
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద ఉన్న, ప్రైవేట్ రంగ ఉద్యోగులు చాలా కాలంగా తమ కనీస పెన్షన్‌ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన 2025-26 బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారేమో అని చూసారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రకటలను వెలువడే అవకాశం ఉంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి.. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఫిబ్రవరి 28, 2025న సమావేశం కానుంది. ఇందులో పెన్షన్ సవరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. వడ్డీ రేటుకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా.. పెన్షన్ పెంపుదల అంశం చర్చనీయాంశంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
2014 నుంచి మినిమమ్ పెన్షన్ నెలకు రూ. 1,000గా ఉంది. దీనిని 7500 రూపాయలకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. EPF సభ్యులు తమ జీతంలో 12 శాతం ప్రావిడెంట్ ఫండ్‌కు జమ చేస్తారు. అంతే మొత్తంలో సంస్థ కూడా జమచేస్తుంది. కంపెనీ జమచేసి 12 శాతంలో.. 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కి కేటాయిస్తారు. మిగిలిన 3.67 శాతం EPF స్కీమ్‌కి వెళుతుంది.
గత కొన్ని సంవత్సరాలుగా.. పెన్షనర్లు, న్యాయవాద సంఘాలు ప్రస్తుత పెన్షన్ స్కీమును విమర్శిస్తున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నెలకు రూ.1,000 పెన్షన్ సరిపోదని చెబుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులతో, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కాబట్టి ఇక సీబీటీ నిర్ణయం కోసం వారందరూ ఎదురు చూస్తున్నారు.
EPFO కనీస పెన్షన్ పెంపు
2025 బడ్జెట్‌కు ముందు.. EPS-95 పదవీ విరమణ చేసిన వారి ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి, నెలకు రూ. 7,500 కనీస పెన్షన్ పెంపు, డియర్‌నెస్ అలవెన్స్ (DA) గురించి వివరించారు. ఆ విషయాలను తప్పకుండా పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారని EPS-95 జాతీయ కమిటీ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే.. మినిమమ్ పెన్షన్ పెంపు తప్పకుండా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment