Mutual Fund Assets
-
ఈక్విటీ ఫండ్స్ సానుకూలమా..?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు నవంబర్ నెలలో రూ.35,943 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అక్టోబర్ నెల పెట్టుబడులతో పోల్చి చూస్తే 14 శాతం తగ్గాయి. అయినప్పటికీ వరుసగా 45వ నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లో సానుకూల పెట్టుబడులు నమోదయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) నవంబర్ నెల గణాంకాలను విడుదల చేసింది.స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఎన్నికలు తదితర పరిణామాలతో ఈక్విటీ మార్కెట్లు గత రెండు నెలల కాలంలో ఎన్నో అస్థిరతలు ఎదుర్కోవడం తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించి ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ సీబీవో అఖిల్ చతుర్వేది తెలిపారు. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి నవంబర్‌లో నికరంగా రూ.60,295 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో పెట్టుబడుల రాక రూ.2.4 లక్షల కోట్లతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గడం గమనార్హం. ప్రధానంగా డెట్ ఫండ్స్ అక్టోబర్‌లో రూ.1.57 లక్షల కోట్లను ఆకర్షించగా, నవంబర్‌లో ఇవి కేవలం రూ.12,915 కోట్లకు పరిమితమయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) అక్టోబర్ చివరికి ఉన్న రూ.67.25 లక్షల కోట్ల నుంచి నవంబర్ చివరికి రూ.68.08 లక్షల కోట్లకు పెరిగింది. లక్ష్యాలకు కట్టుబాటు..నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.25,000 కోట్లకు పైనే ఉండడం అన్నది దీర్ఘకాల లక్ష్యాలు, ప్రణాళిక పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న అంకిత భావానికి నిదర్శనమని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. సిప్ పెట్టుబడులను స్థిరంగా ఉండడం దీర్ఘకాలంలో ఫండ్స్ విలువను సమకూర్చుతాయన్న విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు. విభాగాల వారీగా..లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,548 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో వచ్చిన రూ.3,452 కోట్లతో పోల్చితే 26 శాతం తగ్గాయి. సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.7,658 కోట్లను రాబట్టాయి. అక్టోబర్‌లో ఇవే పథకాల్లోకి రూ.12,279 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.13,255 కోట్ల చొప్పున రావడం గమనార్హం. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.5,084 కోట్లు వచ్చాయి. ఇక స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల దూకుడు కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ నెలతో పోల్చితే నవంబర్‌లో స్మాల్ క్యాప్ ఫండ్స్ 9 శాతం అధికంగా రూ.4,112 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్ 4.3 శాతం అధికంగా రూ.4,883 కోట్ల చొప్పున ఆకర్షించాయి. రిస్క్ ఉన్నా కానీ ఇన్వెస్టర్లు అధిక రాబడులు కోరుకుంటున్నారనే దానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తాయి.లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.4,680 కోట్లు, వ్యాల్యూ ఫండ్స్ రూ.2,088 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ రూ.430 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ రూ.619 కోట్ల చొప్పున ఆకర్షించాయి. 18 కొత్త పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) నవంబర్ లో మార్కెట్లోకి వచ్చి రూ.4,052 కోట్లను సమీకరించాయి. అక్టోబర్‌లో 29ఎన్‌ఎఫ్‌వోలు రూ.6,078 కోట్లు సమీకరించడం గమనార్హం. డెట్ విభాగంలో 16 విభాగాలకు గాను 9 విభాగాల్లోకి పెట్టుబడులు రాగా, మిగిలినవి పెట్టుబడులు కోల్పోయాయి. ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి రూ.2,109 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.2,962 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ రూ.4,374 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.2,426 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌లోకి రూ.2,138 కోట్ల చొప్పున వచ్చాయి.డెట్‌లో లిక్విడ్ ఫండ్స్ రూ.1,779 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.454 కోట్లు, మీడియం డ్యురేషన్ ఫండ్స్ రూ.201 కోట్ల చొప్పున కోల్పోయాయి. ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలుసిప్ పెట్టుబడులు ఫ్లాట్సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో నవంబర్‌లో ఈక్విటీ పథకాల్లోకి రూ.25,320 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్ సిప్ పెట్టుబడులు రూ.25,323 కోట్లతో పోల్చి చూస్తే ఫ్లాట్‌గా నమోదయ్యాయి. కొత్తగా 49.46 లక్షల సిప్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అక్టోబర్‌లో ఇవి 63.70 లక్షలుగా ఉన్నాయి. మొత్తం సిప్ ఖాతాలు 10.12 కోట్ల నుంచి 10.23 కోట్లకు పెరిగాయి. -
ఒకే నెలలో రూ.24,509 కోట్లు రాక!
క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (ఎస్ఐపీ–సిప్)పై ఇన్వెస్టర్ల భరోసా పెరుగుతోంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) సెప్టెంబర్ తాజా గణాంకాల ప్రకారం సిప్ల రూపంలో రికార్డు స్థాయిలో రూ.24,509 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్‌లోకి ఒకే నెలలో ఈ స్థాయి పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి.క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక సంపద వైపు మళ్లుతున్న పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ఈ పరిణామం తెలియజేస్తోందని ఏఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని అన్నారు. కాగా, ఆగస్టులో సిప్‌లోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.23,547 కోట్లు. క్రమంగా ఈక్విటీ మార్కెట్‌పై మదుపర్లకు నమ్మకం పెరుగుతోంది. దానికితోడు మ్యూచువల్ ఫండ్ మేనేజర్ల వద్ద దాదాపు రూ.లక్ష ఇరవైవేల కోట్లు నిలువ ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి స్టాక్‌లు విక్రయిస్తున్నారు. అందులో నాణ్యమైన స్టాక్‌లపై ఫండ్ మేనేజర్లు ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: తుక్కుగా మార్చాల్సిన వాణిజ్య వాహనాలు ఎన్నంటే..ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.34,419 కోట్లు..ఇక మొత్తంగా చూస్తే, ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్మెంట్లు సెప్టెంబర్‌లో 10 శాతం (ఆగస్టుతో పోల్చి) పడిపోయి రూ.34,419 కోట్లుగా నమోదయ్యాయి. లార్జ్ క్యాప్, థీమెటిక్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. అయితే ఈక్విటీ ఫండ్స్‌లోకి నికర పెట్టుబడులు సుస్థిరంగా 43 నెలలుగా కొనసాగుతుండడం సానుకూల అంశం. మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసానికి ఇది అద్దం పడుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంన్నాయి. ఇక ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ఆగస్టులో రూ.66.7 లక్షల కోట్లు ఉంటే, సెప్టెంబర్‌లో రూ.67 లక్షల కోట్లకు ఎగసింది. -
కోటీశ్వరులు కావాలనుందా..?
దేశీయ స్టాక్‌మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. దాంతో చాలా మంది మదుపరుల సంపద ఎన్నోరెట్లు పెరుగుతోంది. ఈక్విటీ మార్కెట్లో నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేసేవారి కంటే కొంత సేఫ్‌గా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే చిన్న మొత్తాల పొదుపుతో కోటీశ్వరులుగా మారే అసలైన ఫార్ములాను ఈ కథనంలో తెలుసుకుందాం. భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువ మంది రిస్క్ లేకుండా సంపద రెట్టింపు కావాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది ఎస్ఐపీ(క్రమానుగత పెట్టుబడులు)లను ఎంచుకుంటారు. పైగా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేవారు దీని నుంచి మెరుగైన రాబడులను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు నిర్వహించటం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా మంచి వెల్త్ సృష్టించవచ్చు. మ్యూచువల్‌ఫండ్‌లో చాలా మంది పెట్టుబడులు పెడుతూంటారు. తోచినంత మదుపుచేస్తూ దీర్ఘకాల కోరికల కోసం కష్టపడుతుంటారు. అందులో ఒకొక్కరి ఆసక్తులు ఒక్కోలా ఉంటాయి. అయితే కోటి రూపాయల టార్గెట్ అందుకోవటానికి మాత్రం ఒక నియమాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే 15*15*15 స్ట్రాటజీ. దీనికి అర్థం..నెలకు రూ.15,000 చొప్పున.. 15 ఏళ్ల పాటు.. 15 శాతం రాబడి అందించే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులుగా మారవచ్చు. ఇందులో దాగిఉన్న కాంపౌండింగ్ ఫార్మాలాతో కార్పస్ జనరేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సామాన్యులను సైతం కోటీశ్వరులుగా మారేందుకు రోజుకు రూ.500 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడితే సరిపోతుందన్న మాట. ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఇన్వెస్టర్లు క్రమం తప్పకుండా 15 ఏళ్లపాటు కొనసాగించే పెట్టుబడిపై 15 శాతం చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపితే రూ.75 లక్షలు అవుతుంది. ఇదే సమయంలో ఇన్వెస్టర్ పెట్టుబడి రూపంలో మెుత్తంగా రూ.27 లక్షలు పెడతారు. దాంతో మొత్తం 15 ఏళ్ల తర్వాత రాబడి రూ.1.02 కోట్లకు చేరుకుంటుంది. -
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఆస్తులు జూమ్
ముంబై: దేశంలోనే మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) పరంగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త రికార్డు నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రూ. 90 వేల కోట్ల మేర ఆస్తులను పెంచుకుంది. దీంతో సంస్థ నిర్వహణలోని మొత్తం ఏయూఎం మార్చి నాటికి ఉన్న రూ.7.10 లక్షల కోట్ల నుంచి, జూన్ చివరికి రూ.8 లక్షల కోట్లకు చేరుకుంది. వచ్చే 12 నుంచి 18 నెలల్లో మొత్తం నిర్వహణ ఆస్తులు రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నట్టు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ ఎండీ, చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ డీపీ సింగ్ తెలిపారు. రూ.10 లక్షల కోట్ల మైలురాయిని చేరుకోవాలనే లక్ష్యాన్ని అంతర్గతంగా విధించుకున్నట్టు చెప్పారు. మార్కెట్లో ఏదైనా తీవ్ర పతనాన్ని చూస్తే తప్పితే, తాము దీన్ని చేరుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 43 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఏయూఎం జూన్ చివరికి రూ.43.2 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 8 శాతం మార్కెట్ వాటా: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణ ఆస్తులు రూ.43.2 లక్షల కోట్ల ప్రకారం చూస్తే, ఎస్బీఐ ఫండ్ ఏయూఎం వాటా 18%. ఇందులో రూ.5.5 లక్షల కోట్ల ఆస్తులు ఈక్విటీలకు సంబంధించినవిగా సింగ్ వెల్లడించారు. ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో తమ పథకాల్లోకి రూ.2,200 కోట్లు వస్తున్నట్టు తెలిపారు. ఎక్కువ పెట్టుబడులు టాప్–30 పట్టణాల నుంచి ఉన్నాయన్నారు. ఎస్బీఐ నిర్వహణలోని ఫోలియోల్లో (పెట్టుబడి ఖాతా) 35% చిన్న పట్టణాలవేనని తెలిపారు. -
ఒకే పథకం.. రెండు ప్రయోజనాలు
ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడం మంచి ఆలోచన అవుతుంది. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చే సరికి ప్రణాళిక మేరకు పెట్టుబడులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఆశించిన మేర పన్ను ఆదాకు మార్గం సుగమం చేసుకోవచ్చు. పెట్టుబడులకు పన్ను ఆదా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. మెరుగైన రాబడులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాతే పన్ను ఆదా ప్రయోజనం చూడాలి. అన్ని సాధనాల్లోకి ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయని తెలిసిందే. పన్ను ఆదా ప్రయోజనంతో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాలతో దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టించుకోవచ్చని చారిత్రక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో చక్కని, నమ్మకమైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు సొంతం చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఈ పథకంలో చేసే ప్రతి పెట్టుబడికి అక్కడి నుంచి మూడేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. మూడేళ్లు నిండిన తర్వాతే ఆ పెట్టుబడిని వెనక్కి తీసుకోవడానికి అనుమతిస్తారు. రాబడులు 5 స్టార్ రేటెడ్ పథకం ఇది. ఏడాది కాలంలో 11 శాతం రాబడులను ఇవ్వగా, మూడేళ్లలో ఏటా 27 శాతం ప్రతిఫలాన్ని పెట్టుబడులపై అందించింది. ఇక ఐదేళ్లలో ఏటా 15 శాతం రాబడిని ఇచ్చింది. ఏడేళ్లలో చూసుకున్నా వార్షిక రాబడి రేటు 17.44 శాతంగా ఉంది. ఈక్విటీల్లో దీర్ఘకాలంలో వార్షిక సగటు రాబడి 12 శాతానికి పైన ఉంటే దాన్ని మెరుగైనదిగా భావిస్తారు. ఈ పథకం రాబడులకు బీఎస్ఈ 500 టీఆర్ఐ సూచీని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సూచీతో పోలిస్తే మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఐదేళ్లు, ఏడేళ్ల కాలంలో రెండు నుంచి మూడు శాతం అధికంగా వార్షిక రాబడిని అందించింది. కనుక ఐదేళ్లకు మించిన కాలానికే ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఐదేళ్లలోపు లక్ష్యాలకు అచ్చమైన ఈక్విటీలు అనుకూలం కాదని నిపుణుల సూచన. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో ఈ పథకం ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. అంటే నగదు నిల్వలు తక్కువగా నిర్వహిస్తుండడాన్ని గమనించొచ్చు. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15,218 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిల్లో 99.16 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. ఇందులోనూ లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే 69 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఇక మిడ్‌క్యాప్ కంపెనీల్లో 25 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 5.57 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 66 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగానికి చెందిన కంపెనీల్లోనే 32 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఆ తర్వాత అత్యధికంగా ఇంధన రంగ కంపెనీల్లో 11.13 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీల్లో 9 శాతం, సేవల రంగ కంపెనీల్లో 8.15 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. ఈ నాలుగు రంగాల్లోనే 60 శాతం పెట్టుబడులు ఉండడం గమనించొచ్చు. -
PRE-BUDGET 2023: గోల్డ్ ఈటీఎఫ్‌లకు ప్రోత్సాహమివ్వండి
