సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిద్దాం ఇలా..! | Diwali 2024: This Diwali Lets Light A Diya In Our Hearts | Sakshi
Sakshi News home page

సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిద్దాం ఇలా..!

Published Thu, Oct 31 2024 8:36 AM | Last Updated on Thu, Oct 31 2024 9:07 AM

Diwali 2024: This Diwali Lets Light A Diya In Our Hearts

ప్రతి దీపకాంతి పసిడి వర్ణంలో వెలుగులు విరజిమ్ముతుంది. అయితే, కొన్ని దీపాల నుంచి వచ్చే పరిమళాలు మాత్రం విభిన్నంగా మదిని కట్టిపడేస్తున్నాయి. మట్టి ప్రమిదల్లో నూనెతో దీపాలను వెలిగించడంతోనే సంతృప్తి పడటం లేదు నేటితరం అందుకే, భిన్న ఆస్వాదనల వెలుగులను పరిచయం చేస్తున్నారు క్రియేటర్స్‌. ఈ దీపావళిని సుంగంధ భరితం చేస్తున్న వెలుగులు ఇవి..

స్వీట్‌ ట్రీట్‌లను పోలి ఉండేలా నోరూరించే దియా డిజైన్ల శ్రేణి ఆన్‌లైన్‌ మార్కెట్‌లో సందడి చేస్తోంది. తియ్యని కప్‌ కేక్‌ల నుంచి ఐస్‌క్రీమ్‌ల వరకు ప్రతి కొవ్వొత్తి డిజైన్‌ అబ్బుర పరుస్తోంది. క్రీముతో కూడిన పంచదార పాకం సువాసనలను ఈ కొవ్వొత్తుల ద్వారా ఆస్వాదించవచ్చు. వీటి ధరలు కూడా వందల రూపాయల నుంచి వేలలో ఉన్నాయి. 

వీగన్‌ కాంతి..
జంతు ఆధారిత ఉత్పత్తులు ఏవీ ఉపయోగించకుండా వీగన్‌ కొవ్వొత్తుల డిజైన్స్‌ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్వీట్‌ డిజర్ట్‌ క్యాండిల్స్‌లో కుకీస్, బ్లాక్‌బెర్రీ, డార్క్‌ చాకొలెట్, లెమన్‌ డిజర్ట్, స్ట్రాబెర్రీ డిజర్ట్‌ క్యాండిల్స్‌ చూపులకు, సువాసనలకు నోరూరిస్తున్నాయి కూడా.

ఆకారానికో అందం..
మనుషులు, జంతు ఆకారాలను పోలిన క్యాండిల్స్‌తోపాటు సెంటెడ్‌ మట్కీ దియా సెట్, టెర్రకోట క్యాండిల్‌ దియాస్, ఘీ బ్లెండెడ్‌ ఫిల్డ్‌ క్లే దియా, మిర్రర్‌ డెకొరేషన్‌ దియాస్, షాడో దియాస్, వాటర్‌ లైట్‌ దియాస్‌ లభిస్తున్నాయి. భిన్న ఆకృతిలో డిజైన్లలో కనిపిస్తున్న వెలుగులు ఈ దీపావళికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.  

(చదవండి:

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement