తొలిసారిగా ఐరాస వేదికగా.. | United Nation celebrates Diwali for the 1st time | Sakshi
Sakshi News home page

తొలిసారిగా ఐరాస వేదికగా..

Published Sun, Oct 30 2016 8:46 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 PM

తొలిసారిగా ఐరాస వేదికగా..

తొలిసారిగా ఐరాస వేదికగా..

భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకొనే దివ్వెల పండుగ దీపావళి తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలోనూ వెలుగులు నింపింది. ఐరాస కార్యాలయంలో దీపావళి పండుగ ఘనంగా జరిగింది. ఈ పర్వదినం సందర్భంగా ఐరాస ప్రధాన కార్యాలయాన్ని దీపాలతో అలకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ‘హ్యాపీ దీవాలి’ అంటూ దీపావళి శుభాకాంక్షలను పెట్టారు. ఐరాసలో దీపావళి పండుగ జరుపుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇక దేశమంతటా దీపావళి పండుగ సంబరాలు హోరెత్తుతున్నాయి. ఆలయాలను దర్శించుకొని లక్ష్మీ, గణేష్‌ పూజలను నిర్వహిస్తున్నారు. బాలీవుడ్‌ ప్రముఖులు రణ్‌బీర్‌కపూర్‌, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, ‘ట్రిపుల్‌ ఎక్స్‌’ సినిమా జోడీ విన్‌ డీజిల్‌, దీపికా పదుకొనే, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి తదితరులు దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement