చెక్ బుక్స్ డిమాండ్ ఐదు రెట్లు పెరిగింది
కొటక్ మహీంద్రా బ్యాంక్
ముంబై: దేశీ ఐదో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ‘కొటక్ మహీంద్రా’ తాజాగా పెద్ద నోట్ల రద్దు కారణంగా చెక్ బుక్స్ డిమాండ్ ఐదు రెట్లు పెరిగిందని పేర్కొంది. అలాగే కార్డులు, మొబైల్ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో కూడా గణనీయమైన వృద్ధి నమోదవుతోందని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్–చైర్మన్ ఉదయ్ కొటక్ తెలిపారు. ఈ అంశాల ప్రాతిపదికన చూస్తే దేశం లెస్–క్యాష్ ఎకానమీ దిశగా వేగంగా అడుగులేస్తోందని చెప్పారు.
‘టెక్నాలజీతోనే బ్యాంకింగ్ రంగం ఈ ప్రపంచంతో అనుసంధానమవ్వగలదు. కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలి. వాటిని అవలంభిస్తూ ముందుకెళ్లాలి’ అని పేర్కొన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ ప్రొడక్టŠస్ సేవల కోసం ప్రజలకు సాయమందించేందుకు బ్యాంక్ ప్రతి బ్రాంచ్‌లోనూ ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించామని ఉదయ్ తెలిపారు.