
జైపూర్ రాజకుమారి దియా కుమారి(ఫైల్ ఫొటో)
జైపూర్ : జైపూర్ రాజకుమారి, సవాయి మాధోపూర్ ఎమ్మెల్యే దియా కుమారి విడాకుల కోసం దరఖాస్తు చేశారు. హిందూ వివాహ చట్టం 13బీ సెక్షన్ కింద గాంధీనగర్ ఫ్యామిలీ కోర్టులో ఆమె విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు దరఖాస్తులో పేర్కొన్నారు. కాగా జైపూర్ మహారాజు భవానీ సింగ్ కుమార్తె అయిన దియా కుమారి నరేంద్ర సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 1997లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో 21 ఏళ్ల తర్వాత ఈ జంట విడిపోనున్నది.
భర్త, పిల్లలతో దియాకుమారి
ఇక బీజేపీ తరపున సవాయి మాధోపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దియా కుమారి ఇటీవల జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వ్యక్తిగత కారణాల వల్ల పోటీకి దూరంగా ఉన్నానని ప్రకటించడంతో ఆమె స్థానంలో ఆశా మీనా అనే కొత్త అభ్యర్థికి బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే లోక్‌సభ అభ్యర్థిగా దియాను రంగంలోకి దింపాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఆశాకు అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment