dipavali celebrations
-
అంగుళం భూమి కూడా వదులుకోం
భుజ్: దేశ సరిహద్దుల్లో మన భూభాగంలో ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. మన భూభాగాన్ని కాపాడుకొనే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు. దేశాన్ని కాపాడే విషయంలో సైనిక దళాల శక్తిసామర్థ్యాలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. భారత సైనిక దళాలను చూస్తే శత్రువులకు వణుకు తప్పదని అన్నారు. దుష్ట శక్తుల ఆటలు సాగవని హెచ్చరించారు. గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలో భారత్–పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని సర్ క్రీక్‌లో ప్రధాని మోదీ గురువారం బీఎస్ఎఫ్తోపాటు త్రివిధ దళాల సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన ప్రతిఏటా సైనికులతోపాటు దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. సర్ క్రీక్‌లో వేడుకల సందర్భంగా జవాన్లను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ ప్రాంతాన్ని యుద్ధక్షేత్రంగా మార్చడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. శత్రు దేశం ఈ ప్రాంతంపై చాలా ఏళ్లుగా కన్నేసిందని, ఆక్రమించుకొనేందుకు కుట్రలు చేస్తోందని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్’ ఏర్పాటు చేస్తాం ‘‘దౌత్యం పేరుతో సర్ క్రీక్‌ను ఆక్రమించడానికి గతంలో కుట్రలు జరిగాయి. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నేను శత్రుదేశం కుట్రలపై గొంతు విప్పాను. దేశాన్ని రక్షించే విషయంలో మన సైనిక దళాల సామర్థ్యంపై ప్రభుత్వానికి విశ్వాసం ఉంది. మన దేశాన్ని శత్రువుగా భావించేవారి మాటలు మేము నమ్మడం లేదు. సైన్యం, నావికాదళం, వైమానిక దళం వేర్వేరు విభాగాలు. కానీ, ఆ మూడు దళాలు ఒక్కటైతే దేశ సైనిక బలం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఇందుకోసమే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనే పదవిని సృష్టించాం. త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం కోసం ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఏర్పాటు చేయబోతున్నాం’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. -
‘యూదుల దీపావళి’ ఏమిటి? దేనిపై విజయానికి గుర్తు?
భారతీయులు దీపావళి పండుగ కోసం ఏడాది పొడవునా ఆసక్తిగా వేచిచూస్తుంటారు. ఆ రోజున భారతదేశం యావత్తూ దీపకాంతులతో నిండిపోతుంది. దీపావళి రోజున ఎక్కడ చూసినా వెలుగులు విరజిమ్ముతాయి. అయితే మనం చేసుకునే దీపావళి లాంటి పండుగను యూదులు కూడా జరుపుకుంటారని మీకు తెలుసా? యూదులు ఈ ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటారో.. దీపావళికి ఇది ఎలా సరిపోలి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న యూదులు జరపుకునే వెలుగుల పండుగ పేరు హనుక్కా. యూదులు దీనిని దీపాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ యూదులకు చాలా ముఖ్యమైనది. ఈ రోజున ఇజ్రాయెల్ అంతా కాంతులతో నిండిపోతుంది. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ పండుగ ఇజ్రాయిల్‌లో కేవలం ఒక్కరోజుతోనే ముగిసిపోదు. ఈ పండుగను యూదులు ఎనిమిది రోజులు ఆనందంగా జరుపుకుంటారు. హనుక్కా ఉత్సవ సమయంలో ప్రతి యూదు తమ ఇంటిలో 24 గంటలూ దీపాలు వెలిగిస్తాడు. యూదుల ఈ పండుగను మన దీపావళి తర్వాత అంటే డిసెంబర్లో జరుపుకుంటారు. యూదుల ఈ పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 18 వరకూ జరుపుకుంటారు. అయితే ఈ పండుగను ఇజ్రాయెల్ యూదులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులంతా ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగకు ఎంతో గుర్తింపు ఉంది. ఈ ఉత్సవ సమయంలో ఎక్కడెక్కడి యూదులు సైతం వారి ఇళ్లకు చేరుకుని ఆనందంగా గడుపుతారు. శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు మనం దీపావళి జరుపుకున్నట్లే, యూదులు కూడా తమ విజయానికి గుర్తుగా హనుక్కా పండుగను జరుపుకుంటారు. నాటి రోజుల్లో క్రోబియన్ తిరుగుబాటు జరిగినప్పుడు గ్రీకు-సిరియన్ పాలకులకు వ్యతిరేకంగా యూదులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ విధంగా వారిని జెరూసలేం నుండి వెళ్లగొట్టారు. దీనికి గుర్తుగా యూదులు హనుక్కా ఉత్సవాన్ని చేసుకుంటారు. ఇది కూడా చదవండి: ఆసియాను వణికించిన భూ కంపాలివే.. -
చిత్రకూట్ దీపావళి ప్రత్యేకత ఏమిటి? మందాకినీ తీరంలో ఏం జరుగుతుంది?
మధ్యప్రదేశ్‌ని చిత్రకూట్‌లో జరిగే దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపావళి పండుగ సందర్భంగా చిత్రకూట్‌లోని మందాకిని నది తీరంలో ఐదు రోజుల పాటు జరిగే జాతరలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారు. లంకను జయించిన శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తూ, ఋషులతో కలిసి మందాకిని నదిలో దీప దానాన్ని చేశాడని స్థానికులు చెబుతారు. చిత్రకూట్‌లో దీపావళి పండుగను అయోధ్యలో జరిగే వేడుకల స్థాయిలో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ధన్తేరస్ మొదలుకొని భాయ్ దూజ్ వరకు ఐదు రోజుల పండుగ జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులు మందాకినీ నదిలో దీప దానం చేస్తారు. అంటే నదికి దీపాలు సమర్పించి, తమకు శ్రేయస్సు అందించాలని నదీమతల్లిని కోరుకుంటారు. చిత్రకూట్‌లో పదకొండున్నర సంవత్సరాలపాటు వనవాసం చేసిన శ్రీరాముడు ఇప్పటికీ ఇక్కడ తిరుగాడుతూ, భక్తులకు కనిపిస్తాడని స్థానికులు చెబుతుంటారు. దీపావళి సందర్భంగా ఇక్కడ నిర్వహించే ఐదు రోజుల దీప దాన ఉత్సవం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రతీయేటా 20 నుంచి 25 లక్షల మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇది కూడా చదవండి: డోంగర్‌ఘఢ్‌కు ప్రధాని మోదీ.. బమ్లేశ్వరి ఆలయంలో పూజలు -
రాజ్‌భవన్‌లో దీపావళి సంబురాలు రేపు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్ దర్బార్ హాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సామాన్య ప్రజానీకంతో పాటు వివిధ రంగాల ప్రముఖులను కలుసుకుని దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఇదీ చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ -
Diwali 2021: ఈ మీమ్స్ చూస్తే.. నవ్వాపుకోలేరు!!
దీపావళి అంటే దీపాలతో వెలుగులు నింపే పండగ. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి, పూజలు, వ్రతాలు జరుపుకుంటారు. దీపావళి రోజు మిఠాయిలు పంచుకోవడం కూడా సంప్రదాయంగా వస్తుంది. సాధారణంగా దీపావళికి తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు యాజమాన్యాలు స్వీట్ బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తాయి. అయితే దీపావళి మిఠాయి అనగానే చాలామందికి సోన్ పాపిడి గుర్తుకు వస్తుంది! దీపావళిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు, స్నేహితులు సోన్‌పాపిడి బాక్స్‌లను కానుకగా ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ప్రస్తుతం ఈ దీపావళి పండగ సందర్భంగా కూడా స్వీట్లపై ఫన్నీ మీమ్స్, జోకులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్ల జోకులు, మీమ్స్‌తో ట్విటర్లో #SoanPapdi ట్రెండింగ్‌లో ఉంది. Need this tag on soan papdi boxes too. pic.twitter.com/iEtnbpFdpG — Aman 👾 (@iamboyaman) October 26, 2021 The #soanpapdi dukh🙄 pic.twitter.com/y8D8etoyCU — Karan Makwana (@karanmak25) November 3, 2021 Speacial sofa seat for the relatives who gonna bring soan papdi#Diwali2021 pic.twitter.com/6jYvLPAsZn — ANANT SHARMA (@Freakingbunny) November 2, 2021 When You get back Your own soan papdi box on #Diwali pic.twitter.com/7oWn6LwUjx — Zing Tunes ❤ (@Zing_Tunes) November 3, 2021 -
తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి: సీఎం జగన్
-
తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి. ఈ పండుగ మీ అందరి ఇంట ఆనందపు కాంతులు నింపాలని, సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.#HappyDiwali — YS Jagan Mohan Reddy (@ysjagan) November 4, 2021 చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని అభిలషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. చదవండి: AP: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ -
పండుగ వేళ జర భద్రం
సాక్షి, చెన్నై(తమిళనాడు): పండుగల సీజన్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ హెచ్చరించారు. రాష్ట్రంలో థర్డ్ వేవ్‌కు ఆస్కారం ఉండదు..రాదు...అనే హామీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇక, శనివారం రాష్ట్రంలో 50 వేల శిబిరాల్లో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ పకడ్బందీగా నిర్వహించారు. కరోనా నియంత్రణ లక్ష్యంగా రాష్ట్రంలో ప్రతి ఆదివారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు విడుదలు ఈ శిబిరాలు విజయవంతం అయ్యాయి. నాలుగున్నర కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేసుకున్నారు. మరో కోటి మంది తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంది. అయితే, ఆదివారం శిబిరాల ఏర్పాటు కారణంగా మందుబాబులు, మాంసం ప్రియులు టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదన్న విషయం పరిశీలనలో తేలింది. దీంతో ఈసారి మెగా శిబిరం శనివారానికి మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రపథమంగా 50 వేల శిబిరాల్ని ఏర్పాటు చేశారు 60 లక్షల మేరకు డోస్‌ల టీకాను సిద్ధంగా ఉంచారు. అయితే, ఆశించిన మేరకు ఈసారి ఈ డ్రైవ్‌కు స్పందన రాలేదు. 15 లక్షల మంది మేరకు టీకా వేయించుకున్నారు. సీఎం పరిశీలన, సమీక్ష కన్నగి నగర్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ శిబిరాన్ని సీఎం ఎంకే స్టాలిన్ పరిశీలించారు. ప్రజలతో మాట్లాడా రు. వారి సమస్యల్ని తెలుసుకున్నారు. అలాగే, అక్కడ వెళ్తున్న నగర రవాణా సంస్థ బస్సుల్లో ఆకస్మికంగా ఎక్కి.. మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ఉచిత బస్సు సేవల గురించి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈసందర్భంగా పలువురు మహిళలు కొన్ని సమస్యలు, సూచనలు ఇచ్చారు. అనంతరం సచివాలయానికి చేరుకున్న సీఎం స్టాలిన్ అధికారులతో సమావేశం అయ్యారు. పండుగ సీజన్ వేళ కరోనా ఆంక్షల సడలింపు, ఈనెల 31తో ముగియనున్న ఆంక్షలు, కొనసాగింపు గురించి సమీక్షించారు. అంగన్వాడీలు, నర్సరీ పాఠశాలలు నవంబర్ 1వ తేదీ నుంచి తెరవాలనే విషయాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించారు. షిఫ్ట్‌ల వారీగా తరగతులు ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు నవంబర్ 1వ తేదీ నుంచి షిఫ్టుల వారీగా తరగతులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కరోనా ఆంక్షలను నవంబర్ 15వ తేది వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. క్రీడల, స్విమ్మింగ్ తదితర పోటీల నిర్వహణకు, థియేటర్లలో 100 శాతం ప్రేక్షకులకు అనుమతి కల్పించారు. అయితే, రాజకీయ కార్యక్రమాలు, ఆలయ ఉత్సావలకు గతంలో విధించిన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక చెన్నైలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించినానంతరం ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ, పండుగ సీజన్లో జనం మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పలు దేశాల్లో థర్డ్ వేవ్ విజృంభిస్తున్నదని గుర్తు చేశారు. ప్రస్తుతం పండుగ సీజన్ ఆందోళన కల్గిస్తోందని, టీకా వేసుకోని వాళ్లు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు. ఇంకా కోటి మందికి తొలి డోస్ వేసుకోవాల్సి ఉందని, మరో 57 లక్షల మంది రెండో డోస్ వేసుకోవాల్సి ఉందని వివరించారు. వీరంతా టీకా వేయించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అరియలూరులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించినానంతరం మీడియాతో ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్మాట్లాడుతూ, విద్యార్థులకు చదువులు కుంటు పడకుండా ఉండేందుకే.. పాఠశాలల్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: Match Box: 14 ఏళ్ల తరువాత దాని ధర డబుల్ .. -
కరోనా : సీఎం వినూత్న పూజ
సాక్షి, న్యూఢిల్లీ : దీపావళి పండుగ చెడు పై మంచి గెలుపుకు ప్రతీక .ఈ దీపాల వెలుగులో అమవాస్య చీకట్లను పారద్రోలాలని ప్రజలందరూ లక్ష్మి పూజ చేస్తారు. గత మార్చి నుంచి దేశంలో ప్రజలందరి జీవితాలలో కరోనా వలన అమవాస్య చీకట్లు అలుముకున్నాయి. మరి ముఖ్యంగా ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కవగా ఉంది. ఈ తరుణంలో కరోనా చీకట్లు తొలగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సహచర కేబినేట్ మంత్రులతో కలిసి అక్షరధామ్ దేవాలయంలో శనివారం రాత్రి 7.39లకు లక్ష్మీ పూజ చేయనున్నారు. అంతేకాకుండా ప్రజలందరూ స్టే ట్యూన్డ్ కేజ్రీ టీవి అంటూ లైవ్‌లో పూజా కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని సీఎం కేజ్రీవాల్ స్వయంగా ట్విటర్లో తెలుపుతూ...2 కోట్ల ఢిల్లీ ప్రజలు అందరం కలిసి లక్ష్మి పూజ చేసి మన జీవితాలలోని కష్టాలను పారద్రోలుదామని పిలుపునిచ్చారు. (చదవండి: ‘కోరల’తో వస్తోన్న ‘కాలుష్య–కమిషన్’) గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా విపరీతంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం నివారణ చర్యలలో భాగంగా ప్రజలందరూ క్రాకర్స్, బాణసంచా కాల్చకుండా ఈ పూజలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో నవంబర్30 వరకు ఎలాంటి క్రాకర్స్, బాణసంచా కాల్చకుండా నిషేధం విధించారు. క్షేత్ర స్థాయిలో నిషేధాజ్క్షలు అమలుకు ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్లైయింగ్ స్కాడ్‌ని నియమించారు. ఢిల్లీ ప్రభుత్వం పెరుగుతున్న కేసులు వారం పది రోజుల్లో కంట్రోల్లోకి వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తుంది. (చదవండి: ఢిల్లీలో గరిష్ఠ స్థాయికి కరోనా కేసులు) -
పండుగ మిగిల్చిన విషాదం
రాజేంద్రనగర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఇంటి ముందు బాధిత కుటుంబీకులు, బంధువులు మృతదేహంతో ధర్నా చేపట్టారు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబుల్‌రెడ్డినగర్ ప్రాంతానికి చెందిన సంగమేశ్వర్‌రెడ్డి(40) తన కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి(15)తో కలిసి ఈ నెల 7వ తేదీ దీపావళి పండుగ రోజు దుర్గానగర్‌లో బాణసంచా కొనుగోలు చేసేందుకు వెళ్లారు. రోడ్డు దాటుతున్న క్రమంలో పల్సర్ వాహనంపై వేగంగా వచ్చిన ముగ్గురు యువకులు వీరిని ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులను చికిత్స నిమితం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న సంగమేశ్వర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి కన్నుమూశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ప్రమాదానికి కారణమైన వాహన యజమాని బాబుల్‌రెడ్డినగర్‌కు చెందిన రణవీర్‌సింగ్ ఇంటి ముందు మృతదేహంతో ధర్నాకు దిగారు. రణవీర్‌సింగ్ ఇంట్లో అద్దెకు ఉంటున్న యువకుడు ఈ వాహనాన్ని పండుగ రోజున తీసుకువెళ్లి తండ్రీకొడుకులను ఢీకొట్టాడు. విషయం తెలుసుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను, బంధువులను సముదాయించారు. వాహనం నడిపిన యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా రాత్రయినా ధర్నా కొనసాగుతోంది. -
నిబంధనలు తుస్
ఆదిలాబాద్‌టౌన్: టపాసుల దుకాణాల ఏర్పాటులో నిబంధనలు తస్సుమంటున్నాయి. అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడం వల్లే జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు అవుతున్నాయన్న ఆరోపణలు బాంబుల్లా పేలుతున్నాయి. ఫలితంగా వ్యాపారులు ఆడిందే ఆటగా సాగుతోంది. జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఏ వైపు నుంచి బాంబు రూపంలో ప్రమాదం దూసుకొస్తుందోని చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఊరి బయట దుకాణాలను నెలకొల్పాల్సి ఉండగా, జిల్లాకేంద్రంలోని నడిబొడ్డులో గల రాంలీలా మైదానంలో వీటిని ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. జనావాసాల మధ్య.. ప్రజలకు ఎలాంటి హానీ చేకూరకుండా ఊరి బయట టపాసుల దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వ్యాపారులు పాటించడంలేదు. పట్టణంలో జనావాసాల మధ్యనే పదుల సంఖ్యలో టపాసుల దుకాణాలు వెలుస్తున్నాయి. అనుకోకుండా ఏదైన ప్రమాదం జరిగితే పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు, ఆస్తులు, ప్రజల ప్రాణాలు గాలిలో కలిసే అవకాశాలు లేకపోలేదు. గతంలో హైదరాబాద్, వరంగల్, తదితర ప్రాంతాల్లో పేలుళ్ల ధాటికి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు లేకపోలేదు. దీపావళి పండుగ సమీపిస్తుండడంతో టన్నులకొద్ది టపాసులను దిగుమతి చేసుకుంటుండగా అడ్డుకునే అధికారులే కరువయ్యారు. టపాసుల వ్యాపారమంతా జీరో దందాగానే కొనసాగుతోంది. కొంతమంది వ్యాపారులు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటుండగా, వీరిని నివారించేవారు కరువయ్యారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని రాంలీలా మైదానంతోపాటు డైట్ కళాశాల పక్కనగల మరోచోట కూడా ఈ దుకాణాలు వెలుస్తున్నాయి. కొన్నేళ్లుగా ఇక్కడే వెలుస్తుండడంతో వ్యాపారులు ఈ దీపావళి పండుగ సందర్భంగా టపాసులు విక్రయించేందుకు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. వినియోగదారుల జేబులకు చిల్లు.. టపాసుల వ్యాపారులు ఇష్టారీతిన ధరలు నిర్ణయించడంతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఈ విషయాన్ని ఆయా శాఖల అధికారులు తమకేమీ పట్టనట్లుగా ఉండడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియకపోవడంతో మిన్నకుండిపోతున్నారు. రూ.4 విలువ చేసే వస్తువులను దాదాపు రూ.40 వరకు విక్రయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. టపాసులను తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటుండగా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన లక్షల రూపాయల పన్నును అక్రమ మార్గంలో ఎగ్గొడుతున్నారు. ఒకే వేబిల్పై ఎక్కువ టపాసులు దిగుమతి చేసుకుంటున్నారు. వారు తెచ్చే సరుకులపై 14.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, కొంతమంది మాత్రమే నామమాత్రంగా పన్ను చెల్లించి చేతులు దులిపేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా శాఖల అధికారులు ‘మామూలు’గా తీసుకోవడంతో ఈ తతంగం జోరుగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ, విజిలెన్స్, తూనికలు, కొలతలు, ఫైర్, తదితర శాఖల అధికారులు సమన్వయంతో కమిటీలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు వినియోగదారులకు మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో 77 దుకాణాలకు అనుమతి.. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఆన్లైన్లో 77 దుకాణాల వారు దరఖాస్తులు చేసుకున్నారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో రాంలీలా మైదానంతోపాటు డైట్ కళాశాల మైదానానికి ఎదురుగా మొత్తం కలిపి 63 షాపులు, ఇంద్రవెల్లిలో 5, ఇచ్చోడలో 10, బోథ్‌లో 2 దుకాణాలకు మాత్రమే అనుమతి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా జిల్లా వ్యాప్తంగా అనేకచోట్ల టపాసుల విక్రయాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఈ విషయమై ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ నర్సింహారెడ్డిలను సంప్రదించగా.. జనావాసాల్లో ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాంలీలా మైదానంలో ఇళ్లకు దగ్గరగా ఉన్నవాటిని ఏర్పాటు చేయకుండా నిలిపివేశామని తెలిపారు. నిబంధనలివీ.. టపాసుల దుకాణానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. హోల్‌సేల్ దుకాణానికి రూ.2500, నామమాత్రపు దుకాణానికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఫైర్ శాఖతోపాటు పోలీసు, రెవెన్యూ శాఖల అనుమతి తప్పనిసరి. ఈ లైసెన్సులు 15 రోజుల కోసం మాత్రమే వర్తిస్తాయి. పండుగ తర్వాత రెండు రోజులు మాత్రమే దుకాణాలు ఉంచాలి. ప్రతీ దుకాణం వద్ద ఫైర్ ఎక్స్‌టెన్షనల్ (అగ్నిమాపక పరికరాలు) తప్పనిసరిగా ఉంచాలి 200 లీటర్ల వాటర్ బ్యారల్ ఉంచాలి. నాలుగు ఇసుక బకెట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఆరు నీటి బకెట్లను ఏర్పాటు చేసుకోవాలి. దుకాణం రేకుల ద్వారా ఏర్పాటు చేయాలి. పాత కరెంట్ తీగలు ఉంచరాదు. జాయింట్ కేబుల్స్ వాడవద్దు. ల్యాంప్‌లు, పెట్రోమ్యాక్స్‌లు దుకాణాల వద్ద ఉంచరాదు. జనరేటర్ 15 నుంచి 20 మీటర్ల దూరంలో ఉండాలి. దుకాణంలో 18 సంవత్సరాల వయస్సు నిండిన వారే పనిచేయాలి. గోదాం ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి దుకాణాలను జనావాసాల మధ్య ఏర్పాటు చేయరాదు. టపాసుల గోదాముల వద్ద 1620 ఎల్పీఎం మోటార్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.గోదాములో పెద్ద పెద్ద గదులు, మధ్యలో అంతరాయం ఉండాలి. తదితర నిబంధనలు ఉన్నప్పటికీ ఆదిలాబాద్‌లో మాత్రం ఇవేమీ పాటించకుండా వ్యాపారులు ఇష్టారీతిన దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలు పాటించాలి టపాసుల యజమానులు నిబంధనలు పాటించాలి. అనుమతులు ఉన్నవారే దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటివరకు 77 మంది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. 15 రోజులపాటు మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంటుంది. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని నివారించేందుకు నీరు, ఇసుక, డీసీపీ అందుబాటులో ఉంచుకోవాలి. సిల్క్ దుస్తులు కాకుండా కాటన్ దుస్తులు ధరించాలి. – కేశవులు, డివిజనల్ ఫైర్ అధికారి -
దీపావళి వేళ.. వరుస సెలవుల ఎఫెక్ట్
సాక్షి, అమరావతి : దీపావళి పండుగ నేపథ్యంలో ఉద్యోగుల వరుస సెలవులతో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోనున్నాయి. పండుగను పురస్కరించుకుని అధికారులు, ఉద్యోగులు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. ఈ నెల 19(గురువారం)న దీపావళి సందర్భంగా సెలవు. దీంతో పలువురు ఉద్యోగులు బుధవారం ఆప్షనల్ సెలవును వినియోగించుకుంటున్నారు. ఇక శుక్రవారం సాధారణ (క్యాజువల్) సెలవు పెట్టుకుంటున్నారు. ఇక శని, ఆదివారాలూ ఎలాగూ సెలవే. ఫలితంగా మొత్తం ఐదురోజుల సెలవు కలిసొచ్చినట్టయింది. సాధారణంగా ఒక ఉద్యోగి సంవత్సరంలో ఐదు ఆప్షనల్ సెలవుల్ని తీసుకోవచ్చు. జనవరి 1 నుంచి డిసెంబర్ 31లోగా వీటిని ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఈ సెలవునే బుధవారం వాడుకుంటున్నారు. హైదరాబాద్ బస్సులు కిటకిట.. ఇదిలా ఉండగా మెజారిటీ ఉద్యోగుల కుటుంబాలు ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వారి పిల్లలు హైదరాబాద్‌లోనే చదువుకుంటున్నారు. ఇలా వరుస సెలవులు కలసిరావడంతో ఉద్యోగులు భారీగా హైదరాబాద్‌కు తరలివెళుతున్నారు. దీంతో మంగళవారం రాత్రి నుంచే హైదరాబాద్‌కు వెళ్లేవారితో విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఇక ప్రైవేటు ట్రావెల్స్‌లోనూ రద్దీ ఎక్కువగా ఉంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు చెందినవారు హైదరాబాద్‌కున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. బుధవారమూ విజయవాడ బస్టాండ్‌లో రద్దీ కొనసాగేలా కనిపిస్తోంది. ఉద్యోగుల సంగతి అటుంచితే సాధారణ ప్రయాణికులూ దీపావళి వేళ ఊళ్లకు పయనమయ్యారు. నాలుగు రోజులపాటు సొంతవూర్లో బంధువులతో గడిపి పండుగను జరుపుకునేందుకు మంగళవారం రాత్రి నుంచే బయల్దేరుతున్నారు. -
పేలని టపాసు!
సాక్షి, హైదరాబాద్: దీపావళి టపాసులపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రభావం పడింది. దీపావళికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ బాణసంచా వ్యాపారం ఇంకా జోరందుకోలేదు. కేంద్రం టపాసులపై 28 శాతం జీఎస్టీ విధించింది. దీంతో వాటి ధరలు గతేడాది కంటే బాగా పెరిగాయి. ఒకవైపు వరుసగా కురుస్తున వర్షాలు, మరోవైపు జీఎస్టీ విధింపుతో రిటైల్ వ్యాపారులు మందుకు రావడం లేదు. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తరహాలో టపాకాయలపై ఆంక్షలు విధిస్తే వ్యాపారంపై ప్రభావం పడుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో హోల్‌సేల్ వ్యాపార కేంద్రాలు వెలవెలబోతున్నాయి. దీపావళి టపాసుల సీజనల్ బిజినెస్, హోల్‌సేల్ వ్యాపారులు మాత్రం శివకాశి నుంచి భారీగా టపాసుల దిగుమతి చేసుకుని నిల్వ చేసుకున్నారు. ఏటా రూ.20 కోట్ల వ్యాపారం.. గ్రేటర్ హైదరాబాద్‌లో దీపావళి వచ్చిందంటే కోట్ల విలువైన టపాసులు కాలి బూడిద కావాల్సిందే. మహానగరంలో 50 వేల మంది వరకు హోల్‌సేల్ వ్యాపారులు ఉండగా, 30 వేల మంది వరకు రిటైల్ వ్యాపారులు ఉంటారు. ఏటా సుమారు రూ.20 కోట్ల వరకు బాణసంచా వ్యాపారం సాగుతోంది. సాధారణంగా దసరా పండగ మరుసటి రోజు నుంచే దీపావళి వ్యాపారం మొదలవుతుంది. హోల్‌సేల్‌తో పాటు రిటైల్ వ్యాపారులు సైతం హోల్‌సేల్ అంటూ విక్రయాలు సాగిస్తుంటారు. అయితే ఈ సారి దీపావళి సమీపిస్తున్నా కనీసం వ్యాపారం సందడి లేకుండా పోయింది. దీంతో హోల్‌సేల్ వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. 30 శాతానికి పైగా పెరిగిన ధరలు.. దీపావళి టపాసుల ధరలకు రెక్కలు వచ్చాయి. గతేడాది కంటే 30 శాతంపైగా పెరిగాయి. జీఎస్టీ ప్రభావంతో హోల్‌సేల్ వ్యాపారులు ధరలు పెంచేశారు. వాస్తవానికి హోల్‌సేల్ వ్యాపారులు శివకాశిలో టపాసులు కొనుగోలు చేసినప్పుడే బిల్లులో 28 శాతం పన్ను పడింది. దీంతో హోల్‌సేల్ వ్యాపారులు జీఎస్టీ భారాన్ని రిటైల్ వ్యాపారులపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక రిటైల్ వ్యాపారులు దానిని వినియోగదారులపై రుద్దే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తొలిసారిగా ఐరాస వేదికగా..
భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకొనే దివ్వెల పండుగ దీపావళి తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలోనూ వెలుగులు నింపింది. ఐరాస కార్యాలయంలో దీపావళి పండుగ ఘనంగా జరిగింది. ఈ పర్వదినం సందర్భంగా ఐరాస ప్రధాన కార్యాలయాన్ని దీపాలతో అలకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ‘హ్యాపీ దీవాలి’ అంటూ దీపావళి శుభాకాంక్షలను పెట్టారు. ఐరాసలో దీపావళి పండుగ జరుపుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక దేశమంతటా దీపావళి పండుగ సంబరాలు హోరెత్తుతున్నాయి. ఆలయాలను దర్శించుకొని లక్ష్మీ, గణేష్ పూజలను నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు రణ్‌బీర్‌కపూర్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, ‘ట్రిపుల్ ఎక్స్’ సినిమా జోడీ విన్ డీజిల్, దీపికా పదుకొనే, క్రికెటర్ విరాట్ కోహ్లి తదితరులు దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. Happy Diwali, India