కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే | Lara Dutta to portray Kaikeyi in Nitesh Tiwari Ramayan | Sakshi
Sakshi News home page

కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే

Published Thu, May 2 2024 6:39 AM | Last Updated on Thu, May 2 2024 11:54 AM

Lara Dutta to portray Kaikeyi in Nitesh Tiwari Ramayan

‘‘రామాయణ్‌’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించాలనే ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు? ఆ సినిమాలో నటించమని ఇప్పటివరకూ ఎవరూ నన్ను సంప్రదించలేదు. ఆ అవకాశం వస్తే మాత్రం నటించేందుకు నేను సిద్ధం’’ అన్నారు బాలీవుడ్‌ బ్యూటీ లారా దత్తా. ‘దంగల్‌’ ఫేమ్‌ నితీష్‌ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ్‌’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 

మూడు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. కాగా ఈ చిత్రంలోని నటీనటులపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ, రాముడిగా రణబీర్‌ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారని లీక్‌ అయిన ఒక ఫొటో స్పష్టం  చేసింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కైకేయి పాత్రలో లారా దత్తా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించారు లారా దత్తా. ‘‘రామాయణ్‌’లో నేను కైకేయి పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవి విన్నప్పుడు సంతోషంగానే ఉంది. 

ఎందుకంటే.. అంత గొప్ప సినిమాలో నటించాలని ఎవరు కోరుకోరు? ఒకవేళ ఈ మూవీలో నాకు అవకాశం వస్తే కైకేయి పాత్రే కాదు.. శూర్పణఖ, మండోదరి లాంటి క్యారెక్టర్స్‌ చేయడానికి కూడా నేను రెడీ. ఈ మూడు పాత్రల్లో దేనికైనా నేను చక్కగా సరిపోతాను’’ అంటూ తన మనసులోని మాటని బయటపెట్టారు లారా దత్తా. మరి... ఈ మూడు ్రపాతల్లో ఏదో ఒకటి చేసే చాన్స్‌ లారా దత్తాకి వస్తుందా? అనేది చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement