ఎస్‌ఐ రాత పరీక్ష కీ విడుదల | si exam key released | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ రాత పరీక్ష కీ విడుదల

Published Tue, Apr 19 2016 3:30 AM | Last Updated on Sun, Sep 2 2018 3:46 PM

సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఐ) ప్రిలిమినరీ రాత పరీక్ష కీ పేపర్‌ను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది.

21 లోగా అభ్యంతరాలు నివేదించాలి: రిక్రూట్‌మెంట్ బోర్డు
సాక్షి, హైదరాబాద్:
సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఐ) ప్రిలిమినరీ రాత పరీక్ష కీ పేపర్‌ను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. వివిధ విభాగాల్లోని 539 పోస్టులకు ఆదివారం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. వీటిలో సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ విభాగాలకు సంబంధించిన కీని బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచింది. కమ్యూనికేషన్ విభాగానికి సంబంధించిన కీ పేపర్‌ను విడుదల చేసినా కొన్ని సాంకేతిక కారణాల వల్ల వెబ్‌సైట్‌లో కనిపించట్లేదు. దీన్ని మంగళవారం ఉదయంలోగా సరిచేస్తామని అధికారులు తెలిపారు.

సివిల్‌కు సంబంధించిన పరీక్షలో ఒక ప్రశ్న తప్పుగా దొర్లినట్లు పీఆర్‌బీ గుర్తించింది. ప్రశ్నపత్రం కోడ్-ఎలో 148, కోడ్-బిలో 163, కోడ్-సిలో 169, కోడ్-డిలో 153 ప్రశ్నను తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఇచ్చిన 200 ప్రశ్నలకు 199 మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది. కీ పేపర్‌లో అభ్యంతరాలుంటే ఈ నెల 21లోగా జ్ఛుడౌఛ్జ్ఛఛ్టిజీౌటచిటజీః్టటఞటఛ.జీ  మెయిల్ ద్వారా బోర్డు దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఫైనల్ కీని విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement