ఒకే నెలలో రూ.24,509 కోట్లు రాక! | more funds ever in september into the mutual funds | Sakshi
Sakshi News home page

ఒకే నెలలో రూ.24,509 కోట్లు రాక!

Published Sat, Oct 12 2024 8:30 AM | Last Updated on Sat, Oct 12 2024 9:23 AM

more funds ever in september into the mutual funds

క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (ఎస్‌ఐపీ–సిప్‌)పై ఇన్వెస్టర్ల భరోసా పెరుగుతోంది. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (ఏఎంఎఫ్‌ఐ) సెప్టెంబర్‌ తాజా గణాంకాల ప్రకారం సిప్‌ల రూపంలో రికార్డు స్థాయిలో రూ.24,509 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్‌లోకి ఒకే నెలలో ఈ స్థాయి పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి.

క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక సంపద వైపు మళ్లుతున్న పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ఈ పరిణామం తెలియజేస్తోందని ఏఎంఎఫ్‌ఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వెంకట్‌ చలసాని అన్నారు. కాగా, ఆగస్టులో సిప్‌లోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.23,547 కోట్లు. క్రమంగా ఈక్విటీ మార్కెట్‌పై మదుపర్లకు నమ్మకం పెరుగుతోంది. దానికితోడు మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్ల వద్ద దాదాపు రూ.లక్ష ఇరవైవేల కోట్లు నిలువ ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి స్టాక్‌లు విక్రయిస్తున్నారు. అందులో నాణ్యమైన స్టాక్‌లపై ఫండ్‌ మేనేజర్లు ఆసక్తి చూపుతున్నారు.

ఇదీ చదవండి: తుక్కుగా మార్చాల్సిన వాణిజ్య వాహనాలు ఎన్నంటే..

ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.34,419 కోట్లు..

ఇక మొత్తంగా చూస్తే, ఈక్విటీ ఫండ్స్‌లోకి  ఇన్వెస్ట్‌మెంట్లు సెప్టెంబర్‌లో 10 శాతం (ఆగస్టుతో పోల్చి) పడిపోయి రూ.34,419 కోట్లుగా నమోదయ్యాయి. లార్జ్‌ క్యాప్, థీమెటిక్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. అయితే ఈక్విటీ ఫండ్స్‌లోకి నికర పెట్టుబడులు సుస్థిరంగా 43 నెలలుగా కొనసాగుతుండడం సానుకూల అంశం. మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసానికి ఇది అద్దం పడుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంన్నాయి. ఇక ఫండ్స్‌ నిర్వహణలో ఉన్న ఆస్తుల  విలువ ఆగస్టులో రూ.66.7 లక్షల కోట్లు ఉంటే, సెప్టెంబర్‌లో రూ.67 లక్షల కోట్లకు ఎగసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement