న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ల ఆస్తులు గత నెలలో రూ.21,000 కోట్ల మేర తగ్గాయి. డెట్ సెగ్మెంట్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవటం, ఫండ్లలో పెట్టుబడులు తగ్గడం వంటి కారణాల వల్ల ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ స్థాయిలో మ్యూచువల్ ఫండ్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎమ్) తగ్గాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) తెలియజేసింది. యాంఫీ తాజా గణాంకాల ప్రకారం..,
►భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 42 మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది జనవరిలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.22.41 లక్షల కోట్లకు పెరిగాయి.
►ఇక ఫిబ్రవరిలో ఫండ్ల నిర్వహణ ఆస్తులు రూ.21,000 కోట్లు తగ్గి రూ.22.2 లక్షల కోట్లకు చేరాయి.
►వివిధ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు గత నెలలో తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో రూ.1.06 లక్షల కోట్లుగా ఉన్న ఫండ్ల పెట్టుబడులు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.12,000 కోట్లకు పడిపోయాయి.
►ఇన్‌కమ్ ఫండ్స్ నుంచి రూ.9,800 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది.
►గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి రూ.94 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు.
ఫిబ్రవరిలో తగ్గిన ఫండ్ల ఆస్తులు
Published Fri, Mar 9 2018 5:44 AM | Last Updated on Fri, Mar 9 2018 5:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment