Japanese Ramayana Movie Full Details All You Need To Know - Sakshi
Sakshi News home page

Adipurush-Ramayana Movie: జపనీస్‌లో 30 ఏళ్ల క్రితమే 'రామాయణం'.. అప్పట్లోనే 80 కోట్లు!

Published Sat, Jun 17 2023 1:20 PM | Last Updated on Sat, Jun 17 2023 3:16 PM

Japanese Ramayana Movie Full Details All You Need To Know - Sakshi

'ఆదిపురుష్'.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించే డిస్కషన్. ఫ్రెండ్స్, నెటిజన్స్ ఇలా ఎవరిని తీసుకున్నా సరే వాళ్ల మధ్య హాట్ టాపిక్ ఈ మూవీనే. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకులని అలరించడంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయింది. మరోవైపు 'ఆదిపురుష్'ని దాదాపు 30 ఏళ్ల క్రితం జపనీస్ లో వచ్చిన 'రామాయణ్' మూవీతో పోల్చి చూస్తున్నారు. దీంతో ఆ చిత్రం కాస్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటా సినిమా ప‍్రత్యేకత?

రామాయణం గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రకరకాల మాధ్యమాల్లో రాముడి కథని మనం వింటున్నాం, చూస్తూనే ఉన్నాం. తెలుగులో కొన్నాళ్ల ముందు దర్శకుడు బాపు.. 'శ్రీ రామరాజ్యం' తీసి జనాల్ని భక్తి పారవశ్యంలో ముంచారు. ఇప్పుడు రిలీజైన 'ఆదిపురుష్' వల్ల మరోసారి ఈ ఇతిహాసం గురించి మాట్లాడుకునే ఛాన్స్ దక్కింది. మన దేశంలో రామాయణం ఆధారంగా సినిమాలు, సీరియల్స్ బోలెడన్నీ వచ్చాయి. కానీ అసలు ఏ మాత్రం సంబంధం లేని జపాన్ లో కూడా 1992లోనే 'రామాయణ: ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' అనే యానిమేటెడ్ మూవీ తీశారు. హిట్ కూడా కొట్టారు. 

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ సరికొత్త రికార్డు.. దేశంలో ఫస్ట్ హీరోగా!)

వాల్మీకి రామాయణం ఆధారంగా తీసిన సినిమాల్లో ఈ జపనీస్ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు! 1980లో జపనీస్ యానిమేటర్ యుగో సాకో తొలిసారి మనదేశాన్ని సందర్శించారు. ఆ టైంలో రామాయణాన్ని విజువల్ గా చూపిద్దామనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఆ తర్వాత దశాబ్ద కాలంలో దాదాపు 60 సార్లు భారతదేశానికి వచ్చివెళ్లారు. 1985లో ఈయన అయోధ్యని దర్శించినప‍్పుడు.. రామాయణాన్ని డాక్యుమెంటరీగా తీయాలని ఫిక్స్ అయ్యారు.

ఆ తర్వాత యుగో సాకో.. ఫాదర్ ఆఫ్ ఇండియన్ యానిమేషన్ మోహన్ తోపాటు 450 మందితో కలిసి పనిచేసి, రామాయణాన్ని ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ గా తీర్చిదిద్దారు. దీన్ని ఎందుకు యానిమేషన్ లో తీయాల్సి వచ్చిందో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. 'రాముడు దేవుడు. ఎవరైనా యాక్టర్ కంటే యానిమేషన్ లో తీస్తేనే బెస్ట్' అని సాకో చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్‌ డే కలెక్షన్స్ తుఫాన్)

జపనీస్ థియేటర్లలో 1992లో రిలీజైన 'రామాయణ: ద లెజెండ్ ఆఫ్ ప్రిన్ రామ'.. అక‍్కడి ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. మన దగ్గర మాత్రం ఈ సినిమాకు పెద్దగా ఆదరణ దక్కలేదు. పబ్లిసిటీ సరిగా చేయకపోవడమే దీనికి కారణమని పలు మీడియా రిపోర్ట్స్ చెప్పుకొచ్చాయి. ఇప్పుడొచ్చిన 'ఆదిపురుష్'ని దాదాపు రూ.500 కోట్లతో నిర్మిస్తే.. జపనీస్ రామాయణాన్ని 1992లోనే రూ.80 కోట్ల జపనీస్ యెన్ తో నిర్మించడం విశేషం. ఈ సినిమాలోని పాత్రలకు పలువురు హిందీ ప్రముఖ నటులు డబ్బింగ్ చెప్పారు.

అయితే జపనీస్ 'రామాయణ్' మూవీని స్పూర్తిగా తీసుకునే ఓం రౌత్ 'ఆదిపురుష్' తీశాడని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియదు. ఒకవేళ తీశాడే అనుకున్నా.. ఇప్పుడున్న టెక్నాలజీ, యాక్టర్స్, బడ్జెట్ ఉపయోగిం‍చి ఇంకా బాగా తీయొచ్చు. కానీ ఆ విషయంలో ఓం రౌత్ పూర్తిగా ఫెయిలయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే టైంలో 'ఆదిపురుష్' కంటే జపనీస్ లో వచ్చిన 'రామాయణ' బెటర్ అని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: Adipurush Review: ‘ఆదిపురుష్‌’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement