utsav
-
Hyderabad: భార్యతో గొడవపడి అర్ధరాత్రి పోర్షే కారులో చక్కర్లు..
బంజారాహిల్స్: భార్యతో గొడవపడి అర్ధరాత్రి ఖరీదైన పోర్షే కారులో చక్కర్లు కొడుతూ మితిమీరిన వేగంతో దూసుకెళ్ళి రోడ్డు ప్రమాదానికి కారకుడైన వ్యాపారి, స్టాండప్ కమేడీయన్ ఉత్సవ్ దీక్షిత్‌ను ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయగా ప్రమాదానికి కారణమైన పోర్షేకారు కండీషన్ తెలియజేయాల్సిందిగా జర్మనీ కంపెనీకి బంజారాహిల్స్ పోలీసులు లేఖ రాయనున్నారు. ఇప్పటికే లేఖను సిద్ధం చేసిన పోలీసులు నేడో, రేపో ఈ కారు కండీషన్ తెలియజేయాల్సిందిగా కోరనున్నారు. ఈ కారు మరమ్మతులకు వచ్చిందని మూడునెలల క్రితమే సర్వీస్ కు తేవాలని చెప్పామని రోడ్లపైకి తీసుకెళ్ళవద్దని హెచ్చరించడం కూడా జరిగిందని షోరూం ప్రతినిధులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదేదీ పట్టని ఉత్సవ్ దీక్షిత్ మూడునెలల నుంచి కారును నడిపిస్తూనే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.వేగంతో కారును నడపడంతో మూల మలుపు వద్ద కారు స్టీరింగ్‌కు లాక్ పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు కండీషన్లో ఉందా లేదా తేల్చాల్సిందిగా పోర్షే కంపెనీకి లేఖ రాయాలని నిర్ణయించారు. సంబంధిత కంపెనీ నుంచి నిపుణులు వచ్చి కారు కండీషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఉత్సవ్ దీక్షిత్ అరెస్టు -
సీఎం గారి భార్య కదా..
-
Mumbai: తప్పక చూడాల్సిన ఐదు అద్భుత గణపతులు
ముంబై: సెప్టెంబర్ 7 నుంచి దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. వినాయకుని జన్మదినోత్సవం సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. మహారాష్ట్రలో 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో గణపతి భారీ విగ్రహాలను వీధుల్లోని అద్భుత వేదికలలో ప్రతిష్టిస్తారు. ముంబైలో ఏర్పాటు చేసే ఐదు గణపతి విగ్రహాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. వాటిని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు.లాల్బాగ్చా రాజాసెంట్రల్ ముంబైలోని లాల్బాగ్ మార్కెట్లోని లాల్బాగ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని 'లాల్బాగ్చా రాజా' అత్యంత ప్రసిద్ది చెందిన వినాయక మండపంగా పేరొందింది. లాల్‌బాగ్‌లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాన్ని నవసాచ గణపతి అంటారు. ఈ రూపంలోని గణేశుడు అన్ని కోరికలను తీరుస్తుంటాడని చెబుతారు. 10 రోజుల పాటు ఇక్కడ జరిగే గణేష్ ఉత్సవాల్లో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనం కోసం క్యూ కడతారు.అంధేరీచా రాజాముంబయిలో గణేశోత్సవాలను చూసేందుకు వచ్చే భక్తులు తప్పనిసరిగా అంధేరీచా రాజాను సందర్శిస్తుంటారు. అంధేరీచా రాజాను 'నవసాల పవనార గణపతి' లేదా 'కోరికలను నెరవేర్చే గణేశుడు' అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం అంధేరీచా మండపం థీమ్ విభిన్నంగా ఉంటుంది. ఇది భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది.ముంబైచా రాజాముంబైలోని అత్యంత ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా రాజా గణేష్ మండపానికి కొద్ది దూరంలో మరొక ప్రసిద్ధ గణపతి మండపం ఉంది. గణేష్ గల్లీలో ఉన్న ఈ మండపంలో కొలువైన గణపతిని ముంబైచా రాజా అని పిలుస్తారు. ముంబైలోని పురాతన గణేష్ మండపాలలో ఒకటైన ముంబైచా రాజా 1928 నుండి పూజలందుకుంటున్నాడు. ఈ గణేష్ మండపం థీమ్ ప్రతి సంవత్సరం ఎంతో భిన్నంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ముంబై చా రాజాను సందర్శించి, ఆశీస్సులు పొందుతారు.జీఎస్బీ సేవా మండల్ముంబైలోని కింగ్స్ సర్కిల్లో ఉన్న జీఎస్బీ సేవా మండల్లోని గణపతి విగ్రహం దేశంలోనే అత్యంత సంపన్నమైనదిగా చెబుతారు. ఈ ఆకర్షణీయమైన విగ్రహాన్ని బంగారు, వెండి ఆభరణాలతో అలంకరిస్తారు. పంచధాతు (బంగారం, వెండి, రాగి, జింక్,తగరం) మిశ్రమంతో ఈ విగ్రహాన్ని రూపొందిస్తారు.ఖేత్వాడిచా గణరాజ్ప్రకాశవంతమైన లైట్లు, పూలతో అలంకరించిన ఖేత్వాడిచా గణరాజ్ మండపం దక్షిణ ముంబైలోని ఖేత్వాడి ప్రాంతంలో ఉంది. ఇది 40 అడుగులకుపైగా ఎత్తు కలిగివుంటుంది. 1959లో తొలిసారి ఇక్కడ గణపతిని నెలకొల్పారు. ఈ పూజా వేదిక ముంబైలోని ప్రముఖ గణపతి మండపాలలో ఒకటి. -
చిత్రకూట్ దీపావళి ప్రత్యేకత ఏమిటి? మందాకినీ తీరంలో ఏం జరుగుతుంది?
మధ్యప్రదేశ్‌ని చిత్రకూట్‌లో జరిగే దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపావళి పండుగ సందర్భంగా చిత్రకూట్‌లోని మందాకిని నది తీరంలో ఐదు రోజుల పాటు జరిగే జాతరలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారు. లంకను జయించిన శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తూ, ఋషులతో కలిసి మందాకిని నదిలో దీప దానాన్ని చేశాడని స్థానికులు చెబుతారు. చిత్రకూట్‌లో దీపావళి పండుగను అయోధ్యలో జరిగే వేడుకల స్థాయిలో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ధన్తేరస్ మొదలుకొని భాయ్ దూజ్ వరకు ఐదు రోజుల పండుగ జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులు మందాకినీ నదిలో దీప దానం చేస్తారు. అంటే నదికి దీపాలు సమర్పించి, తమకు శ్రేయస్సు అందించాలని నదీమతల్లిని కోరుకుంటారు. చిత్రకూట్‌లో పదకొండున్నర సంవత్సరాలపాటు వనవాసం చేసిన శ్రీరాముడు ఇప్పటికీ ఇక్కడ తిరుగాడుతూ, భక్తులకు కనిపిస్తాడని స్థానికులు చెబుతుంటారు. దీపావళి సందర్భంగా ఇక్కడ నిర్వహించే ఐదు రోజుల దీప దాన ఉత్సవం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రతీయేటా 20 నుంచి 25 లక్షల మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇది కూడా చదవండి: డోంగర్‌ఘఢ్‌కు ప్రధాని మోదీ.. బమ్లేశ్వరి ఆలయంలో పూజలు -
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: బంగారు తిరుచ్చి ఉత్సవం (ఫొటోలు)
-
జీఆర్టీ జ్యువెలర్స్ ‘సిల్వర్ ఉత్సవ్’
హైదరాబాద్: జీఆర్టీ జ్యువెలర్స్ వెండి వస్తువులు, వెండి ఆభరణాల అతిపెద్ద కలెక్షన్లతో ‘సిల్వర్ ఉత్సవ్’ను తీసుకొచి్చంది. పూజా సామగ్రి నుంచి డిన్నర్ సెట్ల వరకూ ప్రతి శ్రేణిలో డిజైన్లను అత్యంత స్వచ్ఛత, నాణ్యతతో తీర్చిదిద్దారు.వెండి వస్తువుల తరుగుపై 25%, వెండి ఆభరణాల మీద 10% తగ్గింపు పొందవచ్చు. ‘సిల్వర్ ఉత్సవ్ ద్వారా కస్టమర్లకు ప్రశాంతమైన, మంగళకరమైన అనుభవాన్ని అందించాలని భావిస్తున్నాము. తదనుగుణంగా ప్రతి డిజైన్‌ను రూపొందించాము’ అని జీఆర్టీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అనంత పద్మనాభన్ అన్నారు. -
Manchu Manoj: సాయి స్పోర్ట్స్ ఉత్సవ్ సక్సెస్ వేడుకలో మంచు మనోజ్ సందడి (ఫొటోలు)
-
బల్లారి ఉత్సవ్‌లో రూ.20 కోట్ల శునకం.. చూసేందుకు ఎగబడ్డ జనం..
