ఈక్విటీ మార్కెట్‌లో మహిళా పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరుగుతోంది. వారి సగటు పోర్ట్‌ఫోలియో పరిమాణం రూ.55,454గా ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇది ఈక్విటీ పెట్టుబడిదారుల జాతీయ సగటు కంటే ఎక్కువ. ఈక్విటీలో పెట్టుబడిపెట్టే మొత్తం మహిళల్లో మెజారిటీ (68%) రూ.1 లక్షలోపు పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నారని ఆన్‌లైన్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ ఫైయర్స్ డేటా ద్వారా తెలిసింది.
ఈ నివేదిక ప్రకారం 21% మహిళలు రూ.1 లక్ష-రూ.5 లక్షల వరకు పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నారు. 11% మంది రూ.5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. మహారాష్ట్రలోని మొత్తం ఇన్వెస్టర్లలో దాదాపు మహిళలు సగం మంది ఉన్నారు. మొత్తం మహిళా పెట్టుబడిదారుల్లో 22.38% మంది మహారాష్ట్ర వారే. ఆంధ్రప్రదేశ్‌లో 10.68%, కర్ణాటక 7.65%, కేరళ 5.78% మంది మహిళలు ఈక్వీటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థ
మహిళా వ్యాపారులు ఉన్న మొదటి ఐదు నగరాల్లో ముంబై (4.16%), బెంగళూరు (4.19%), పుణె (3.93%), థానే (2.66%), హైదరాబాద్ (2.62%) ఉన్నాయి. 26-55 ఏళ్ల వయసు ఉన్న మహిళలు 58% మంది ఉన్నారు. ఫైయర్స్ ప్లాట్‌ఫారమ్‌లో మహిళా పెట్టుబడిదారులు నెలకు 5% స్థిరమైన వృద్ధితో పెరుగుతున్నారని డేటా ద్వారా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment