
కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు 8శాతం లాభపడింది. బ్యాంక్ ప్రధాన ప్రమోటర్ ఉదయ్ కోటక్ నేడు బ్లాక్‌డీల్ పద్దతిలో సెకండరీ మార్కెట్ ద్వారా 2.8శాతం వాటా(56లక్షల మిలియన్ షేర్లు)ను విక్రయించనున్నారు. ఆర్‌బీఐతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆగస్ట్ కల్లా కోటక్ బ్యాంక్ ప్రమోటర్ల వాటాను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ వాటా విక్రయానికి ధరల శ్రేణి రూ. 1,215-1,240గా నిర్ణయించడమైంది. అలాగే ఈ డీల్ మొత్తం విలువ రూ.6,804-6,944 కోట్లుగా ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వాటా విక్రయంతో ఉదయ్ కోటక్ ప్రమోటింగ్ వాటా 28.94 శాతం నుంచి 26.1 శాతానికి దిగివస్తుంది. ఆర్‌బీఐతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆగస్ట్ కల్లా కోటక్ బ్యాంక్ ప్రమోటర్ల వాటాను తగ్గించుకోవాల్సి ఉంటుంది.
వాటా విక్రయ వార్తలతో కోటక్ బ్యాంక్ షేరు బీఎస్‌ఈలో 5శాతం లాభంతో 5.66శాతం లాభంతో రూ.1320 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒకదశలో 8శాతం లాభంతో రూ.1348 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.10:30 సమయంలో 5.50శాతం లాభంతో రూ.1318.00 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1000.35, రూ.1739.95గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment