గృహిణిగా ప్రతి ఇల్లాలు తన ఇంట్లో చేసే ప్రతి పని కుటుంబ బడ్జెట్‌నే గాక దేశ బడ్జెట్‌ని కూడా మార్చగలదు. వంటింట్లో మండే గ్యాస్ నుంచి తినే ఆహార పదార్థాలు, తాగిపడేసి బాటిల్ దాక ఆమె చేసే ప్రతి పని ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కడైనా ఆమె అజాగ్రత్తగా వృధా చేసిందా అది కుటుంబ బడ్జెట్‌నే కాదు దేశ ఆర్థికవ్యవస్థపైనే భారం పెంచేస్తుంది. ఓ మహిళగా మనం ఆచరిస్తేనే..మన కుటుంబం దాన్ని ఫాలో అవుతుంది. అదికాస్త దేశ బడ్జెట్‌నే మారుస్తుంది. అదెలాగో చూద్దామా..!
ఫుడ్: ఇంట్లో వండిన అన్నం పిల్లలు తినకపోవడం వల్లనో వృధా అయిపోతుందా. ప్రతిరోజూ వండిన అన్నం కూరలు డస్ట్‌బిన్ పాలు చేస్తున్నారా!. ఇలా దేశంలోని లక్షలాది మంది చేస్తే వృధా అవుతున్న ఆహార పదార్థాల విలువ ఏకంగా ఏటా రూ. 92 వేల కోట్లుకి చేరుతుంది. ఇది మన జీడీపీలో ఒక శాతం కన్నా ఎక్కువ. అంతేగాదు గణాంకాల ప్రకారం..దేశంలోని ప్రతి ఒక్కరూ ఏటా కిలోల కొద్ది ఆహార పదార్థాలను మట్టిపాలు చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. నిజానికి దీన్ని పండించడానికి రైతు ఎంత శ్రమ పడతాడో తెలుసా..!. అది మన మన దాకా చేర్చడానికి ఎంతమంది, ఎన్ని గంటలు వెచ్చించాల్సి వస్తుందో తెలుసుకుంటే కచ్చితం వృధా చేసే సాహసం చేయరు. ఈ రోజు నుంచే ఈ వృధాని నివారిద్దాం.
వాటర్: నీళ్లే కదా అని తీసి పారేయొద్దు. ప్రభుత్వం ఈ నీటి కోసం ఏటా రూ.69 వేల కోట్లు పైనే ఖర్చు చేస్తోంది. మనం నిర్లక్ష్యంగా కట్టికట్టనట్లుగా ట్యాప్‌ని వదిలేస్తున్నాం. ఇది వ్యర్థ జలంగా మారపోతుంది. ఇలా మన దేశంలో వృధాగా వెళ్తున్న నీరు ఏడున్నర కోట్ల లీటర్లని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి ఇంటి నుంచి 60 శాతం పైగా నీరు మరుగునీరుగా మారిపోతున్నాయి. వీటిని వాడకంలోకి తీసుకురావాలంటే వేల కోట్లు ఖర్చు చేయాల్సిందే. మహిళలు ఇక్కడ కాస్త బాధ్యతతో వ్యవహరిస్తే కుటుంబ సభ్యులు బాధ్యతగా తీసుకునేందుకు ముందుకొస్తారు. అలా కుటుంబంతో సహా మొత్తం దేశంలో అందరిలోనే నెమ్మదిగా మార్పు వస్తుంది.
కరెంట్: దేశవ్యాప్తంగా కరెండ్ వృథా ఎంతంటే ..రోజూకి ఐదు కోట్ల యూనిట్లు. ఈ విద్యుత్ శక్తి తయారీకి అయ్యే ఖర్చు చూస్తే ఏకంగా రూ. 12 కోట్లుపైనే. మరీ ఈ భారం పడేది మనపైనే. అలాగే రేపు విద్యుత్ కొరత తలెత్తితే ఇబ్బంది పడేది కూడా మనమే. అందుకే ఇప్పటి నుంచే ఇంట్లో ప్రతి గదిని చెక్ చేసి మరీ లైట్లు, ఫ్యాన్ల స్విచ్‌లను ఆపేద్దాం.
ప్లాస్టిక్ పనిపడదాం: ఇంట్లో ఏ సరకులు తేవాలన్నా క్యారీ బ్యాగ్ తప్పనిసరి. వాటర్ బాటిల్ నుంచి పాల ప్యాకెట్ వరకు ప్రతిదీ ప్లాస్టికే. ఏటా 74 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్తగా మారుతుంది. దీన్ని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ. వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత నష్టాన్నీ... కాలుష్యం వల్ల వచ్చే కష్టాన్నీ అన్నింటినీ మనమే భరించాల్సి వస్తోంది. అందువల్ల ఈ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు తెలుసుకుని వాటిని అలవాటు చేసుకుందాం
వంట గ్యాస్: మన వంటింట్లో వెలిగే గ్యాస్ పొయి అంటే మనకు ఎంత నిర్లక్యమో చెప్పాల్సిన పనిలేదు. రోజూ ఏదో కూర మాడడం లేదా వెలిగించి కట్టడం మర్చిపోవడం వంటివి చేస్తూ అగ్ని ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాం. నిజానికి కాస్త తెలివితో నాణ్యమైన స్టౌ ఎంచుకుంటే చక్కగా ఇంధనాన్ని ఆదా చెయ్యొచ్చు. మనకు కూడా గ్యాస్‌కి పెట్టే ఖర్చు తగ్గుతుంది కూడా.
ముఖ్యంగా బర్నర్‌లు, పైపులు, రెగ్యులేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అవన్నీ సక్రమంగా ఉన్నాయా..ఎక్కడైనా లీకేజ్‌లు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఇలా చేస్తే కోట్లాది రూపాయాలు ఖరీదు చేసే ఇంధనం వృధా కాకుండా నివారించొచ్చు. అందువల్ల ప్రతి ఇల్లాలు ఇంట్లో చేసే ప్రతి పనిని జాగ్రత్తగా బాధ్యతతో వ్యవహరించి.. వృధాకు అడ్డుకట్ట వేస్తే కుటుంబ బడ్జెటే కాదు దేశ బడ్జెట్‌ని అదుపు చెయ్యొచ్చు..లాభాలు పొందొచ్చు.
(చదవండి: Union Budget 2024-25: మహిళలు, బాలికలకు గుడ్ న్యూస్)
Comments
Please login to add a commentAdd a comment