న్యూఢిల్లీ: ఈక్విటీల్లో మరింతగా ఇన్వెస్ట్ చేసే అంశాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో పరిశీలిస్తోంది. ప్రస్తుతం 15 శాతంగా ఉన్న పరిమితిని 20 శాతం వరకూ పెంచాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదనపై జులైలోనే ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జులై 29, 30 తారీఖుల్లో జరిగే ఈపీఎఫ్‌వో ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. (Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్ విషయాలు)
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈపీఎఫ్‌వో తన దగ్గరున్న ఇన్వెస్ట్ చేయతగిన డిపాజిట్లలో 5-15 శాతం భాగాన్ని ఈక్విటీలు లేదా ఈక్విటీ సంబంధ స్కీముల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. తాజాగా దీన్ని 20 శాతం వరకూ పెంచే ప్రతిపాదనకు ఈపీఎఫ్‌వో సలహాదారు ఫైనాన్స్ ఆడిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ (ఎఫ్‌ఏఐసీ) ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ఎఫ్‌ఏఐసీ సిఫార్సులను తుది ఆమోదం కోసం కీలక నిర్ణయాలు తీసుకునే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ముందు ఉంచనున్నారు. 2015 ఆగస్టు నుంచి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లలో పెట్టుబడుల ద్వారా ఈక్విటీల్లో 5 శాతం ఇన్వెస్ట్ చేయడాన్ని ఈపీఎఫ్‌వో ప్రారంభించింది. ఇటీవలే ఈ పరిమితిని 15 శాతానికి పెంచింది. అయితే, రాబడులకు ప్రభుత్వ హామీలాంటివి ఉండని స్టాక్‌మార్కెట్లలో పింఛను నిధులను ఇన్వెస్ట్ చేయడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్)
చదవండి: Tata Steel: వ్యయాల సెగ.. అందుకే టాటా స్టీల్ ఫలితాలు ఇలా!
Comments
Please login to add a commentAdd a comment