సిప్ పెట్టుబడులపై పన్నులు ఉంటాయా? | interview by dhirendra kumar | Sakshi
Sakshi News home page

సిప్ పెట్టుబడులపై పన్నులు ఉంటాయా?

Published Mon, Feb 24 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM

సిప్ పెట్టుబడులపై పన్నులు ఉంటాయా?

సిప్ పెట్టుబడులపై పన్నులు ఉంటాయా?

 డీఎస్‌పీ బ్లాక్ రాక్ ఈక్విటీ ఫండ్‌లో మూడేళ్ల సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పూర్తి చేశాను. ఇటీవలే ఆ మొత్తాన్ని రిడీమ్ చేసుకున్నాను. రూ.3.10 లక్షలు ఇన్వెస్ట్ చేయగా, రూ.3.40 లక్షలు వచ్చాయి. నేను ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది?
 - ప్రసన్న, విశాఖ పట్టణం.

 

 ఒక ఏడాది లోపు ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పొందిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలు(షార్ట్‌టెర్మ్ గెయిన్స్)గానూ, అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పొందిన లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలు(లాంగ్‌టెర్మ్ గెయిన్స్)గానూ పరిణిస్తారు. ఈక్విటీ, ఈక్విటీ ఫండ్స్‌పై పొందిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఎలాంటి పన్నులు ఉండవు. స్వల్పకాలిక మూలధన లాభాలపై మాత్రం 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక సిప్ ఇన్వెస్ట్‌మెంట్ విషయానికొస్తే, పన్ను బాధ్యత ప్రతీ ఇన్‌స్టాల్‌మెంట్‌కు విడివిడిగా లెక్కిస్తారు. ఇన్వెస్ట్ చేసిన తేదీ నుంచి రిడంప్షన్ తేదీ మధ్య ప్రతీ ఇన్‌స్టాల్‌మెంట్ కాలం, పొందిన లాభాలను పరిగణనలోకి తీసుకొని పన్ను లెక్కిస్తారు. అయితే ఇదంతా మీరు పెన్నూ, పేపరూ తీసుకొని లెక్కించాల్సిన పని లేదు.  

 

మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్‌ను డీఎస్‌పీ బ్లాక్‌రాక్ కంపెనీని మీరు అడగవచ్చు. లేదా ఫండ్‌హౌజ్ వద్ద మీరు మీ ఈ మెయిల్ ఐడీని నమోదు చేసుకున్నట్లైతే, మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌కామ్స్‌ఆన్‌లైన్‌డాట్‌కామ్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. దీంట్లో ఇన్వెస్టర్ సర్వీసెస్, మెయిల్‌బాక్ సర్వీసెస్, కన్సాలిడేటెడ్ రియలైజ్‌డ్ గెయిన్ స్టేట్‌మెంట్‌పై క్లిక్ చేస్తే మీ మెయిల్‌కు ఆ స్టేట్‌మెంట్ వచ్చేస్తుంది. వాల్యూ రీసెర్చ్ ఆన్‌లైన్‌లో మీరు మీ పోర్ట్‌ఫోలియోను మెయింటైన్ చేస్తున్నట్లయితే ఆ లెక్కలను ఈ వెబ్‌సైట్ నుం చి కూడా పొందవచ్చు. అయితే పన్ను సంబంధిత అంశాలకు అధీకృత క్యామ్స్ స్టేట్‌మెం ట్‌ను మాత్రమే రుజువుగా ఉపయోగించాలి.

 

 నా మైనర్ కూతురి పేరు మీద నేను గార్డియన్‌గా పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చా? నేను నా పీపీఎఫ్ అకౌంట్‌లో ఒక లక్ష, నా కూతురి పీపీఎఫ్ అకౌంట్‌లో మరో లక్ష చొప్పున ఇన్వెస్ట్ చేస్తే, సెక్షన్ 80 సీ కింద నాకు వచ్చే పన్ను ప్రయోజనాలు ఎలా ఉంటాయి.              - కుమార్, విజయవాడ
 మీరు మీ మైనర్ కూతురి కోసం మీరు గార్డియన్‌గా పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.  మీ పీపీఎఫ్ అకౌంట్‌లో రూ. 1 లక్ష, మీ కూతురి పీపీఎఫ్ అకౌంట్‌లో రూ. 1 లక్ష, లేదా ఈ రెండు అకౌంట్లలో అంతకు మించి గానీ  ఇన్వెస్ట్ చేసినప్పటికీ, ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ ప్రకారం, ఒక ఏడాదిలో ఒక వ్యక్తి పొందగలిగే పన్ను ప్రయోజనాలు రూ. 1 లక్ష మాత్రమే.
 రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్(ఆర్‌జీఈఎస్‌ఎస్) కింద ఏ ఈటీఎఫ్‌ను ఎంచుకోవాలి?
 - వంశీకృష్ణ, బెంగళూరు
 రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్‌కు అర్హమైన స్కీమ్‌లు చాలా ఉన్నాయి. ఈ స్కీమ్ కింద ఉత్తమమైన ఫండ్స్‌ల్లో నిఫ్టీ ఈటీఎఫ్ ఒకటి. దీనికి సంబంధించిన సమగ్రమైన జాబితా కోసం వాల్యూరీసెర్చ్ వెబ్‌సైట్‌ను చూడండి. ముందు ఇన్వెస్టర్లు ఈ స్కీమ్‌ను బాగా అర్థం చేసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లో తొలిసారిగా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకు ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్‌ను డిజైన్ చేశారు. వార్షికాదాయం రూ.12 లక్షల లోపు ఉన్న కొత్త ఇన్వెస్టర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. సెక్షన్ 80సీ కింద లభించే రూ. లక్ష పన్ను మినహాయింపులకు ఇది అదనం. ఒక వ్యక్తికి ఈ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేసే పరిమితిని రూ.50,000గా నిర్ణయించారు. ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 50 శాతానికి పన్ను రాయితీ పొందవచ్చు. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే ఒక ఏడాది పూర్తయిన తర్వాత కొన్ని షరతులకు లోబడి ట్రేడింగ్ చేయొచ్చు. మొత్తం మీద ఈ స్కీమ్ కొంచెం సంక్లిష్టమైనదే. ఎంచుకోవడానికి పరిమితమైన ఫండ్స్, షేర్లు అందుబాటులో ఉంటాయి. పన్ను ప్రయోజనాలూ ఓమోస్తరుగానే ఉంటాయి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
 
 6.
 
 ఈ ఏడాది 5% స్థాయిలో జీడీపీ: నోమురా
 
 ముంబై: ఈ ఆర్థిక సంవత్సర ం(2013-14)లో దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) అనూహ్య వృద్ధిని సాధించే అవకాశాల్లేవని జపనీస్ బ్రోకింగ్ దిగ్గజం నోమురా అంచనా వేసింది. ఇందుకు రిజర్వ్ బ్యాంక్ అనుసరిస్తున్న క ఠిన పరపతి విధానాలు, మందగమన పరిస్థితులు వంటివి కారణంగా నిలుస్తాయని నివేదికలో నోమురా పేర్కొంది. వెరసి ఈ ఏడాది జీడీపీ 4.5-5% స్థాయిలో నమోదు కావచ్చునని అభిప్రాయపడింది. అయితే 2014లో ఆర్థిక స్థిరీకరణకు అవకాశమున్నదని, పెట్టుబడుల వాతావరణం చక్కబడేందుకు ఆస్కారమున్నదని వివరించింది. అయితే ప్రస్తుతం అనూహ్య పురోభివృద్ధి సాధించేందుకు సరైన కారణాలు కనిపించడంలేదని వ్యాఖ్యానించింది.
 

ఈ ఏడాది తొలి రెండు క్వార్టర్లలో జీడీపీ 4.4%(ఏప్రిల్-జూన్), 4.8%(జూలై-సెప్టెంబర్) చొప్పున పుంజుకున్న సంగతి తెలిసిందే. కాగా, గడిచిన ఏడాది(2012-13) జీడీపీ 4.5%కు పరిమితమైంది. ప్రధానంగా అధిక వడ్డీ రేట్లు, డిమాండ్ పడిపోవడం వంటి దేశీయ అంశాలు ఇందుకు ప్రభావం చూపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement