సముద్రాన్ని తుఫాను తాకినపుడు, భూమి సురక్షితమైన ప్రదేశంగా కనిపిస్తుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్‌ను కోవిడ్-19 తాకినపుడు ఎఫ్‌ఐఐలు, మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్ సంస్థలకు ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు సురక్షితమైనవి భావించాయి. ముఖ్యంగా పీఎస్‌యూ కంపెనీలు భారీ స్థాయిలో చెల్లించే డివెడెండ్ చెల్లింపులు వారిని ఆకర్షించాయి. ఎఫ్‌ఐఐలు, మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్‌ల ఫోర్ట్‌ఫోలియోలో ... ఎన్‌టీపీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఐఓసీ, బీఈఎల్, హెచ్‌సీఎల్, గెయిల్ ఇండియా, పీఎఫ్‌సీలు కంపెనీల షేర్లు ఉన్నాయి. ఎంపిక చేసుకున్న ఈ టాప్- 10 పీఎస్‌యూ కంపెనీలు ఫండమెంటల్స్ ఆకర్షణీయంగా ఉండటంతో పాటు జనవరి నుంచి కరెక‌్షన్‌కు లోనయ్యాయి. ఈ కంపెనీల్లో ప్రధాన వాటాను ప్రభుత్వం కలిగి ఉండటంతో ఎఫ్‌ఐఐలు, మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్ ఈ కంపెనీల్లో భారీ ఎత్తున వాటాను కొనుగోలు చేశాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ అభిప్రాయపడ్డారు.
‘‘ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో కొంతశాతం పీఎస్‌యూ స్టాక్స్‌కు కేటాయించడం ఉత్తమం. ఒకవేళ మనం నిఫ్టీ పీఎస్‌ఈ ఇండెక్స్‌ను పరిశీలిస్తే.., మొత్తం ఇండెక్స్ వెయిటేజీలో 40శాతం ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలున్నాయి. తర్వాత 31శాతం వెయిటేజీ పవర్ కంపెనీలకు, 15శాతం మెటల్ కంపెనీలు కలిగి ఉన్నాయి. ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఈ రంగాలు కీలకం.’’ అని గౌరవ్ తెలిపారు.
ఎఫ్‌ఐపీ మార్చి త్రైమాసిక ఫోర్ట్‌ఫోలియో పరిశీలిస్తే పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, గెయిల్, ఐఓసీ, కంటైనర్ కార్ప్, హెచ్‌పీసీఎల్, ఆర్‌ఈసీలు టాప్ షేర్లుగా ఉన్నాయి.
ఇన్సూరెన్స్ కంపెనీల మార్చి త్రైమాసిక ఫోర్ట్‌ఫోలియో చూస్తే కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఐఓసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, ఎన్‌ఎండీసీ, గెయిల్ ఇండియా, న్యూ అస్యూరెన్స్, జీఐసీలు టాప్ షేర్లుగా ఉన్నాయి.
‘‘ఎఫ్‌పీఐ, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్లు ఎంచుకున్న ఈ కంపెనీలు ఫండమెంటల్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం డిమాండ్ మందగమనంతో ఈ కంపెనీలు కూడా తమ వ్యాపారాలలో గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇటీవల, ప్రభుత్వం ప్రైవేటు రంగ భాగస్వామ్యం, ప్రైవేటీకరణ ద్వారా ఈ సంస్థలలో అధిక సామర్థ్యానికి సహాయపడే ప్రభుత్వ రంగ విధానాన్ని రూపొందించింది. దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలకు ఇది సానుకూలంగా ఉన్నప్పటికీ, సమీపకాలంలో ఆర్థిక మందగమనం కారణంగా ప్రభావానికి లోనుకాగలవు.’’ అని రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment