ఏటీఎంలో వంద డ్రా చేస్తే.. రూ.500 వస్తోంది! | 500 note withdraw instead of 100 rupees at shamshabad airport | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 25 2016 3:07 PM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఓ ఏటీఎం నుంచి డబ్బుల వర్షం కురిపించింది. ఏటీఎం నుంచి రూ.100 విత్ డ్రా చేసేందుకు చూడగా ఆశ్చర్యకరంగా రూ.500 నోటు వచ్చింది. ఈ విషయం తెలియడంతో మరికొందరు ఏటీఎం వద్దకు చేరుకుని ఆ విధంగా డ్రా చేసుకుని తమదారిన తాము వెళ్లిపోయారు. దాదాపు రూ.8 లక్షల మేర నగదు డ్రా అయినట్లు సమాచారం. ఆ వివరాలిలా ఉన్నాయి. ఎయిర్‌పోర్టులోకి వెళ్లే వద్ద ఉన్న రెండో గేటు సమీపంలోని కోటక్ మహీంద్రా బ్యాంకుకు చెందిన ఏటీఎంలో ఓ వ్యక్తి శనివారం సాయంత్రం రూ.2500 డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అతనికి రూ.2000 నోటు ఒకటి వచ్చింది. దాంతోపాటు ఇంకా రావాల్సిన ఐదు వందలకు రూ.100 నోట్లు 5 రావాల్సి ఉండగా రూ.500 నోట్లు ఐదు వచ్చాయి. అంటే మొత్తం రూ.4,500లు వచ్చాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement