ఉదాహరణగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్‌డ్ బ్లూచిప్‌ను చెప్పుకోవచ్చు. మీరు దీర్ఘకాలిక ఇన్వెస్టర్ అయినట్లయితే మరిన్ని అగ్రెసివ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లయితే, మా వాల్యూ రీసెర్చ్ వెబ్‌సైట్‌లోని లార్జ్ అండ్ మిడ్, మిడ్-క్యాప్ కేటగిరిల్లోని ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.  భవిష్యత్తులో నిలకడైన వృద్ధిని బంగారం ఇవ్వలేదని చెప్పొచ్చు. అందుకే మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న గోల్డ్ ఫండ్ విషయమై పునరాలోచన చేయండి. డీఎస్‌పీ బ్లాక్‌రాక్ టాప్ 100 మాతం అగ్రెసివ్ ఫండ్ కాదని చెప్పవచ్చు. ఇక మిగిలిన ఫండ్స్ అన్నీ బావున్నాయి. అన్ని ఫండ్స్ మంచి పనితీరునే కనబరుస్తున్నాయి.
 
 నేను 2007లో రిలయన్స్ ట్యాక్స్ సేవర్ డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో రూ.20,000 పెట్టుబడులు పెట్టాను. ఇప్పటిదాకా డివిడెండ్ రూపంలో రూ.11,600 వచ్చాయి. ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా? కొనసాగమంటారా?
 -శ్రీవాణి, హైదరాబాద్
 రిలయన్స్ ట్యాక్స్ సేవర్ అనేది 3-స్టార్ రేటింగ్ ఉన్న పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్. కానీ అన్ని ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటోంది. దీంతో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి లేదు. ఈ ఫండ్స్ చెల్లించే డివిడెండ్‌ను రీ ఇన్వెస్ట్ చేస్తే మళ్లీ దానికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఈ లాకిన్ పీరియడ్ పూర్తయ్యేదాకా మీరు మీ పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి లేదు. ఒకవేళ మీరు మీ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలంటే, మీరు మీ ప్లాన్‌ను డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్ నుంచి డివిడెండ్ పేఅవుట్‌కు మార్చుకోవలసి ఉంటుంది. ఇలా మార్చుకుంటే మీకు రావలసిన డివిడెండ్‌ను రీ ఇన్వెస్ట్ చేయకుండా డివిడెండ్‌ను మీకు నేరుగా ఫండ్ కంపెనీ  చెల్లిస్తుంది. మూడేళ్ల తర్వాత మీ పెట్టుబడులను వెనక్కు తీసుకోవచ్చు.
 
 నా వయస్సు 46 సంవత్సరాలు. నేను హెచ్‌డీఎఫ్‌సీ ఎస్‌ఎల్ యంగ్‌స్టార్ సూపర్ టూ పాలసీ- ఆపర్చునిటీస్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ప్రీమియం టెర్మ్ ఐదేళ్లు, బెనిఫిట్ టెర్మ్ పదేళ్లుగా ఉన్న ఈ ఫండ్‌లో 2010, నవంబర్ నుంచి ప్రీమియం చెల్లిస్తూ  వస్తున్నాను. ఏడాదికి రూ.25,000 చొప్పున మూడేళ్ల పాటు చెల్లించాను. ఆ తర్వాత ఆపేశాను. ఈ ఏడాది డిసెంబర్ 1 నాటికి ఈ ప్లాన్ విలువ రూ.58,120గా ఉంది. ఈ పాలసీ నుం చి వైదొలగమంటారా? కొనసాగమంటారా?
 - జాన్సన్, గుంటూరు
 హెచ్‌డీఎఫ్‌సీ యంగ్‌స్టార్ సూపర్ టూ అనేది యూనిట్ లింక్‌డ్ పాలసీ.సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎంతైతే రాబడి వస్తుందో అంతే రాబడి ప్రస్తుతం ఈ ఫండ్ ద్వారా వస్తోంది. మీరు ఇప్పటికే మూడేళ్లపాటు ప్రీమి యం చెల్లించారు. కానీ ప్రస్తుతమున్న విలువ దృష్ట్యా మీకు నష్టం వచ్చింది. మీరు ఇప్పుడు ఈ పాలసీని సరెండర్ చేస్తే, డిస్‌కంటిన్యూ చార్జీల కింద మీ వార్షిక ప్రీమియంలో 10 శాతం మొత్తాన్ని, లేదా రూ. 1,000 (ఏది కనిష్టమైతే, అది) చెల్లించాలి.  మీ నష్టాలకు ఇది అదనం. ఇప్పటికే మీ ప్లాన్ డిస్‌కంటిన్యూ మోడ్‌లో ఉంది. ఇక ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీల కింద మీ డిస్‌కంటిన్యూడ్ పాలసీపై 0.50 శాతాన్ని ఈ ప్లాన్ సంస్థ చార్జ్ చేస్తుంది. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, మీ పాలసీని సరెండర్ చేసి మీ నష్టాలను పరిమితం చేసుకుంటేనే సముచితంగా ఉంటుంది. మీరు ఈ పాలసీని సరెండర్ చేస్తే, మీకు ఇన్సూరెన్స్ కవర్ ఉండదు కాబట్టి, మీకు సరిపోయేలా టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇక మిగిలిన మొత్తాన్ని మీరు భరించగలిగే నష్ట భయాన్ని బట్టి ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి.

ధీరేంద్ర కమర్,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement