check books
-
ఈ బ్యాంకు కస్లమర్లకు అలర్ట్..!
ముంబై: బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా మారుస్తున్నట్లు 2019 లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకుతో విలీనమైంది. బ్యాంకుల వీలినంతో సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు ఐఎఫ్ఎస్సీ కోడ్లు, చెక్‌బుక్‌లు జూన్ 30 వరకే చెల్లుబాటు కానుంది. జూలై 1 నుంచి సిండికేట్ బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారనున్నాయి. ఈ మార్పును గమనించాలని, వెంటనే చెక్‌బుక్‌లను ఆప్డేట్ చేసుకోవాలని కెనరా బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. సిండికేట్ బ్యాంకు ఖాతాదారులు జరిపే నెఫ్ట్, ఆర్జిజీఎస్, ఐఎంపీఎస్ లావాదేవీలు జరిపేటప్పుడు కచ్చితంగా కెనరా బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను వినియోగించాలని తెలిపింది. పాత ఎమ్ఐసీఆర్, ఐఎఫ్ఎస్సీ లతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ-సిండికేట్ బ్యాంక్ చెక్ బుక్ కూడా జూన్ 30, 2021 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. థర్డ్ పార్టీకి జారి చేసిన ఈ-సిండికేట్ చెక్‌బుక్ లేదా చెక్‌లు జూన్30,2021వ తేది తరువాత చెల్లవు. వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని కెనరా బ్యాంకు ఖాతాదారులకు తెలిపింది. చదవండి: క్రిప్టోకరెన్సీ పై భారీగా ఇన్వెస్ట్ చేస్తోన్న భారతీయులు..! -
సమాచారం.. బూడిదవుతోంది..
కీసర: ఇళ్లలోకి చేరాల్సిన ఉత్తరాలు, బ్యాంకు చెక్ బుక్కులు, ఆధార్ కార్డులు, నోటీసులు.. ఇలా ఒక్కటేమిటి అన్నీ చెత్త బుట్టలోకి చేరుతున్నాయి. ఆ తర్వాత ఓ ప్రదేశంలో కాలి బూడిదవుతున్నాయి. గుట్టలు గుట్టలుగా సంచుల్లో వాటిని తగలబెడుతుండగా పోలీసులు సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని అహ్మద్‌గూడలో ఉన్న ప్లాట్లకు సంబంధించి రాంపల్లిదాయరకు చెందిన రామిడి రాజిరెడ్డి, చింతల్‌కు చెందిన భిక్షపతి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ వివాదాస్పద స్థలంలో శుక్రవారం భిక్షపతి పది సంచుల్లో తెచ్చిన ఉత్తరాలు కాల్చివేయడాన్ని గమనించిన రాజిరెడ్డి పోలీసులకు సమాచారం అందించాడు. కీసర ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్ సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే కొన్ని సంచులను కాల్చివేయగా మిగిలిన వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కూకట్పల్లి, బాలానగర్, చింతల్, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన ఉత్తరాలు, చెక్‌బుక్కులు, ఆధార్ కార్డులు, వివిధ బ్యాంకుల నోటీసు పత్రాలతో పాటు ఇతర పత్రాలు ఉండటంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోస్టల్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో సంబంధిత అధికారులు శనివారం కీసర పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని వాటిని స్వాధీనం చేసుకొని తీసుకెళ్లారు. విచారణ చేపడతాం.. చిరునామా ప్రకారం సంబంధిత వ్యక్తులకు చేరాల్సిన ఉత్తరాలు, ఆధార్ కార్డులు, ఇతర కవర్లు ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడటం ఇదే మొదటిసారని సికింద్రాబాద్ తూర్పు డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ (ఏఎస్పీ) పవన్‌కుమార్ తెలిపారు. వాటిని తెచ్చి కాల్చివేయాల్సిన అవసరం భిక్షపతికి ఏంటి? అతడికి ఆ ఉత్తరాలు ఎవరు ఇచ్చారనే విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. -
చెక్కుల పంపిణీ పారదర్శకంగా జరగాలి
మహబూబాబాద్ : జిల్లాలో మే 10 నుంచి పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీని పారదర్శకంగా చేపట్టాలని, ఇందుకోసం రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వచ్చే నెల 10 నుంచి 17 వరకు రైతు బంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు 1,20,000 మందికి అందజేసేందుకు ఏర్పాటు చేయాలని చెప్పారు. భూ రికార్డుల శుద్ధీకరణ చేసి తదుపరి జిల్లా వ్యాప్తంగా భూమి ఖాతా గల రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద రూ.119 కోట్లు అందించనున్నట్లు తెలిపారు. రైతుకు 12 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే రెండు చెక్కులు అందజేయనున్నట్లు తెలిపారు. 95 బృందాలను ఏర్పాటు చేసి బృందానికి నలుగురు చొప్పున అధికారులకు విధులు కేటాయించి ఇద్దరు పాసుపుస్తకాలు, ఇద్దరు చెక్కుల పంపిణీ చేయాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నవారికి మాత్రమే చెక్కు అందించాలని సూచించారు. ప్రతి బృందానికి ఒక కానిస్టేబుల్ అందుబాటులో ఉంటారని తెలిపారు. మండల స్థాయిలో పంపిణీ కేంద్రాలను ఎంపీడీఓ, తహసీల్దార్, ఎస్సైలు సంయుక్తంగా పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న ఆరు వేల మంది కూడా వ్యవసాయ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. ఆ పథకానికి సంబంధించిన సందేహాల నివృత్తికి 18004250318 టోల్ ఫ్రీ నంబర్‌కు లబ్ధిదారులు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 28 బ్రాంచ్‌లు ఉన్నా యని ఏ మండల బ్యాంకు చెక్కు ఆ బ్యాంకులోనే నగదుగా తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు పట్టాదారు పాసుపుస్తకం మొదటి పేజీ, ఆధార్ జిరాక్స్, చెక్కుతో పాటు బ్యాం కులో సమర్పించి నగదు పొందవచ్చని చెప్పారు. ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకుకు పోలీసు శాఖ సహకరిస్తుందన్నారు. మండలానికి ఒక ఎస్సై 95 బృందాలకు 95 మంది కానిస్టేబుళ్లను నియమిస్తున్నట్లు చెప్పారు. జేసీ కె.దామోదర్‌రెడ్డి, డీఆర్వో డాక్టర్ పి.రాంబాబు, ఆర్డీఓ కృష్ణవేణి, ఎల్డీఎం రాఘవేంద్ర, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి జిల్లాలో ఇసుక దుర్వినియోగం కాకుండా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సమావేశ మందిరంలో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 ఇసుక రవాణా పాయింట్లు ఉన్నాయని, ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లు, మరుగుదొడ్లు, సీసీ రోడ్లు తదితర నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుక మంజూరుకు సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, తహసీల్దార్ అనుమతులు ఇవ్వాలని సూచించారు. ఎస్పీ కోటిరెడ్డి, జేసీ కె.దామోదర్‌రెడ్డి, డీఆర్వో రాంబాబు, ఆర్డీఓ కృష్ణవేణి, మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ రామాచారి, డీఎస్పీలు రాజారత్నం, నరేష్కుమార్, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
చెక్ బుక్స్ డిమాండ్ ఐదు రెట్లు పెరిగింది
కొటక్ మహీంద్రా బ్యాంక్ ముంబై: దేశీ ఐదో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ‘కొటక్ మహీంద్రా’ తాజాగా పెద్ద నోట్ల రద్దు కారణంగా చెక్ బుక్స్ డిమాండ్ ఐదు రెట్లు పెరిగిందని పేర్కొంది. అలాగే కార్డులు, మొబైల్ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో కూడా గణనీయమైన వృద్ధి నమోదవుతోందని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్–చైర్మన్ ఉదయ్ కొటక్ తెలిపారు. ఈ అంశాల ప్రాతిపదికన చూస్తే దేశం లెస్–క్యాష్ ఎకానమీ దిశగా వేగంగా అడుగులేస్తోందని చెప్పారు. ‘టెక్నాలజీతోనే బ్యాంకింగ్ రంగం ఈ ప్రపంచంతో అనుసంధానమవ్వగలదు. కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలి. వాటిని అవలంభిస్తూ ముందుకెళ్లాలి’ అని పేర్కొన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ ప్రొడక్టŠస్ సేవల కోసం ప్రజలకు సాయమందించేందుకు బ్యాంక్ ప్రతి బ్రాంచ్‌లోనూ ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించామని ఉదయ్ తెలిపారు.