బెంగళూరు: కర్ణాటకలో నిర్వహించిన బల్లారి ఉత్సవ్‌లో ఓ శునకాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఎందుకంటే ఇది మామాలు శునకం కాదు. దేశంలోనే అత్యంత ఖరీదైన అరుదైన జాతి కుక్క. దీని ధర రూ.20కోట్లు. కాకేసియన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ శునకం యజమాని బెంగళూరు వ్యాపారవేత్త సతీశ్. దీన్ని కొనేందుకు ఇటీవల కొందరు కళ్లు చెదిరే ధర ఆఫర్ చేసినా ఇతను తిరస్కరించాడు. ఈ శునకానికి కెడబామ్ హైదర్ అని పేరు పెట్టాడు సతీష్. దీని వయసు 14 నెలలు. నిలబడితే 6 అడుగుల ఎత్తు ఉంటుంది. బరువు దాదాపు 100 కిలోలు. దీన్ని పోషించేందుకు రోజుకు రూ.2,000 ఖర్చు చేస్తున్నాడు. బల్లారి ఉత్సవ్‌లో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి దీన్ని ఏసీ కారులో తీసుకెళ్లాడు. ఖరీదైన జాతులు.. ఇదే కాదు సతీష్ వద్ద మరో రెండు అరుదైన శునకాల జాతులు కూడా ఉన్నాయి. రూ.కోటి ధర ఉన్న కొరియన్ డొసా మస్టిఫ్, అలాగే రూ.8 కోట్ల ధర పలికే అలస్కన్ మలమ్యూట్ బ్రీడ్ శుకనం కూడా ఉంది. తన వద్ద కాకేసియన్ షెఫర్డ్ జాతికి చెందిన రెండు కుక్కపిల్లలు కూడా ఉన్నాయని, ఒక్కోదానికి రూ.5 కోట్లు ఇచ్చి కొంటామని ఆపర్లు వస్తున్నాయని సతీష్ పేర్కొన్నాడు. బల్లారి ఉత్సవాలు జనవరి 21, 22 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగాయి. నిర్వాహకులు ఇక్కడ శునకాల పోటీలు నిర్వహించారు. 50 రకాల బ్రీడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. సతీష్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఆయన కాకేసియన్ షెఫర్డ్‌తో వచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. దీంతో ఈ అరుదైన శునకాన్ని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. Meet Cadabom Hayder Royal dog Rs 20 crore🥰 pic.twitter.com/wQVKXB5bnD — Deepthy (@mani_deepthi) January 7, 2023 చదవండి: నెరవేరిన దశాబ్దాల కల.. ఆమె కమాండ్‌లో... -
విజయవాడలో నేడు, రేపు వాణిజ్య ఉత్సవం
-
ఉత్సవంతో వచ్చిన కరోనా: అటవీ గ్రామాల్లో కల్లోలం
ఆసిఫాబాద్: ఆరు ఊర్లను ఉప్పెనలా ముంచింది... గడపగడపకు రోగులు.. ప్రతి ఇల్లు ఒక క్వారంటైన్ మారింది.. కాటేసే రోగం దెబ్బకు నిద్రలేని రాత్రులు గడపుతున్నారు.. పల్లెలపై కరోనా పంజా విసిరింది. హోలీ సందర్భంగా నిర్వహించిన ఉత్సవం ఆ గ్రామాలను కరోనా కొంపముంచేసింది. ప్రస్తుతం ఆరు ఊర్లు కరోనాతో అల్లాడుతున్నాయి. ఒక్క ఉత్సవం ఆ అటవీ జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చేలా చేసింది. హోలీ సందర్భంగా గిరిజనులు లేంగి ఉత్సవాన్ని లింగపూర్ మండలంలోని మోతిపటార్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి దాదాపు ఐదు వేల మందికి పైగా గిరిజనులు హజరయ్యారు. మహారాష్ట్ర నుంచి కూడా వందల సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు. ఆ ఉత్సవాల్లో ఆడిపాడి సరదాగా గడిపారు. అయితే ఆ ఉత్సవంలోనే మహారాష్ట్ర నుంచి వచ్చిన వారి వలన కరోనా వ్యాపించింది. మహారాష్ట్ర వారితో సోకిన కరోనా ప్రస్తుతం ప్రతి ఊరికి పాకింది. కొత్తపల్లి గ్రామంలో 1,200 మంది ఉంటే వీరిలో 400 మంది కరోనా బారిన పడ్డారు. ఇంటికి ఒకరు కరోనాతో సతమతమవుతున్నారు. ఉత్సవంలో పాల్గొన్న మిగతా గ్రామాలు మోతిపటార్,లింగపూర్, మామిడిపల్లి, మరో రెండు గ్రామాల్లో ఇదే పరిస్థితి. పరీక్షలు నిర్వహిస్తున్నా కొద్ది కేసులు పెరుగుతున్నాయి. కరోనా విస్తరిస్తుండడంతో పల్లెవాసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కరోనా ఉగ్రరూపంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ గ్రామాల్లో ప్రత్యేకంగా క్యాంపులు వేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ తెలిన వారికి హోంక్వారంటైన్ చేస్తూ వైద్యం అందిస్తున్నారు. ప్రతి ఇల్లు హోంక్వారంటైన్ మారింది. ఒక మహిళ కరోనాతో ప్రాణాలు కోల్పోయింది కూడా. కరోనా ప్రస్తుతం ఇతర గ్రామాలకు విస్తరించకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వైద్యాధికారులు మకాం వేసి రోగులు కోలుకోవడానికి వైద్యం అందిస్తున్నారు. ఉత్సవం జరిగి 22 రోజులు దాటిన తర్వాత కేసులు పెరుగుతున్నాయి. ఈ గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నారు. గ్రామాల సరిహద్దులు మూసివేశారు. ఇతర ప్రాంతాల వాళ్లు ఈ గ్రామాలకు రాకుండా.. ఇక్కడి నుంచి ఇతర గ్రామాలకు వెళ్లకుండా రాకపోకలు నిషేధం విధించారు. నిత్యావసర వస్తువులు గ్రామస్తులకు అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ఉత్సవమే కరోనా విజృంభణకు కారణంగా తెలుస్తోంది. చదవండి: సంపూర్ణ లాక్డౌన్.. రేపటి నుంచి 1వరకు -
హద్దు మీరిన తెలుగు తమ్ముళ్ల ఆగడాలు
-
వైభవంగా ముత్యాలమ్మ ప్రతిష్టా మహోత్సవం
తూర్పుగోదావరి (ముంగండ): ముంగండ మండలంలోని ముంగండ గ్రామంలో ముత్యాలమ్మ నూతన ఆలయ, విగ్రహ పునః ప్రతిష్టా మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవతా ప్రార్ధన, యాగశాల ప్రవేశంతో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. గణపతి పూజ, పుణ్య వాహచనం, పంచగవ్యం, దీక్షా అగ్ని ప్రతిష్టాపన, హోమాలు, ధ్వజారోహణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి సత్యనారాయణశాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో గ్రామస్ధులతో పాటు పరిశర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అమ్మవారి ఆలయ పునర్మిణానికి గ్రామస్తులు, ఆడపడుచులు, దాతలు సహకారం అందించారు. మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ నాయకులు విలేకరులకు తెలిపారు. చివరి రోజైన గురువారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని వారు వివరించారు.