న్యూఢిల్లీ: ఫండ్స్ ద్వారా పసిడిలో పెట్టుబడులు పెట్టేలా రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు తగు చర్యలు ప్రకటించాలని కేంద్రాన్ని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కోరింది. ఇందుకోసం గోల్డ్ ఈటీఎఫ్‌లపై పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. 2023–24 బడ్జెట్‌కు సంబంధించి ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ ఈ మేరకు తమ ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. వీటి ప్రకారం గోల్డ్ ఈటీఎఫ్‌లు, అలాగే తమ నిధుల్లో 90 శాతానికి మించి పసిడి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసే ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్)పై ప్రస్తుతం 20 శాతంగా ఉన్న దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (ఎల్టీసీజీ)ను ఇండెక్సేషన్ ప్రయోజనంతో 10 శాతానికి తగ్గించాలని కోరింది. ప్రత్యామ్నాయంగా, ఎల్టీసీజీ ట్యాక్సేషన్ ప్రయోజనాలు పొందేందుకు గోల్డ్ ఈటీఎఫ్‌ల హోల్డింగ్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఒక్క ఏడాదికి అయినా తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ‘గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి పసిడి పథకాలకు పన్నుపరమైన ప్రయోజనాలు కల్పిస్తే, ఆర్థికంగా అంతగా సమర్ధమంతం కాని భౌతిక పసిడికి ప్రత్యామ్నాయ సాధనంగా వాటికి ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుంది. భౌతిక రూపంలోని బంగారంలో పెట్టుబడులు తగ్గించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరుతుంది‘ అని యాంఫీ పేర్కొంది. బ్రిటన్ తదితర దేశాల్లో ఇలాంటి విధానాలు అమల్లో ఉన్నట్లు వివరించింది. ఆయా దేశాల్లో పెట్టుబడియేతర బంగారంపై 20 శాతం వ్యాట్ (వేల్యూ యాడెడ్ ట్యాక్స్) విధిస్తుండగా బంగారంలో పెట్టుబడులపై మాత్రం ఉండటం లేదని తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా ఇతరత్రా పసిడి పెట్టుబడుల సాధనాల తరహాలోనే గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తోంది. మరిన్ని ప్రతిపాదనలు.. ► ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్‌వోఎఫ్‌లను కూ డా ఈక్విటీ ఆధారిత ఫండ్స్ పరిధిలోకి చేర్చాలి. ► లిస్టెడ్ డెట్ సాధనాలు, డెట్ మ్యుచువల్ ఫండ్స్‌పై పన్నులు సమాన స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► అలాగే ఇంట్రా–స్కీమ్ మార్పులను (ఒకే మ్యుచువల్ ఫండ్ స్కీమ్ అంతర్గతంగా వివిధ ప్లాన్లు/ఆప్షన్లలోకి పెట్టుబడులను మార్చుకోవడం) ’ట్రాన్స్ఫర్’ కింద పరిగణించరాదు. ఇలాంటి లావాదేవీలకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుండి మినహాయింపునివ్వాలి. ► ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్‌ల (ఈఎల్ఎస్ఎస్) తరహాలోనే చౌకైన, తక్కువ రిస్కులతో పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉండే డెట్ ఆధారిత పొదుపు పథకాలను (డీఎల్ఎస్ఎస్) ప్రవేశపెట్టేందుకు ఫండ్స్‌ను అనుమతించాలి. ► ట్యాక్స్ సేవింగ్ బ్యాంక్ ఎఫ్‌డీల తరహాలోనే అయిదేళ్ల లాకిన్ వ్యవధితో డీఎల్ఎస్ఎస్లో రూ. 1.5 లక్షల వరకూ పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు వర్తింపచేయాలి. ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో ఈఎల్ఎస్ఎస్ల్లో రూ. 1.5 లక్షల వరకూ పెట్టుబడులకు సెక్షన్ 80 సీసీసీ కింద పన్ను ప్రయోజనాలు ఉంటున్నాయి. ► ఫండ్ నిర్వహణ కార్యకలాపాలను రిజిస్టర్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు (ఏఎంసీ) బదలాయించేందుకు బీమా కంపెనీలన్నింటినీ అనుమతించాలి. అలాగే బీమా కంపెనీలకు ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసులు అందించడానికి ఏఎంసీలకు కూడా అనుమతినివ్వాలి. ► పింఛన్లకు సంబంధించి ఫండ్ ఆధారిత రిటైర్మెంట్ పథకాలను ప్రవేశపెట్టేందుకు మ్యుచువల్ ఫండ్స్‌కు అనుమతినివ్వాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)కు ఇచ్చే పన్ను ప్రయోజనాలను వీటికి కూడా వర్తింపచేయాలి. బడ్జెట్ సెషన్లో డేటా బిల్లు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడి డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత (డీపీడీపీ) బిల్లు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందగలదని భావిస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. బిల్లు ముసాయిదాలోని నిబంధనలపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ఉగ్రవాద, సైబర్ ముప్పులతో పాటు అంతర్జాతీయంగా యుద్ధ విధానాలు మారుతుండటాన్ని పరిగణనలోకి తీసుకునే నిబంధనల రూపకల్పన జరిగిందని మంత్రి చెప్పారు. బిల్లులో ప్రతిపాదించిన పర్యవేక్షణ సంస్థ డేటా ప్రొటెక్షన్ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తిపై వ్యక్తమవుతున్న అనుమానాలను ఆయన కొట్టిపారేశారు. రిజర్వ్ బ్యాంక్, సెబీ వంటి నియంత్రణ సంస్థల తరహాలోనే దీనికి కూడా సంపూర్ణ స్వతంత్రత ఉంటుందని పేర్కొన్నారు. -
మూలధన నష్టాలను, లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చా?
ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాలు వచ్చాయి. నాస్డాక్ 100 ఈటీఎఫ్ (పన్ను పరంగా డెట్ ఫండ్) పెట్టుబడులపై నష్టాలు వచ్చాయి. ఈ నష్టాన్ని లాభంలో సర్దుబాటు చేసి, మిగిలిన లాభంపైనే ఆదాయపన్ను చెల్లిస్తే సరిపోతుందా? – సంజయ్ కుమార్ లాభాల్లో నష్టాలను సర్దుబాటు చేసుకోవడాన్ని ‘సెట్టింగ్ ఆఫ్ లాసెస్’గా పేర్కొంటారు. ఒక సాధనంలో మూలధన నష్టాన్ని, మరో సాధనంలో మూలధన లాభంతో సర్దుబాటు చేసుకోవడాన్ని ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 70 అనుమతిస్తోంది. కాకపోతే ఇందుకు సంబంధించి కొన్ని షరతులను తెలుసుకోవాలి. స్వల్పకాల మూలధన నష్టాలను.. స్వల్ప కాల మూలధన లాభాలతోనూ, అలాగే దీర్ఘకాలిక మూలధన లాభాలతోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, దీర్ఘకాల మూలధన నష్టాల విషయంలో కొంత వ్యత్యాసం ఉంది. కేవలం దీర్ఘకాల మూలధన లాభాలతోనే వీటిని సర్దుబాటు చేసుకోవడానికి ఉంటుంది. పెట్టుబడుల కాల వ్యవధి ఆధారంగా లాభాలు స్వల్పకాలం లేదా దీర్ఘకాలం కిందకు వస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఏడాది వరకు (ఏడాది నిండకుండా) లాభాలు స్వల్పకాలంగా, ఏడాదికి మించితే దీర్ఘకాలంగా చట్టం పరిగణిస్తోంది. ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్ల వరకు లాభాలు స్వల్పకాలంగాను, మూడేళ్లు, అంతకు మించిన కాలానికి వచ్చేవి దీర్ఘకాల మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఉదాహరణకు మీరు ఈ ఏడాది రెండు రకాల దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించారని అనుకుందాం. ఒకటి ఈక్విటీ, రెండోది ఈక్వీటీయేతర ఫండ్. ఈక్విటీ ఫండ్‌లో రూ.లక్ష దీర్ఘకాల మూలధన నష్టం చ్చింది. నాన్ ఈక్విటీ ఫండ్‌లో రూ.4 లక్షల దీర్ఘకాల లాభం వచ్చింది. అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం రూ.4 లక్షల నుంచి దీర్ఘకాల మూలధన నష్టం రూ.లక్ష మినహాయించి, మిగిలిన రూ.3 లక్షలపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ రెండూ దీర్ఘకాలిక సాధనాలే. మూలధన నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం లేనప్పుడు వాటిని ఎనిమిది సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ (కొనసాగించుకోవడం) చేసుకోవచ్చు. అంటే ఈ ఏడాది వచ్చిన నష్టాన్ని.. భవిష్యత్ 8 సంవత్సరాల లాభాల్లో అయినా చూపించుకోవచ్చు. దీర్ఘకాల పెట్టుబడులకు స్మాల్ క్యాప్ఫండ్స్ మంచివేనా? – వర్షిల్ గుప్తా స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు కేవలం దీర్ఘకాలం ఒక్కటీ చాలదు. ఫండ్‌లో నష్టాలు వచ్చినా, పెట్టుబడుల విలువ క్షీణించినా తట్టుకుని పెట్టుబడులు కొనసాగించే సామర్థ్యం కూడా ఉండాలి. దీర్ఘకాలంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్‌ను సంపద సృష్టి మార్గంగా చూడొచ్చు. కానీ, స్మాల్‌క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం అంత సులభం కాదు. మార్కెట్ పతనాల్లో ఇవి అదే పనిగా క్షీణిస్తూ, నష్టాలను చూపిస్తుంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి రాబడులు ఇస్తున్నప్పుడు.. అదే సమయంలో రాబడులు చూపించని స్మాల్‌క్యాప్ మాదిరి సాధనాల్లో పెట్టుబడులు పెడితే ఆందోళన చెందడం సహజం. అందుకనే స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు, మొత్తం పెట్టుబడుల్లో 10-15 శాతం మించి కేటాయింపులు చేసుకోరాదు. ఓ చిన్న కంపెనీ, పెద్ద కంపెనీగా మారిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే సంపద సృష్టి జరుగుతుంది. అదే సమయంలో సంపదను తుడిచి పెట్టే కంపెనీలు కూడా ఉంటాయి. చిన్న కంపెనీలు ఆటుపోట్లకు ఎక్కువగా గురవుతుంటాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఉన్న అనుకూలతలను చూస్తే.. దీర్ఘకాలంలో ఇవి పెట్టుబడులపై రాబడులు కురిపిస్తాయి. లార్జ్‌క్యాప్ స్టాక్స్ పెరగని సందర్భాల్లోనూ ఇవి వృద్ధిని చూపించగలవు. చిన్న కంపెనీలను ఇనిస్టిట్యూషన్స్ పెద్దగా పట్టించుకోవు. కనుక తెలివైన ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధి చేసుకోవచ్చు. స్మాల్‌క్యాప్ విభాగం చాలా పెద్దది. ప్రతీ స్మాల్‌క్యాప్ పథకం కూడా భిన్నమైనది. భిన్నమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంటాయి. కనుక వీటి మధ్య సారూప్యత ఉండదు. సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ రిస్క్ తగ్గించుకోవచ్చు. అయితే, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో లిక్విడిటీ అన్నది పెద్ద సవాలు. ఒకేసారి అమ్మకాల ఒత్తిడి వస్తే విలువ గణనీయంగా తగ్గిపోతుంది. కొనేవారు కరువై లిక్విడిటీ సమస్య ఏర్పడవచ్చు. పైగా, స్మాల్‌క్యాప్ పథకాలు పెద్ద సైజుతో ఉంటే ప్రతికూలతే. అంటే ఒక స్మాల్‌క్యాప్ ఫండ్ నిర్వహణ ఆస్తులు రూ.2,000 కోట్లు, అంతకంటే తక్కువే ఉండడం అనుకూలం. మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే వీటిల్లో అస్థిరతలు ఎక్కువ. మార్కెట్లలో సెంటిమెంట్ మారిపోతే ఇవి ఎక్కువ నష్టపోతుంటాయి. ఏ సమయంలో స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేశారన్నది (ఏకమొత్తంలో) రాబడులను నిర్ణయిస్తుంది. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఫిబ్రవరిలో తగ్గిన ఫండ్ల ఆస్తులు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ల ఆస్తులు గత నెలలో రూ.21,000 కోట్ల మేర తగ్గాయి. డెట్ సెగ్మెంట్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవటం, ఫండ్లలో పెట్టుబడులు తగ్గడం వంటి కారణాల వల్ల ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ స్థాయిలో మ్యూచువల్ ఫండ్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎమ్) తగ్గాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) తెలియజేసింది. యాంఫీ తాజా గణాంకాల ప్రకారం.., ►భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 42 మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది జనవరిలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.22.41 లక్షల కోట్లకు పెరిగాయి. ►ఇక ఫిబ్రవరిలో ఫండ్ల నిర్వహణ ఆస్తులు రూ.21,000 కోట్లు తగ్గి రూ.22.2 లక్షల కోట్లకు చేరాయి. ►వివిధ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు గత నెలలో తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో రూ.1.06 లక్షల కోట్లుగా ఉన్న ఫండ్ల పెట్టుబడులు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.12,000 కోట్లకు పడిపోయాయి. ►ఇన్కమ్ ఫండ్స్ నుంచి రూ.9,800 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. ►గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి రూ.94 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. -
ఫండ్స్ నుంచి వైదొలగాలా..?
♦ ఈ పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్ తప్పనిసరి ♦ ఆర్థిక, మార్కెట్ పరిస్థితులు మారితే... ♦ ఫండ్ మేనేజర్ పనితీరూ బాగోపోతే... ♦ ఫండ్‌లో మార్పులు జరిగి నష్టపోతే ♦ రాబడులు లేకపోతే... మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ రూ.20 లక్షల కోట్లకు చేరుతోంది. ప్రజల నుంచి భారీగా వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అనుకూలంగా ఉండడంతో ఇన్వెస్టర్లు ఎక్కువ మంది వీటివైపు అడుగులు వేస్తున్నారు. అయితే, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేసి కూర్చుంటే కరెక్టు కాదు. పథకం ఎలా పనిచేస్తోంది? మెరుగైన రాబడులను ఇస్తోందా? అన్నది గమనిస్తూ ఉండాలి. మంచి పథకంలో పెట్టుబడి పెట్టడమే కాదు, పనితీరు బాగాలేని పథకం నుంచి తప్పుకోవడం కూడా సక్సెస్ సూత్రాల్లో ఒకటన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓ పథకం నుంచి ఎప్పుడు వైదొలగాలి అన్నది చెప్పేదే ఈ కథనం. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు దాదాపుగా దీర్ఘకాలిక లక్ష్యాలను ఉద్దేశించినవే ఎక్కువ శాతం ఉంటాయి. దీర్ఘకాలం కోసం అయినప్పటికీ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని విక్రయించాల్సి రావచ్చు. లేదా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి రావచ్చు. అలాంటివి ఎప్పుడు చేయాలంటే... ఫండ్ పనితీరు బాగాలేకుంటే... ఉత్తమ పథకాలు సైతం కొన్ని సమయాల్లో కొన్ని త్రైమాసికాల పాటు చెత్త పనితీరును చూపించొచ్చు. అందుకని మ్యూచువల్ ఫండ్స్ పథకాల పనితీరు విషయంలో మూడు, ఐదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఫండ్స్ పేలవ పనితీరుకు కొన్ని వాస్తవిక కారణాలూ ఉండి ఉండొచ్చు. ఉదాహరణకు ఫండ్ పెట్టుబడి పెట్టిన రంగాల్లో ప్రతికూల పరిణామాలు ఎదురు కావచ్చు. డెట్ ఫండ్ తక్కువ నాణ్యత కలిగిన డెట్ ఇన్స్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెట్టొచ్చు. కొన్ని సందర్భాల్లో ఫండ్స్ రాబడులు తీవ్ర ఆటుపోట్లకు లోనుకావచ్చు. వీటిలో కారణం ఏదైనా కానీయండి... తగిన రాబడులు ఇవ్వని పథకాల నుంచి వైదొలగి ఉత్తమ పథకాల్లోకి పెట్టుబడులు మళ్లించడం తప్పేమీ కాదు. ఫండ్ మేనేజర్ నిర్ణయాలు ఫండ్ లక్ష్యాలను ఉన్నట్టుండి ఫండ్ మేనేజర్ మారుస్తూ నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకు లార్జ్‌క్యాప్ ఫండ్‌ను మిడ్ క్యాప్ ఫండ్‌గా మార్చి కొనసాగించొచ్చు. దాన్లోకి ఇతర రంగాలను జత చేర్చుకోవచ్చు. ఈ నిర్ణయాలు రాబడులను పెంచుతున్నాయా లేక రాబడులను తగ్గిస్తున్నాయా అన్నదాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. లిక్విడిటీ (నగదు నిల్వలు) నిర్వహణ విషయంలోనూ ఇటీవలి నిర్ణయాల ప్రభావం ఉండొచ్చు. నగదు నిల్వలను తగ్గించి నిధులన్నింటినీ పెట్టుబడులుగా మార్చొచ్చు. ఈ విధమైన చర్యలు అసౌకర్యంగా అనిపించాయంటే, మీ ప్రయోజనాలకు మేలు చేకూర్చేవి కావనుకుంటే వైదొలగవచ్చు. ఫండ్ తీరులో మార్పులు ఇన్వెస్టర్లుగా మీ చేతుల్లో లేని అంశాలూ కొన్ని ఉంటాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడానికి మొగ్గు చూపొచ్చు. అయినప్పటికీ మీ ఫండ్ మేనేజర్ మాత్రం ఇంకా దీర్ఘకాలిక మెచ్యూరిటీ బాండ్లను యాడ్ చేస్తూ ఉండొచ్చు. కేపిటల్ గూడ్స్ రంగం డౌన్ ట్రెండ్‌లో ఉంటే ఫండ్ మేనేజర్ మాత్రం అదే రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉండొచ్చు. అమెరికాలో ఇటీవల తీసుకున్న నిర్ణయాలతో ఐటీ, ఫార్మా షేర్లు ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం మాత్రం ఈ రంగానికి చెందిన షేర్లలో ఎక్కువగా పెట్టుబడి పెట్టి ఉండొచ్చు. ఇలా ప్రతికూల రాబడులకు దారితీసే విధంగా ఫండ్ పనితీరు ఉంటే మీ నిర్ణయాన్ని సమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఆశించిన మేర లేకుంటే... రుణంపై ఇల్లు కొందామనుకున్నారు. మార్జిన్ మనీ కొంత కావాలి. అందుకోసం నిర్ణీత కాల వ్యవధి నిర్ణయించుకుని ఫండ్స్‌లో పెట్టడం ప్రారంభించారు. ఏడాదికి 12 శాతం రాబడులను అంచనా వేశారు. నాలుగేళ్ల తర్వాత ఫండ్ రాబడులు 10 శాతం దాటలేదనుకోండి. అప్పుడు ఆ పథకంలో పెట్టుబడులతో మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే అవుతుంది. అందుకే ఆశించిన మేర రాబడులు ఇవ్వకుంటే తగిన సమీక్ష తప్పదు. పోర్ట్‌ఫోలియో మార్చుకునే తరుణం.. 50 ఏళ్లు దాటిన తర్వాత సహజంగా ఈక్విటీల్లో పెట్టుబడులు తగ్గించుకోవాలని చెబుతుంటారు. అలాగే, మార్కెట్ పరిస్థితుల్లో మార్పుల కారణంగా లార్జ్ క్యాప్ షేర్లకు అనుకూల వాతావరణం నెలకొనవచ్చు. బుల్ ర్యాలీ కారణంగా స్వల్ప కాలంలోనే ఫండ్ ఎన్ఏవీలు బాగా పెరిగి ఉండొచ్చు. ఈక్విటీల్లో మీ పెట్టుబడులు పరిమితి దాటిపోవచ్చు. ఆయా పరిస్థితులకు అనుగుణంగా రాబడులను పెంచుకునేందుకు, రిస్క్‌ను పరిమితం చేసుకునేందుకు వీలుగా పథకాల్లోమార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది. మీ లక్ష్యాలకు అనుగుణంగా కొన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తగ్గించుకోవడం, కొత్త ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం వంటి చర్యలు బెటర్. ఊహించని మార్పులొస్తే... మీరు పెట్టుబడి పెట్టిన పథకాన్ని నిర్వహించే ఏఎంసీని మరో ఏఎంసీ కొనుగోలు చేయవచ్చు. మీరు ఎంచుకున్న పథకం పెట్టుబడుల తీరును కొత్త ఏఎంసీ మార్చేయవచ్చు. ఈ విధమైన మార్పులు మీకు అనుకూలం అనిపించకపోతే..? ఉదాహరణకు మీరు ఎంచుకున్న బ్యాలన్స్డ్ ఫండ్ అప్పటి వరకూ ఈక్విటీల్లో అధిక భాగం, డెట్‌లో తక్కువ భాగం పెట్టుబడులు పెడుతూ ఉందనుకోండి. ఉన్నట్టుండి డెట్‌లో అధిక భాగం, ఈక్విటీల్లో తక్కువకు విధానాన్ని మార్చితే... ఈ విధమైన మార్పులు మీ లక్ష్యాలను చేరుకునేందుకు అనుకూలంగా లేవనిపిస్తే వైదొలగాల్సి వస్తుంది. ఫండ్ పనితీరుపై మీడియాలో వచ్చే వార్తలకూ ప్రాధాన్యం ఉంటుంది. మీరు పెట్టుబడులు పెట్టిన ఫండ్ పథకం పనితీరు గురించి మీడియాలో అదే పనిగా ప్రతికూల వార్తలు వస్తుంటే తోసిపుచ్చడం సరికాదు. అలాగే, ఫండ్ మేనేజర్ చర్యలపై సెబీ అభ్యంతరాలు, దర్యాప్తుల వంటివి చోటు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఓ ఫండ్ పథకం పనితీరును తీవ్రంగా ప్రభావితం చేసేవే. అయితే, వీటిని నిర్ధారించుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ ఓ ఇన్వెస్టర్‌గా వాస్తవ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఫండ్ పనితీరులో తేడా అనిపిస్తే బయటకు రావాలి. ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడం ఎంత ముఖ్యమో అవసరమైనప్పుడు వాటిని వెనక్కి తీసుకోవడం, వైదొలిగి వేరొక పథకంలో పెట్టుబ డులు పెట్టడం ఇవన్నీ ఓ ఇన్వెస్టర్‌గా నిర్వర్తించాల్సిన బాధ్యతలు. అంత పరిజ్ఞానం లేకపోతే ఆర్థిక సలహాదారుల సూచనలు తీసుకోవాలి.