తొలిదశ ఉద్యమమే కీలకం
Published Fri, Aug 5 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
నల్లగొండ కల్చరల్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో 1969లో నిర్వహించిన ఉద్యమమే కీలకమైందని 69 తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చక్రహరి రామరాజు, మారం సంతోష్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పెన్షనర్స్ భవన్‌లో నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 2004 నుంచి మొదలైన తెలంగాణ మలి విడత ఉద్యమానికి 69 ఉద్యమమే స్ఫూర్తిదాయకమన్నారు. అప్పటి ఉద్యమకారులను తెలంగాణ ప్రభుత్వం సముచితంగా గౌరవించడం లేదని, వారందరిని గుర్తించి వెంటనే వారికి గుర్తింపు కార్డులను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షుడు పోతుల మల్లయ్య అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి నీలకంఠం చలమంద, ఏళ్ల చంద్రారెడ్డి, కంది సూర్యనారాయణ, లక్ష్మారెడ్డి, మనోహర్‌రావు, టి.సుజాత, ఎ.జయమ్మ, సీతారాంరెడ్డి, వెంకటయ్య, కాశయ్య, హమీద్‌ఖాన్, సురేష్, లక్ష్మయ్య, ముస్తఫా, రాములు, సత్యనారాయణ, సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి పాల్గొన్నారు.
Advertisement
Advertisement