కోలీవుడ్ స్టార్ జంట సూర్య- జ్యోతికల కూతురు దియా మరోసారి తన పేరెంట్స్ గర్వపడేలా చేసింది. ఈ మధ్యే పన్నెండో తరగతిలో టాప్ మార్కులు సాధించిన దియా.. తాజాగా ఓ డాక్యుమెంటరీ రూపొందించి తన టాలెంట్ బయటపెట్టింది. ఇండస్ట్రీలో మహిళా టెక్నీషియన్ల ఇబ్బందులను డాక్యుమెంటరీలో ప్రస్తావించింది.
వివక్ష..
సినిమాలో ఒక సీన్ అద్భుతంగా రావాలంటే నటీనటులకు మంచి టాలెంట్ ఉంటే సరిపోదు. ఆ సీన్ షూట్ చేసే ప్రదేశంలో మంచి లైటింగ్ ఉండాలి. సీన్‌కు తగ్గట్లుగా ఎఫెక్ట్స్ ఉండాలి. అయితే ఇవన్నీ సరిగ్గా ఉండేట్లు చూసుకునే మహిళా టెక్నీషియన్లకు సరైన గుర్తింపు మాత్రం రావడం లేదు. చాలామంది వారిని చిన్నచూపు చూస్తారు. వారి ఇబ్బందులను ప్రస్తావిస్తూ దియా.. లీడింగ్ లైట్: ద అన్‌టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఉమెన్ బిహైండ్ ద సీన్స్ అనే డాక్యుమెంటరీ తెరకెక్కించింది. ఇది దియా యూట్యూబ్ ఛానల్‌లో అందుబాటులో ఉంది.
వెలుగులోకి తీసుకొచ్చినందుకు థాంక్యూ
ఈ విషయాన్ని జ్యోతిక తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ కూతురిపై ప్రశంసలు కురిపించింది. దియా, నిన్ను చూస్తే గర్వంగా ఉంది. లేడీ టెక్నీషియన్స్ ఎదుర్కొంటున్న వివక్షను డాక్యుమెంటరీలో అర్థవంతంగా చూపించావు. ఎన్నాళ్లుగానో మూలుగుతున్న ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చినందుకు థాంక్యూ అని రాసుకొచ్చింది. ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింనకుగానూ దియా ఉత్తమ స్క్రీన్‌రైటర్‌గా త్రిలోక ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం విశేషం.
చదవండి: ఈ ఇండస్ట్రీలో ఇదే పెద్ద సమస్య.. తప్పు ఆడాళ్లపైకి తోసేస్తారు: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment